SpiritualityChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/appleb43731c2-59a9-49e3-acde-233cdd167672-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/appleb43731c2-59a9-49e3-acde-233cdd167672-415x250-IndiaHerald.jpgజుకర్ బర్గ్, స్టీవ్ జాబ్స్ వీరేమీ సాధారణ వ్యక్తులు కాదు. ఒకరు ఫేస్ బుక్ ను ఆవిష్కరించి సామాజిక మాధ్యమాల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. మరొకరు యాపిల్ అనే బ్రాండ్ ను తీసుకొచ్చారు. కేవలం ఈ రెండు సంస్థల కింద లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. పరోక్షంగా అంతే మంది ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. ఇంగ్లీష్ మూలాలు కలిగి ఉన్న వీరు క్రైస్తవ మతాన్ని ఆచరిస్తారు. అలాంటి వీరు ఆలయాన్ని సందర్శించారంటే నమ్ముతారా? సరే విదేశీ పర్యటనల్లో తమ మార్కెటింగ్ కు అనుకూలంగా ఉంటుంది కాబట్టి అలా చేస్తారనుకుంటే.. ఒక గుడిని దరapple{#}Uttarakhand;Narendra;Baba Bhaskar;history;India;Prime Ministerయాపిల్‌, ఫేస్‌బుక్‌ సృష్టికర్తలు మెచ్చిన ఆలయం?యాపిల్‌, ఫేస్‌బుక్‌ సృష్టికర్తలు మెచ్చిన ఆలయం?apple{#}Uttarakhand;Narendra;Baba Bhaskar;history;India;Prime MinisterThu, 15 Feb 2024 23:00:00 GMTజుకర్ బర్గ్, స్టీవ్ జాబ్స్ వీరేమీ సాధారణ వ్యక్తులు కాదు. ఒకరు ఫేస్ బుక్ ను ఆవిష్కరించి సామాజిక మాధ్యమాల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. మరొకరు యాపిల్ అనే బ్రాండ్ ను తీసుకొచ్చారు. కేవలం ఈ రెండు సంస్థల కింద లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. పరోక్షంగా అంతే మంది ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. ఇంగ్లీష్ మూలాలు కలిగి ఉన్న వీరు క్రైస్తవ మతాన్ని ఆచరిస్తారు.


అలాంటి వీరు ఆలయాన్ని సందర్శించారంటే నమ్ముతారా? సరే విదేశీ పర్యటనల్లో తమ మార్కెటింగ్ కు అనుకూలంగా ఉంటుంది కాబట్టి అలా చేస్తారనుకుంటే.. ఒక గుడిని దర్శించిన తర్వాత వీరు అగర్భ శ్రీమంతులయ్యారు అంటే చదువుతుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదా.. కానీ ముమ్మాటికీ నిజం. ఈ విషయాన్ని వారే స్వయంగా ఒప్పుకున్నారు. 2015లో ప్రధాని మోదీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఆయనకు ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్ బర్గ్ కలిశారు. ఈ సందర్భంగా భారత్ తో ఉన్న తన అనుబంధాన్ని పంచుకున్నారు.


యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ సూచన మేరకు నేను ఇండియాకు వచ్చాను. ఒక ఆలయాన్ని సందర్శించాను. ఆ ఆలయ సందర్శన తర్వాత నా జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి అని జూకర్ బర్గ్ మోదీతో పేర్కొన్నారు. ఆయన సందర్శించిన ఆలయం ఉత్తరాఖండ్  రాష్ట్రంలో ఉంది. ఆ రాష్ట్రంలోని నైనిటాల్ ప్రాంతంలోని కైంచి ధామ్ అనే ఆలయాన్ని సందర్శించారు.


ఇదే ఆలయాన్ని 1970లో యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ సందర్శించారు. ఈ ఆలయాన్ని సందర్శించిన తర్వాతే స్టీవ్ జాబ్స్ యాపిల్ కంపెనీని నెలకొల్పారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. కైంచి ధామ్ అనేది నైనిటాల్ ప్రాంతంలోని బాబా నీం కరోలి ఆశ్రమం. దీనిని 1960లో నీమ్ కరోలి బాబా నిర్మించినట్లు అక్కడి స్థానికులు చెబుతారు. ఆశ్రమం చుట్టూ కొండలతో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఏటా ఈ ఆలయానికి అమెరికన్లు లక్షల్లో వస్తుంటారు. అయితే ఈ ఆలయాన్ని సందర్శించిన తర్వాత తన వ్యాపార ముఖచిత్రం మారిపోయిందని అప్పట్లో జూకర్ బర్గ్ నరేంద్ర మోదీతో అన్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>