EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jaganba35d587-93f8-46dc-8610-008f1d276742-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jaganba35d587-93f8-46dc-8610-008f1d276742-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం పరిపాలన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పేద, బడుగు, బలహీన వర్గాల గురించి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. నవరత్నాలను అమలు చేసేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ వ్యవస్థను ప్రవేశ పెట్టారు. దీనిని ప్రారంభంలో పలువురు విమర్శించినా.. ఇప్పుడీ వాలంటీర్ వ్యవస్థను పలు రాష్ట్రాల సీఎంలు అనుసరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రధాని మోదీ కూడా జగన్ తరహాలోనే ఒ పథకం విషయంలో ముందుకు వెళ్తున్నారు. ఏపీలో సీఎం జగన్ అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారjagan{#}manasa;Narendra Modi;vehicles;central government;CM;Prime Minister;Jagan;Andhra Pradesh;Indiaఆ విషయంలో జగన్‌ను ఫాలో అవుతున్న మోదీ?ఆ విషయంలో జగన్‌ను ఫాలో అవుతున్న మోదీ?jagan{#}manasa;Narendra Modi;vehicles;central government;CM;Prime Minister;Jagan;Andhra Pradesh;IndiaThu, 15 Feb 2024 10:00:00 GMTఏపీ సీఎం పరిపాలన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పేద, బడుగు, బలహీన వర్గాల గురించి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. నవరత్నాలను అమలు చేసేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్  వ్యవస్థను ప్రవేశ పెట్టారు. దీనిని ప్రారంభంలో పలువురు విమర్శించినా.. ఇప్పుడీ వాలంటీర్ వ్యవస్థను పలు రాష్ట్రాల సీఎంలు అనుసరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.


ఇప్పుడు ప్రధాని మోదీ కూడా జగన్ తరహాలోనే ఒ పథకం విషయంలో ముందుకు వెళ్తున్నారు. ఏపీలో సీఎం జగన్ అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. సంక్షేమం ఇంటివద్దకే చేరుస్తున్నారు. ఇక ఆయన మానస పుత్రికగా చెప్పుకునే వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు ప్రభుత్వ పథకాలు పొందడం సులభతరం చేశారు. ప్రస్తుతం ఈ విధానాలను తమ రాష్ట్రంలో ప్రవేశ పెట్టేందుకు పలు రాష్ట్రాల నుంచి పరిశీలకులు ఏపీ వచ్చి వీటిని స్వయంగా పరిశీలిస్తున్నారు.


అలాగే ఇంటి వద్దకే రేషన్ తీసుకువచ్చే విషయంలో కూడా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని మొదట్లో పలువురు విమర్శించారు. ఒక ప్రత్యేక వాహనం ద్వారా ఇంటింటికీ రేషన్ తీసుకువచ్చే కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుట్టారు. దీని ద్వారా పారదర్శకత పెరిగింది. రేషన్ వాహనాలు సైరన్ చేస్తూ వీధుల్లోకి వెళ్లి రేషన్ సరకులను లబ్ధిదారులకు అందజేస్తోంది. దేశంలో ఇలాంటి కార్యక్రమం ఏపీలోనే జరిగింది.


ఇప్పుడు కేంద్రం దేశ వ్యాప్తంగా అందించే రేషన్ సరకులు విషయంలో సీఎం జగన్ లానే వాహనాలు ఏర్పాటు చేయాలని మోదీ సర్కారు భావిస్తోంది. ప్రస్తుతం కేంద్రం ప్రవేశ పెట్టిన భారత్ రైస్, అలానే జాతీయ స్థాయిలో గోధుములు, పప్పులను వాహనాల ద్వారా పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దేశ వ్యాప్తంగా 180 వాహనాలను ప్రస్తుతం ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో మరిన్నీ వాహనాలను పెంచే విధంగా ఆలోచన చేస్తోంది. ఇలా సీఎం జగన్ ప్రవేశ పెట్టిన రేషన్ వాహనం తరహాలో మోదీ సర్కారు ముందుకు వెళ్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>