HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/cockroach-home99a47180-20a6-45cc-bf6a-07b086096573-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/cockroach-home99a47180-20a6-45cc-bf6a-07b086096573-415x250-IndiaHerald.jpgమన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల తిరగని మూలలో కూడా బొద్దింకలు తెరగా తిరిగేస్తూ ఉంటాయి.ఈ బొద్దింకలను చూసి చాలామంది భయపడుతూ ఉంటారు కూడా.ఈ బొద్దింకలు ఎక్కువగా సామాన్లు పెట్టే ప్రదేశంలోనూ,ఉప్పులు,పప్పులు దాచుకునే సెల్పులను, సింకుల దగ్గర,చెత్తబుట్టల దగ్గర ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాటి ఆహారం అక్కడ ఎక్కువగా దొరుకుతాది కాబట్టి. బొందింకలను ఎంత నిర్మూలించాలి అని అనుకున్నా సరే అవి మళ్లీ మళ్లీ వస్తూ ఉంటాయి.ఇంకా కొంతమంది అయితే మార్కెట్లో దొరికే కెమికల్ హీట్లు వాడి,చంపేస్తూ ఉంటారు.దీనివల్ల వాటికి ఎంత సమస్య వస్COCKROACH;HOME{#}Mixie;Turmericబొద్దింకలను ఇంట్లో నుంచి తరిమేయాలా.. ఇలా చేస్తే సరి..!!బొద్దింకలను ఇంట్లో నుంచి తరిమేయాలా.. ఇలా చేస్తే సరి..!!COCKROACH;HOME{#}Mixie;TurmericWed, 14 Feb 2024 06:00:00 GMTమన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల తిరగని మూలలో కూడా బొద్దింకలు తెరగా తిరిగేస్తూ ఉంటాయి.ఈ బొద్దింకలను చూసి  చాలామంది భయపడుతూ ఉంటారు కూడా.ఈ బొద్దింకలు ఎక్కువగా సామాన్లు పెట్టే ప్రదేశంలోనూ,ఉప్పులు,పప్పులు దాచుకునే సెల్పులను, సింకుల దగ్గర,చెత్తబుట్టల దగ్గర ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాటి ఆహారం అక్కడ ఎక్కువగా దొరుకుతాది కాబట్టి.

బొందింకలను ఎంత నిర్మూలించాలి అని అనుకున్నా సరే అవి మళ్లీ మళ్లీ వస్తూ ఉంటాయి.ఇంకా కొంతమంది అయితే మార్కెట్లో దొరికే కెమికల్ హీట్లు వాడి,చంపేస్తూ ఉంటారు.దీనివల్ల వాటికి ఎంత సమస్య వస్తుందో కానీ, మనకు మాత్రం అలర్జీలు తప్పకుండా వస్తాయి.అలా సమస్యలు రాకుండా ఉండాలి అంటే,మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే న్యాచురల్ హిట్లు తయారుచేసి కొట్టడం వల్ల,బొద్దింకలను పారద్రోలచ్చు.అవేలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండీ..

దీని కోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక స్పూన్ బేకింగ్ సోడా,ఐదారు లవంగాలు,ఒక ఇంచు దాల్చిన చెక్క,రెండు బిర్యానీ ఆకులు,నాలుగు కర్పూరం బిళ్ళలు,ఒక స్ఫూన్ పసుపు వేసి  బాగా మిక్సీ పట్టుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అర లీటర్ నీటిలో కలిపి బొద్దింకలు ఉన్న ప్రదేశంలో స్ప్రే చేసుకోవాలి. ఇంకా చెప్పాలి అంటే సింక్ దగ్గర చెత్త బుట్టల దగ్గర ఎక్కువగా స్ప్రే చేయాలి. మరియు ఆహార పదార్థాలు నిలువ చేసుకునే ప్రదేశంలో కూడా ఈ ఊశ్రమాన్ని స్ప్రే చేయడం వల్ల బొద్దింకలు వాటి దగ్గరకు కూడా రాలేవు.

ఎక్కువగా బొద్దింకలను నిర్మూలించాలి అంటే ఇంటిని శుభ్రం చేసుకునే సమయంలో కచ్చితంగా సామాన్లను స్టోర్ చేసుకునే ప్రదేశాలను బాగా క్లీన్ చేసుకోవాలి.ఎందుకంటే అక్కడే వాటి గుడ్లని పెడుతూ ఉంటాయి.ఆ ప్రదేశాల్లో కూడా నాచురల్ హిట్టు కొట్టడం చాలా ఉత్తమం.ఇందులో వాడిన సుగంధద్రవ్యాలలో ఉన్న ఘాటు మరియు యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ ఫంగల్ గుణాల వల్ల బొద్దింకలు మరియు వాటి గుడ్లు తొందరగా నశించిపోతాయి.

కావున మీరు కూడా ఇలా బొద్దింకలతో ఇబ్బంది పడుతూ ఉంటే,వెంటనే ఈ న్యాచురల్ హిట్టు తయారు చేసుకుని,కొట్టి చూడండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>