Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle3d9c23e1-3948-49bc-81f8-b8f6c508fa58-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle3d9c23e1-3948-49bc-81f8-b8f6c508fa58-415x250-IndiaHerald.jpgఓటీటీ లో వెబ్ సిరీస్ లకు ప్రస్తుతం మంచి క్రేజ్ వుంది.వాటిలో క్రైమ్ సిరీస్ లకు ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఇప్పటి వరకూ ఈ జానర్ లో వచ్చిన సిరీస్ లలో చాలా వరకూ ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్నవే.ఇప్పుడు అలాంటిదే మరో క్రైమ్ సిరీస్ పోచర్ ఓటీటీలోకి రాబోతోంది. ఢిల్లీ క్రైమ్ లాంటి సిరీస్ డైరెక్ట్ చేసిన రిచీ మెహతా ఈసారి కేరళ అడవుల్లో ఏనుగుల వేటకు సంబంధించి కోట్ల విలువైన స్కామ్ ను ఈ సిరీస్ లో చూపించబోతున్నాడు.బాలీవుడ్ నటి ఆలియా భట్ సహ నిర్మాతగా ఈ పోచర్ వెబ్ సిరీస్ ను తెరకెక్కించింది. అంతర్జాతీయ ఎమ్socialstars lifestyle{#}Amazon;Kerala;Alia Bhatt;INTERNATIONAL;Delhi;February;thursdayడిజిటల్ ప్లాట్ ఫామ్ పై రానున్న క్రైమ్ వెబ్ సిరీస్....!!డిజిటల్ ప్లాట్ ఫామ్ పై రానున్న క్రైమ్ వెబ్ సిరీస్....!!socialstars lifestyle{#}Amazon;Kerala;Alia Bhatt;INTERNATIONAL;Delhi;February;thursdayThu, 15 Feb 2024 22:58:20 GMTఓటీటీ లో వెబ్ సిరీస్ లకు ప్రస్తుతం మంచి క్రేజ్ వుంది.వాటిలో క్రైమ్ సిరీస్ లకు  ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఇప్పటి వరకూ ఈ జానర్ లో వచ్చిన సిరీస్ లలో చాలా వరకూ ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్నవే.ఇప్పుడు అలాంటిదే మరో క్రైమ్ సిరీస్ పోచర్ ఓటీటీలోకి రాబోతోంది. ఢిల్లీ క్రైమ్ లాంటి సిరీస్ డైరెక్ట్ చేసిన రిచీ మెహతా ఈసారి కేరళ అడవుల్లో ఏనుగుల వేటకు సంబంధించి కోట్ల విలువైన స్కామ్ ను ఈ సిరీస్ లో చూపించబోతున్నాడు.బాలీవుడ్ నటి ఆలియా భట్ సహ నిర్మాతగా ఈ పోచర్ వెబ్ సిరీస్ ను తెరకెక్కించింది. అంతర్జాతీయ ఎమ్మీ అవార్డు గెలుచుకున్న రిచీ మెహతా డైరెక్షన్ లో వస్తున్న సిరీస్ కావడంతో ఈ పోచర్ పై ఆసక్తి నెలకొంది. కేరళ అడవుల్లో ఏనుగుల వేట రాకెట్ చుట్టూ ఈ కథ నడుస్తున్నట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. గురువారం (ఫిబ్రవరి 15) ఈ ట్రైలర్ ను ఆలియా తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది."ఇండియాలోని అతి పెద్ద క్రైమ్ రాకెట్స్ లో ఇదీ ఒకటి" అనే క్యాప్షన్ తో ఆలియా సిరీస్ ఈ ట్రైలర్ ను షేర్ చేసింది. కేరళ అడవుల్లో ఓ ఏనుగును ఓ ముఠా మట్టుబెట్టే సీన్ తో ట్రైలర్ మొదలువుతుంది.1990ల నుంచి సైలెంట్ గా ఉన్న ఈ ఏనుగులను వేటాడే ముఠా మళ్లీ యాక్టివ్ అయిందంటూ ఈ రాకెట్ ను ఇన్వెస్టిగేట్ చేసే టీమ్ మాట్లాడుకుంటూ ఉంటుంది.అసలు దేశ చరిత్రలోనే ఇంత పెద్ద క్రైమ్ రాకెట్ లేదు అన్నట్లుగా ట్రైలర్ లో చూపించారు.. దీని విలువ ఏకంగా రూ.కోటి కోట్లని ట్రైలర్ చివర్లో చెప్పడం సమస్య తీవ్రత ఏంటో మేకర్స్ తెలియజేశారు.పోచర్ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ట్రైలర్ ద్వారా వెల్లడించారు.ఈ పోచర్ వెబ్ సిరీస్ కు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఆలియా.. దీనిని బాగా ప్రమోట్ చేస్తోంది. ఈ మధ్యే తాను అడవిలో ఉన్న ఓ వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఆ అడవిలో ఏనుగులను చంపుతున్న తీరుపై ఆ వీడియోలో ఆలియా మాట్లాడింది. అక్కడ కనిపించిన ఓ రైఫిల్, బుల్లెట్ కేసింగ్స్ మరియు ఓ ఏనుగు కళేబరం ఆలియాను భయపెడతాయి.ఏనుగుల వేట ఎంత పెద్ద రాకెటో చెప్పే ప్రయత్నంలో భాగంగా తాను ఒక రోజు ఆ అడవిలో గడిపానని, కానీ ఆ సమయంలోనే అక్కడి దారుణాలు చూసి తన వెన్నులో వణుకు పుట్టిందని ఆమె చెప్పడం విశేషం.. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ పోచర్ సిరీస్.. ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలియజేశారు...



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>