TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/acter-suresh-comments-viralee1ffd86-46b5-497a-9d75-bf3fc59bc664-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/acter-suresh-comments-viralee1ffd86-46b5-497a-9d75-bf3fc59bc664-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో సీనియర్ నటుడుగా మంచి పేరు సంపాదించిన సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. నటుడుగా 250కుపైగా సినిమాలలో చేసిన హీరో సురేష్ డైరెక్టర్గా నిర్మాతగా కూడా పలు సినిమాలను తెరకెక్కించారు. అయితే కొంతకాలం పాటు తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా ఉన్నప్పటికీ ఆ తర్వాత పలు చిత్రాలలో కూడా నటించారు. ప్రస్తుతం బుల్లితెర పైన సీరియల్స్ లో నటిస్తూనే మరికొన్ని చిత్రాలను క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. అయితే సురేష్ జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు వాటి గురించి చూACTER SURESH;COMMENTS;VIRAL{#}Suresh;Green tea;Banana;Telugu;Heroటీవీ:చచ్చిపోతావ్ అన్నారు.. వైద్యులే షాక్ అయ్యేలా చేసిన నటుడు సురేష్..!!టీవీ:చచ్చిపోతావ్ అన్నారు.. వైద్యులే షాక్ అయ్యేలా చేసిన నటుడు సురేష్..!!ACTER SURESH;COMMENTS;VIRAL{#}Suresh;Green tea;Banana;Telugu;HeroWed, 14 Feb 2024 02:00:00 GMTటాలీవుడ్ లో సీనియర్ నటుడుగా మంచి పేరు సంపాదించిన సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. నటుడుగా 250కుపైగా సినిమాలలో చేసిన హీరో సురేష్ డైరెక్టర్గా నిర్మాతగా కూడా పలు సినిమాలను తెరకెక్కించారు. అయితే కొంతకాలం పాటు తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా ఉన్నప్పటికీ ఆ తర్వాత పలు చిత్రాలలో కూడా నటించారు. ప్రస్తుతం బుల్లితెర పైన సీరియల్స్ లో నటిస్తూనే మరికొన్ని చిత్రాలను క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. అయితే సురేష్ జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు వాటి గురించి చూద్దాం.


ఒకప్పుడు చాలా స్లిమ్ గా ఉండే సురేష్ కొద్దికాలం క్రిందట చాలా బరువు పెరిగిపోయి దాదాపుగా 120 కిలోల వరకు చేరిపోయారట.. ఆ తర్వాత కొద్ది రోజులకు సినిమాలకు దూరంగా ఉన్నానని.. బరువు పెరగడం వల్లే సినిమాలు మానేశానని చాలామంది దగ్గరనుంచి మాటలు వినిపించాయి.. ఈ నేపథ్యంలోనే ఎలాగైనా సన్నపడాలనుకున్నాను దీంతో 5 నెలలు చాలా కఠినమైన డైట్ ఫాలో అయ్యానని తెలిపారు..


నిద్రలేచిన తర్వాత ఒక గంట వరకు ఎలాంటి ఫుడ్ తీసుకోనని.. కేవలం నీళ్లు, గ్రీన్ టీ వంటివి తీసుకుంటాను.. ఒక గంట తర్వాత అరటిపండు తింటానని.. 9 గంటలకు కోడి గుడ్డులో ఉండే తెల్లసొనను మాత్రమే తింటానని.. ఆ తర్వాత ఓట్స్ ను బ్రేక్ఫాస్ట్ గా తీసుకుంటానని. సండే పూట మాత్రమే బిర్యాని రైస్ తింటానని లేకపోతే వెజిటేబుల్ రైస్ మాత్రమే తింటానని తెలిపారు. అలా తిన్న తర్వాత 15 గంటల వరకు ఎలాంటి ఆహారాన్ని తినాననీ.. మధ్యాహ్నం ఒంటిగంటకు తింటే మరుసటి రోజు ఉదయం వరకు అసలు ఏమీ తినకుండా ఉంటానని కేవలం మంచినీళ్లు, మజ్జిగ, నిమ్మరసం వంటివి మాత్రమే తాగుతానని తెలిపారు. ఈ డైట్ గురించి డాక్టర్లకు చెప్పగా వారే షాక్ అయ్యారని కేవలం 5 నెలలలోనే 21 కేజీలు బరువు తగ్గాలని తెలిపారు.. అయితే ఈ విషయం విన్న వైద్యులు తనను తిట్టారని పిచ్చోడ అలా చేస్తే చచ్చిపోతావ్ అంటూ హెచ్చరించడంతో  డైట్ మార్చమని వైద్యులు సలహా ఇచ్చారని.. దీంతో డైట్ లో పలు మార్పులు చేశానని మొదట్లో 5 నిమిషాలు చేసే వాకింగ్ .. ఆ తర్వాత నెమ్మదిగా 10 నిమిషాలు చేశాను ప్రస్తుతం 18 కిలోమీటర్లు వాకింగ్ చేస్తున్నానంటూ తెలిపారు. ప్రస్తుతం 88 కేజీలు ఉన్నానని తెలిపారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>