MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mister-bacchanb6ab1141-4392-4a43-81ba-0c516f816558-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mister-bacchanb6ab1141-4392-4a43-81ba-0c516f816558-415x250-IndiaHerald.jpgటాక్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ జెట్‌ వేగంతో దూసుకుపోతున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో మాస్ మహారాజా రవితేజ. రీసెంట్‌ గా ఈగల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన..ఈసారి హిట్ కొట్టాడు. కానీ వసూళ్లు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. కానీ రవి తేజ లాస్ట్ రెండు సినిమాల కంటే ఈ సినిమా చాలా బెటర్.రవితేజ ఇప్పుడు తన కొత్త సినిమా మిస్టర్‌ బచ్చన్‌ షూటింగ్‌ తో బాగా బిజీగా ఉన్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి కాగా, ఇటీవలే మరMister Bacchan{#}Ajay Devgn;harish shankar;vishwa;devineni avinash;Mister;Valentines Day;ravi anchor;Mass;kalyan;Posters;ravi teja;Ravi;Josh;media;shankar;maya;Hero;Heroine;Tollywood;vivek;Cinema;Romantic;Loveమిస్టర్ బచ్చన్: అదరగొడుతున్న రొమాంటిక్ పోస్టర్?మిస్టర్ బచ్చన్: అదరగొడుతున్న రొమాంటిక్ పోస్టర్?Mister Bacchan{#}Ajay Devgn;harish shankar;vishwa;devineni avinash;Mister;Valentines Day;ravi anchor;Mass;kalyan;Posters;ravi teja;Ravi;Josh;media;shankar;maya;Hero;Heroine;Tollywood;vivek;Cinema;Romantic;LoveWed, 14 Feb 2024 13:25:45 GMTటాక్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ జెట్‌ వేగంతో దూసుకుపోతున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో మాస్ మహారాజా రవితేజ. రీసెంట్‌ గా ఈగల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన..ఈసారి హిట్ కొట్టాడు. కానీ వసూళ్లు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. కానీ రవి తేజ లాస్ట్ రెండు సినిమాల కంటే ఈ సినిమా చాలా బెటర్.రవితేజ ఇప్పుడు తన కొత్త సినిమా మిస్టర్‌ బచ్చన్‌ షూటింగ్‌ తో బాగా బిజీగా ఉన్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి కాగా, ఇటీవలే మరో కీలక షెడ్యూల్‌ కూడా పూర్తయింది.ఇక ఈ సినిమాను ఎంతో వేగంగా చేస్తున్నట్లు హరీశ్ శంకర్ వెల్లడించారు. ఎందుకంటే ఈ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, చిరంజీవి, బాలయ్యతో చెయ్యాల్సిన సినిమాలు కూడా ఉన్నాయి.దీంతో ఈ మూవీ అనుకున్న సమయానికే విడుదల అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.తాజాగా మిస్టర్ బచ్చన్ మేకర్స్ వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఫుల్ మాస్ వ్యక్తులు కూడా అత్యంత మృదువైన మనుసులను కలిగి ఉంటారంటూ మూవీ యూనిట్ X లో పోస్ట్ చేసింది.అందరికీ కూడా వాలెంటైన్స్ డే విషెస్ చెప్పింది. మేకర్స్ రిలీజ్ చేసిన రొమాంటిక్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. రవితేజ ఒడిలో హీరోయిన్ కూర్చోగా అప్యాయంగా హగ్ చేసుకుంటున్నట్లు ఉన్న ఈ పోస్టర్ అయితే అదిరిపోయింది.డార్క్ గ్రీన్ కలర్ చీరలో హీరోయిన్ భాగ్యశ్రీ బొర్సే తన నవ్వుతోనే మాయ చేస్తోంది. మాస్ మహారాజా కలర్ ఫుల్ షర్ట్ లో హాట్ బ్యూటీని హాగ్ చేసుకుంటూ క్లాసీగా కనిపించారు. మొత్తానికి సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ అదిరిపోనుందని మాస్ రాజా రవితేజ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమాలో సూపర్ లవ్ ట్రాక్ ఉందని పోస్టర్ చూస్తే అర్ధమవుతోందని అంటున్నారు.ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీకి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తుండగా, ఎడిటర్ గా ఉజ్వల్ కులకర్ణి పనిచేస్తున్నారు. హిందీలో సూపర్ హిట్ అయిన అజయ్ దేవగణ్ రైడ్ సినిమాకి రీమేక్‌ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈగల్ మూవీతో హిట్ కొట్టిన రవితేజ.. ఇక ఆ జోష్ ను కంటిన్యూ చేస్తారో లేదో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>