Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricke2c63f416-2d15-4acc-90f8-255fa5355c1a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricke2c63f416-2d15-4acc-90f8-255fa5355c1a-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ వ్యవహరిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు నేషనల్ క్రికెట్ అకాడమీ చైర్మన్ గా వ్యవహరించిన రాహుల్ ద్రవిడ్.. ఇక భారత జట్టుకు ఎంతో మంది యువ ఆటగాళ్లను అందించాడు. ఇక ఎప్పటికప్పుడు కొత్త ప్రతిభను తెరమీదకి తీసుకురావడంలో రాహుల్ ద్రవిడ్ కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతని కోచింగ్ సామర్థ్యాన్ని గుర్తించిన బీసీసీఐ పెద్దలు రవి శాస్త్రి కోచ్ పదవీకాలం ముగియగానే రాహుల్ ద్రావిడ్ కి హెడ్ కోచ్ పదవీ కోసం సంప్రదించారు. ఈ క్రమంలోనే మొదట ద్రావిడ్ ఒప్Cricke{#}ravi shastri;Yevaru;Yuva;ICC T20;BCCI;Cricket;World Cup;rahul;Rahul Sipligunj;Indiaద్రావిడ్ అప్పటివరకే కోచ్ గా ఉంటారు.. జై షా కీలక వ్యాఖ్యలు?ద్రావిడ్ అప్పటివరకే కోచ్ గా ఉంటారు.. జై షా కీలక వ్యాఖ్యలు?Cricke{#}ravi shastri;Yevaru;Yuva;ICC T20;BCCI;Cricket;World Cup;rahul;Rahul Sipligunj;IndiaThu, 15 Feb 2024 21:45:00 GMTప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ వ్యవహరిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు నేషనల్ క్రికెట్ అకాడమీ చైర్మన్ గా వ్యవహరించిన రాహుల్ ద్రవిడ్.. ఇక భారత జట్టుకు ఎంతో మంది యువ ఆటగాళ్లను అందించాడు. ఇక ఎప్పటికప్పుడు కొత్త ప్రతిభను తెరమీదకి తీసుకురావడంలో రాహుల్ ద్రవిడ్ కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతని కోచింగ్ సామర్థ్యాన్ని గుర్తించిన బీసీసీఐ పెద్దలు రవి శాస్త్రి కోచ్ పదవీకాలం ముగియగానే రాహుల్ ద్రావిడ్ కి హెడ్ కోచ్ పదవీ కోసం సంప్రదించారు. ఈ క్రమంలోనే మొదట ద్రావిడ్ ఒప్పుకోకపోయినప్పటికీ ఇక అతని పట్టుబట్టి మరి ఒప్పించి ఇక జట్టుకు హెడ్ కోచ్ గా మార్చారు.


 అయితే గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీ ముగిసిన వెంటనే రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్ పదవీకాలం కూడా ముగిసింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  కొత్తగా టీమిండియాకు హెడ్ కోచ్గా రాబోయేది ఎవరు అనే విషయంపై గత కొంతకాలంగా చర్చ జరుగుతుంది. అయితే ఇక కొన్నాళ్లపాటు రాహుల్ ద్రావిడ్  హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాలి అంటూ  బిసిసిఐ పెద్దలు కోరడంతో ద్రావిడ్ అంగీకరించాడు. అయితే ఇక ఇప్పుడు టి20 వరల్డ్ కప్ సమీపిస్తున్న నేపథ్యంలో ఎవరిని కొత్త కోచ్ గా నియమిస్తారు అనే విషయంపై చర్చ మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఈ విషయంపై బీసీసీఐ సెక్రెటరీ జై షా ఒక స్పష్టతను ఇచ్చేశాడు. రాహుల్ ద్రవిడ్ టి20 వరల్డ్ కప్ ముగిసే వరకు కోచ్ బాధ్యతల్లో ఉంటాడు అన్న విషయాన్ని వెల్లడించాడు జై షా. ద్రవిడ్ కోచ్ పదవీకాలం గత వన్డే వరల్డ్ కప్ తోనే ముగిసింది. అయితే బోర్డు కోరడంతో ద్రావిడ్ కోచ్ గా కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ద్రావిడ్ తో పాటు కోచింగ్ స్టాఫ్ అందరిని కూడా t20 వరల్డ్ కప్ ముగిసే వరకు కూడా కొనసాగుతారు అంటూ జై షా స్పష్టం చేశారు. దీంతో రాహుల్ ద్రావిడ్ కోచ్ గా ఉన్నాడు అంటే ఇక టి20 ఫార్మాట్లో జరుగుతున్న వరల్డ్ కప్ లో టీమిండియా విజయం సాధించడం ఖాయమని అభిమానులు అందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>