Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/vir5ed68fdb-04f4-4375-9ce4-279125bceba8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/vir5ed68fdb-04f4-4375-9ce4-279125bceba8-415x250-IndiaHerald.jpgటైటిల్ వినగానే షాక్ అయ్యారు కదా. అయినా పెళ్లికొడుకు పెళ్ళికూతురుని లేపుకు పోవడం ఏంటి.. ఓ గంటసేపు ఆగితే వారిద్దరి పెళ్లి మండపంలోనే అంగరంగ వైభవంగా జరుగుతుంది కదా అనిపిస్తుంది కదా. అయితే ఇలా ఏకంగా పెళ్లికొడుకే పెళ్లికూతురుని తీసుకొని ఎవరికి దొరకకుండా పారిపోవడానికి వెనక ఒక పెద్ద కారణమే ఉంది అన్నది తెలుస్తోంది. సాధారణంగా సినిమాల్లో మాదిరిగానే నిజ జీవితంలో కూడా ఎన్నోసార్లు పెళ్లి మండపాలలో ట్విస్టులు చోటు చేసుకుంటూ ఉంటాయి. కట్నం సరిపోలేదని కొన్నిసార్లు ప్రేమ వ్యవహారాల కారణంగా ఇంకొన్నిసార్లు ఇక బంధువుల Vir{#}prema;marriage;Love;Uttar Pradeshఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. పెళ్ళికొడుకే పెళ్లికూతురిని లేపుకెళ్ళాడు?ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. పెళ్ళికొడుకే పెళ్లికూతురిని లేపుకెళ్ళాడు?Vir{#}prema;marriage;Love;Uttar PradeshWed, 14 Feb 2024 23:00:00 GMTటైటిల్ వినగానే షాక్ అయ్యారు కదా. అయినా పెళ్లికొడుకు పెళ్ళికూతురుని లేపుకు పోవడం ఏంటి.. ఓ గంటసేపు ఆగితే వారిద్దరి పెళ్లి మండపంలోనే అంగరంగ వైభవంగా జరుగుతుంది కదా అనిపిస్తుంది కదా. అయితే ఇలా ఏకంగా పెళ్లికొడుకే పెళ్లికూతురుని తీసుకొని ఎవరికి దొరకకుండా పారిపోవడానికి వెనక ఒక పెద్ద కారణమే ఉంది అన్నది తెలుస్తోంది. సాధారణంగా సినిమాల్లో మాదిరిగానే నిజ జీవితంలో కూడా ఎన్నోసార్లు పెళ్లి మండపాలలో ట్విస్టులు చోటు చేసుకుంటూ ఉంటాయి. కట్నం సరిపోలేదని కొన్నిసార్లు ప్రేమ వ్యవహారాల కారణంగా ఇంకొన్నిసార్లు ఇక బంధువుల గొడవల కారణంగా మరికొన్నిసార్లు చివరికి పీటలు దాకా వచ్చిన పెళ్లిళ్లు ఆగిపోతూ ఉంటాయి.



 లేదా కొన్ని ఘటనల్లో అయితే సరిగ్గా తాళి కట్టే సమయానికి వధువు లేదా వరుడు మరొకరితో పారిపోవడం లాంటిది ఘటనలు కూడా ఇప్పుడు వరకు చాలానే వెలుగులోకి వచ్చాయి. కానీ ఇటీవల ఉత్తర ప్రదేశ్ లో మాత్రం ఒక విచిత్రమైన ఘటన జరిగింది. మరి కొన్ని గంటల్లో పెళ్లి ఉంది అనగా పెళ్లికొడుకే పెళ్లికూతురుతో పారిపోయాడు. వారణాసి ప్రాంతంలోని యువతి యువకుడికి పెద్దలు పెళ్లి నిశ్చయించారు. చాలా కాలం క్రితం వారిద్దరికీ వివాహం నిశ్చయం కావడంతో.. ఫోన్లో సంభాషణలు ప్రారంభించారు. ఇక ఇలా మాట్లాడుకుంటూనే ఒకరినొకరు ప్రేమించుకున్నారు.



 చివరికి వివాహ సమయం రానే వచ్చింది. కాబోయే వధూవరులు ఆనందానికి అవధులు లేవు. ఇక బంధు మిత్రులందరికీ కూడా పెళ్లి వేడుకకు హాజరయ్యారు. మరి కాసేపట్లో వివాహం జరగాల్సి ఉండగా.. వధూవరులు పెళ్లి పీటలపై కూర్చున్నారు. ఇంతలో ఆపండి అంటూ మండపంలో నుంచి ఒక పెద్ద అరుపు వచ్చింది. తీరా చూస్తే వధువు కుటుంబ సభ్యులు అనుకున్న కట్నం పెళ్లినాటికి అందించలేకపోయారు. దీంతో వరుడు కుటుంబ సభ్యులు పెళ్లి ఆపాలి అంటూ భీష్మించుకు కూర్చున్నారు. దీంతో ఈ పెళ్లి జరిగేలా లేదు అని అర్థం చేసుకున్న వధూవరులు ఇద్దరు కూడా అక్కడున్న వారి ఎవరి కంట పడకుండా ఏకంగా ఎక్సెల్ బండిని తీసుకొని పారిపోయారు. అదే పట్టణంలో ఉన్న ఒక ఆలయంలోకి వెళ్లి దండలు మార్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>