MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babufe8e38e0-ce55-4fa7-bc17-0c086667bb81-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babufe8e38e0-ce55-4fa7-bc17-0c086667bb81-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'శ్రీమంతుడు' సినిమా కాపీ రైట్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. శరత్ చంద్ర అనే రచయిత తన కథను కాపీ కొట్టి ఈ సినిమా తెరకెక్కించారని ఆరోపిస్తూ కోర్టుకు వెళ్లారు.దీనికి సంబంధించి ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ పై క్రిమినల్ కేసు కూడా నమోదైంది.అయితే ఈ వివాదం ఇంకా తేలకముందే, ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ నటించిన 'మహర్షి' మూవీ కూడా చిక్కుల్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం 'మహర్షి'. ఈ Mahesh Babu{#}Shiva;vamsi paidipally;Rajani kanth;producer;Blockbuster hit;lord siva;Producer;Chitram;Hero;Darsakudu;sharath chandra;Criminal;Director;Writer;CBN;mahesh babu;sree;Cinemaఅతనేంటి మహేష్ సినిమాలపై పగబడుతున్నాడు?అతనేంటి మహేష్ సినిమాలపై పగబడుతున్నాడు?Mahesh Babu{#}Shiva;vamsi paidipally;Rajani kanth;producer;Blockbuster hit;lord siva;Producer;Chitram;Hero;Darsakudu;sharath chandra;Criminal;Director;Writer;CBN;mahesh babu;sree;CinemaThu, 15 Feb 2024 11:45:15 GMTటాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'శ్రీమంతుడు' సినిమా కాపీ రైట్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. శరత్ చంద్ర అనే రచయిత తన కథను కాపీ కొట్టి ఈ సినిమా తెరకెక్కించారని ఆరోపిస్తూ కోర్టుకు వెళ్లారు.దీనికి సంబంధించి ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ పై క్రిమినల్ కేసు కూడా నమోదైంది.అయితే ఈ వివాదం ఇంకా తేలకముందే, ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ నటించిన 'మహర్షి' మూవీ కూడా చిక్కుల్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం 'మహర్షి'. ఈ మూవీ కథ కూడా కాపీ అంటూ శరత్‌ చంద్ర సంచలన ఆరోపణలు చేశారు. తను రాసిన 'సమాహారం' అనే నవలలోని కొన్ని సన్నివేశాలు ఈ మూవీలో కనిపిస్తున్నాయని అన్నారు. 'శ్రీమంతుడు' కేసుపై తీర్పు వెలువడగానే, 'మహర్షి' సినిమా విషయంలో తన హక్కును పొందేందుకు కోర్టును ఆశ్రయిస్తానని ఆయన అంటున్నారు.'మహర్షి' సినిమా మహేష్ బాబు కెరీర్ లో మైలురాయి 25వ చిత్రం.


శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పివిపి సినిమా సంస్థలు ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించాయి. 2019లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద 200 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలాగే నేషనల్ ఫిలిం అవార్డ్స్ కూడా సాధించి, జాతీయ స్థాయిలో ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. అలాంటి సినిమా కాపీ అంటూ శరత్ చంద్ర కామెంట్స్ చేయడం ఇప్పుడు సినీ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.స్వాతి వారపత్రికలో ప్రచురితమైన తన 'చచ్చేంత ప్రేమ' కథ నుండి సీన్ బై సీన్ కాపీ చేసి 'శ్రీమంతుడు' మూవీ తీశారని శరత్ చంద్ర ఆరోపిస్తూ వస్తున్నారు. అయితే ఈ వివాదం ఓ కొలిక్కి రాకముందే.. ఇప్పుడు వంశీ పైడిపల్లి కూడా తన కథను కాపీ కొట్టి 'మహర్షి' మూవీ తీసినట్లుగా రచయిత ఆరోపిస్తున్నారు. యాదృచ్ఛికంగా ఈ రెండు సినిమాల్లో కూడా మహేష్ బాబే హీరో. మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ విషయంలో మండిపడుతున్నారు. ఇతనేంటి మా మహేష్ బాబు సినిమాలపై పడ్డాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మరి ఈ విషయంపై ప్రొడ్యూసర్ దిల్ రాజు, డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఎలా స్పందిస్తారో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>