Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crimedc22295a-458e-4133-8786-c8a03a06eb9f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crimedc22295a-458e-4133-8786-c8a03a06eb9f-415x250-IndiaHerald.jpgసాదరణంగా పెద్దలు కుదిర్చిన వివాహం కంటే ఇక ప్రేమ వివాహం చేసుకుంటే లైఫ్ అంతా ఎంతో సంతోషంగా సాగిపోతుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ప్రేమలో ఉన్నప్పుడే ఒకరి భావాలను ఒకరు బాగా అర్థం చేసుకుంటారు. ఒక్కరి ఇష్టాలను ఒకరు గౌరవించుకుంటూ ఉంటారు. ఇక కలిసి బ్రతికితే ఎలా ఉండాలి ఎలా సర్దుకుపోవాలి అన్న విషయాలను కూడా ముందే చర్చించుకుంటూ ఉంటారు. అందుకే ఇలా ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుంటే లైఫ్ అంతా సంతోషంగా సాగిపోతూ ఉంటుంది అని అంటూ ఉంటారు చాలామంది ప్రేమికులు. కానీ పెద్దలు కుదిరిచిన వివాహమైన.. ప్రేమ విCrime{#}prema;Panchayati;marriage;Husband;Shamshabad;Golconda;Love;Wife;policeప్రేమ పెళ్లి.. కానీ ఇప్పుడు అలా కావాలంటూ భార్యను వేధిస్తున్న భర్త?ప్రేమ పెళ్లి.. కానీ ఇప్పుడు అలా కావాలంటూ భార్యను వేధిస్తున్న భర్త?Crime{#}prema;Panchayati;marriage;Husband;Shamshabad;Golconda;Love;Wife;policeWed, 14 Feb 2024 08:21:55 GMTసాదరణంగా పెద్దలు కుదిర్చిన వివాహం కంటే ఇక ప్రేమ వివాహం చేసుకుంటే లైఫ్ అంతా ఎంతో సంతోషంగా సాగిపోతుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ప్రేమలో ఉన్నప్పుడే ఒకరి భావాలను ఒకరు బాగా అర్థం చేసుకుంటారు. ఒక్కరి ఇష్టాలను ఒకరు గౌరవించుకుంటూ ఉంటారు. ఇక కలిసి బ్రతికితే ఎలా ఉండాలి ఎలా సర్దుకుపోవాలి అన్న విషయాలను కూడా ముందే చర్చించుకుంటూ ఉంటారు. అందుకే ఇలా ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుంటే లైఫ్ అంతా సంతోషంగా సాగిపోతూ ఉంటుంది అని అంటూ ఉంటారు చాలామంది ప్రేమికులు.


 కానీ పెద్దలు కుదిరిచిన వివాహమైన.. ప్రేమ వివాహమైన అర్థం చేసుకునే గుణం లేకపోతే మాత్రం పెళ్లి పెటాకులుగా మారడం ఖాయం అని ఇక ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చే ఘటనలు చూసిన తర్వాత అర్థమవుతుంది. అయితే ప్రేమ వివాహాల్లో అయితే ఇలాంటి గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రేమించేటప్పుడు ఎంతో మంచి వాళ్ళలా ఉంటున్న వారు ఇక పెళ్లయిన తర్వాత మాత్రం ఏకంగా కట్టుకున్న వారిని హింసించడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా కుమారుడికి జన్మని ఇవ్వాలి అటూ భార్యను వేధించడం మొదలుపెట్టాడు భర్త.


 పెళ్లయ్యాక పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని మాట ఇచ్చిన ఆ భర్తే చివరికి నరకం చూపించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఇదే విషయంపై శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. పెద్ద గోల్కొండ వాసి మణికంఠ 2017లో ఒక యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉండగా కుమారుడు కావాలని గత కొంతకాలం నుంచి భర్త భార్యను వేధించడం  మొదలు పెట్టాడు భర్త. మరో మహిళతో చనువుగా ఉంటూ.. ఇంటికి రావడమే మానేశాడు. ఇక ఇదే విషయంపై పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు. అయినప్పటికీ మణికంఠ తీరులో మార్పు రాలేదు. దీంతో తనకు న్యాయం చేయండి అంటూ భార్య పోలీసులను ఆశ్రయించింది  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>