Technologypraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/beerf8e78ca9-5c1c-45cd-9552-2ecba83b9bc0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/beerf8e78ca9-5c1c-45cd-9552-2ecba83b9bc0-415x250-IndiaHerald.jpgమద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఇటీవల కాలంలో మాత్రం మద్యం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. సంతోషం వచ్చిన దుఃఖం వచ్చిన ఫంక్షన్ జరిగిన చివరికి చావు కార్యం జరిగిన కూడా అక్కడ తప్పకుండా మందుచుక్క ఉండాల్సిందే. లేదంటే తమ స్టేటస్ ఎక్కడ పడిపోతుందో అని చాలామంది అనుకుంటున్నారు. దీంతో ప్రతి ఫంక్షన్లో కూడా ఇటీవల కాలంలో మద్యం ఉండడం సర్వసాధారణంగా మారిపోయింది అని చెప్పాలి. నేటి రోజుల్లో యువత కూడా మద్యానికి ఇక అలవాటు పడిపోతున్నారు. కొంతమంది అయితే ప్రతిరోజు ఒక బీరు తాగBeer{#}Santosham;surya sivakumarబీరు బాటిల్స్ గ్రీన్ కలర్ లో ఉండడం వెనక.. ఇంత సైంటిఫిక్ రీజన్ ఉందా?బీరు బాటిల్స్ గ్రీన్ కలర్ లో ఉండడం వెనక.. ఇంత సైంటిఫిక్ రీజన్ ఉందా?Beer{#}Santosham;surya sivakumarWed, 14 Feb 2024 16:54:24 GMTమద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఇటీవల కాలంలో మాత్రం మద్యం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. సంతోషం వచ్చిన దుఃఖం వచ్చిన ఫంక్షన్ జరిగిన చివరికి చావు కార్యం జరిగిన కూడా అక్కడ తప్పకుండా మందుచుక్క ఉండాల్సిందే. లేదంటే తమ స్టేటస్ ఎక్కడ పడిపోతుందో అని చాలామంది అనుకుంటున్నారు. దీంతో ప్రతి ఫంక్షన్లో కూడా ఇటీవల కాలంలో మద్యం ఉండడం సర్వసాధారణంగా మారిపోయింది అని చెప్పాలి. నేటి రోజుల్లో యువత కూడా మద్యానికి ఇక అలవాటు పడిపోతున్నారు. కొంతమంది అయితే ప్రతిరోజు ఒక బీరు తాగకుండా నిద్ర పట్టదు అని చెబుతూ ఉంటారు.


 అంతలా ఆల్కహాల్ కి ఎడిక్ట్ అయిపోతున్నారు అని చెప్పాలి. మరి ముఖ్యంగా ఎండాకాలం వస్తున్న నేపథ్యంలో ఇక ఎండవేడికి చల్ల చల్లని బీరు తాగితే ఏకంగా అమృతం కంటే బాగుంటుంది అని ఎంతోమంది బీరు ప్రియులు చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎండాకాలంలో బీర్ల అమ్మకాలు ఒక్కసారిగా ఎంతలా పెరిగిపోతూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో కానీ బీరు సీసాలు గ్రీన్ లేదా గోధుమ రంగులో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే బీర్ సీసాలకు కేవలం ఈ రెండు కలర్స్ మాత్రమే ఎందుకు ఉంటాయి అని ఎప్పుడైనా గమనించారా?


 అయితే చాలా ఏళ్ల కిందట బీరును పారదర్శక సీసాలలో స్టోర్ చేసేవారట. అవి సూర్యరశ్మికి గురైనప్పుడు యువీ కిరణాలు బీర్ లోపల ఉన్న రసాయనాలని వేగంగా మార్చడాన్ని నిపుణులు గమనించారు. దానివలన బీర్ టెస్ట్ మారిపోయిందట. దీంతో వారు బీర్ను సూర్య రష్మీ నుంచి కాపాడడానికి కాంతిని చెదరగొట్టే వివిధ రంగులతో సీసాలను తయారు చేశారు. ఇలాంటి సమయంలోనే గ్రీన్, బ్రౌన్ కలర్ లో తయారు చేసిన సీసాల లోపలికి సూర్యరశ్మి ప్రవేశించలేక పోయిందట. కాగా మొదట బ్రౌన్ కలర్ బీర్ సీసాను తయారుచేసి అందులో బీరు స్టోర్ చేయడం మొదలు పెట్టారట. ఇక ఆ తర్వాత కాలంలో గ్రీన్ కలర్ సీసాలలో కూడా బీర్ ని స్టోర్ చేయడం మొదలు పెట్టారట. ఇక ఈ రెండు కలర్స్ కి ఎక్కువ రెస్పాన్స్ రావడంతో అప్పటినుంచి ఈ రెండు కలర్స్ ఉన్న బీరు సీసాలలోనే బీరు పోసి స్టోర్ చేస్తూ ఉన్నారట.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>