Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/siva-karthikeyan-rukmini-vasanth92200b82-c3a6-4e3a-8158-6ef2d13a7374-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/siva-karthikeyan-rukmini-vasanth92200b82-c3a6-4e3a-8158-6ef2d13a7374-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ యువ హీరో శివ కార్తికేయన్ రీసెంట్ గా అయలాన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతికి రిలీజైన అయలాన్ సినిమా కోలీవుడ్ లో మంచి సక్సెస్ అందుకుంది. ఐతే ఈ సినిమా తెలుగు వెర్షన్ మాత్రం రిలీజ్ అవ్వలేదు. ఓటీటీలో తమిళ వర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. అసలైతే జనవరి 26న తెలుగు వెర్షన్ థియేట్రికల్ రిలీజ్ అవ్వాల్సి ఉన్న పాత లెక్కల కారణంగాSiva Karthikeyan Rukmini Vasanth{#}A R Murugadoss;January;Thriller;Yuva;Shiva;lord siva;Tamil;Director;Heroine;Success;Telugu;Cinema;Newsశివ కార్తికేయన్ సినిమా మొదలైంది..!శివ కార్తికేయన్ సినిమా మొదలైంది..!Siva Karthikeyan Rukmini Vasanth{#}A R Murugadoss;January;Thriller;Yuva;Shiva;lord siva;Tamil;Director;Heroine;Success;Telugu;Cinema;NewsThu, 15 Feb 2024 17:49:00 GMTకోలీవుడ్ యువ హీరో శివ కార్తికేయన్ రీసెంట్ గా అయలాన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతికి రిలీజైన అయలాన్ సినిమా కోలీవుడ్ లో మంచి సక్సెస్ అందుకుంది. ఐతే ఈ సినిమా తెలుగు వెర్షన్ మాత్రం రిలీజ్ అవ్వలేదు. ఓటీటీలో తమిళ వర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. అసలైతే జనవరి 26న తెలుగు వెర్షన్ థియేట్రికల్ రిలీజ్ అవ్వాల్సి ఉన్న పాత లెక్కల కారణంగా సినిమా తెలుగు రిలీజ్ ని ఆపేశారు. ఇక ఆ సినిమా తెలుగు రిలీజ్ అవ్వడం కష్టం.

ఇలా ఒక సినిమా రిలీజైందో లేదో మరో సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లాడు శివ కార్తికేయన్. ఈసారి స్టార్ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ అయిన మురుగదాస్ ఈమధ్య ఫాం కోల్పోయారు. శివ కార్తికేయన్ సినిమాతో తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన ముహుర్త కార్యక్రమాలు రీసెంట్ గా జరిగాయి.

క్రైం థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది. సప్త సాగరాలు దాటి సినిమాతో సౌత్ హాట్ ఫేవరెట్ హీరోయిన్ అయిన ఈ అమ్మడు ఇప్పుడు తెలుగు తమిళ భాషల్లో వరుస ఆఫర్లు అందుకుంటుంది. ముందు తెలుగులో నటిస్తుందని వార్తలు వచ్చినా రుక్మిణిని శివ కార్తికేయన్ సినిమాకు లాక్ చేశారు. ఈ సినిమాకు రుక్మిణి వసంత్ కూడా ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. శివ కార్తికేయన్ తో మురుగదాస్ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. శివ కార్తికేయన్ కు మురుగదాస్ కి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేసే ఛాన్సులు ఉన్నాయని చెప్పొచ్చు. రుక్మిణి వసంత్ నెక్స్ట్ సినిమా మాత్రం తెలుగులో ఉంటుందని తెలుస్తుంది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>