PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/speaker-tammineni-cannot-axe-ycp-rebel-mlas4e29099e-ac1e-4828-8915-75779df37806-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/speaker-tammineni-cannot-axe-ycp-rebel-mlas4e29099e-ac1e-4828-8915-75779df37806-415x250-IndiaHerald.jpgఈ జాబితా ప్రకారమే పోటీచేయాలని అనుకుంటున్న అభ్యర్ధులు పదిమంది ఎంఎల్ఏలతో ప్రపోజర్లుగా సంతకాలు పెట్టిస్తారు. ఒకసారి ఎంఎల్ఏల జాబితాను ఫైనల్ చేసి డిక్లేర్ చేశారంటే ఇక ఎవరిపైనా అనర్హత వేటువేసే అవకాశం స్పీకర్ కు ఉండదు. ఎందుకంటే ప్రపోజర్లుగా పదిమంది ఎంఎల్ఏల సంతకాలుండాలి కాబట్టే. ప్రపొజర్లలో ఏ ఒక్క ఎంఎల్ఏని అయినా స్పీకర్ అనర్హుడిని చేస్తే సదరు నామినేషన్ చెల్లకుండా పోతుంది. అప్పుడు అభ్యర్ధి పోటీచేసే అవకాశం కోల్పోతారు. అందుకనే అనర్హత వేటు వేయాలంటే నామినేషన్ల ప్రక్రియ మొదలు కాకముందే వేసుండాలి. ycp rebel MLAs tammineni{#}GANTA SRINIVASA RAO;Katthi;TDP;Rajya Sabha;Letter;YCP;MLA;Party;Assembly;రాజీనామాఅమరావతి : అనర్హత వేటుపై కీలక మలుపుఅమరావతి : అనర్హత వేటుపై కీలక మలుపుycp rebel MLAs tammineni{#}GANTA SRINIVASA RAO;Katthi;TDP;Rajya Sabha;Letter;YCP;MLA;Party;Assembly;రాజీనామాWed, 14 Feb 2024 03:00:00 GMTపార్టీ నాయకత్వాన్ని థిక్కరించి పార్టీ నుండి వెళ్ళిపోయిన ఎంఎల్ఏలపై అనర్హత వేటు కత్తి వేలాడుతున్నట్లు విపరీతంగా ప్రచారం జరుగుతోంది. అయితే నియమ, నిబంధనల ప్రకారం అంత సీన్ లేదని అర్ధమవుతోంది. టీడీపీ నుండి వైసీపీకి వైపు నలుగురు ఎంఎల్ఏలు వచ్చారు. ఇదే సమయంలో వైసీపీ నుండి టీడీపీ వైపు నలుగురు ఎంఎల్ఏలు వెళ్ళారు. ఈ గోడ దూకటాల వల్ల రెండుపార్టీల ఎంఎల్ఏ బలం బ్యాలెన్స్ అయ్యింది.





అయితే పార్టీ లైన్ దాటిన ఎంఎల్ఏలపై అనర్హత వేటు వేయాలని రెండు పార్టీల తరపున చీఫ్ విప్పులు స్పీకర్ తమ్మినేని వీరభద్రంకు లేఖలు ఇచ్చారు. ఈ నేపధ్యంలోనే ఎనిమిది మంది ఎంఎల్ఏలకు స్పీకర్ నోటీసులిచ్చి పదేపదే విచారణకు పిలిపిస్తున్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే వైసీపీ నుండి టీడీపీలోకి వెళ్ళిన నలుగురు ఎంఎల్ఏల మీద అనర్హత వేటు వేయటానికి స్పీకర్+అధికారపార్టీ ప్రయత్నిస్తోందని టీడీపీ, ఎల్లోమీడియా నానా రచ్చచేస్తున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఏ ఒక్క ఎంఎల్ఏ మీద కూడా అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్ కు లేదు.





ఎందుకంటే రాజ్యసభ ఎంపీ ఎన్నికలో పోటీచేసే వాళ్ళకు అసెంబ్లీ సెక్రటేరియట్ నామినేషన్ల ఫారంలను జారిచేసింది. ఆ నామినేషన్ల ఫారంతో  పాటే అసెంబ్లీలోని ఎంఎల్ఏల జాబితాలను అందించింది. అంటే 175 మంది ఎంఎల్ఏలున్న అసెంబ్లీలో గంటా శ్రీనివాసరావు రాజీనామా తర్వాత సభ్యుల సంఖ్య 174 అయ్యింది. ఈ 174 మంది ఎంఎల్ఏల జాబితాలను నామినేషన్ ఫారంలతో పాటు అసెంబ్లీ సెక్రటేరియట్ పార్టీలకు ఇవ్వాలి.





ఈ జాబితా ప్రకారమే పోటీచేయాలని అనుకుంటున్న అభ్యర్ధులు పదిమంది ఎంఎల్ఏలతో ప్రపోజర్లుగా సంతకాలు పెట్టిస్తారు. ఒకసారి ఎంఎల్ఏల జాబితాను ఫైనల్ చేసి డిక్లేర్ చేశారంటే ఇక ఎవరిపైనా అనర్హత వేటువేసే అవకాశం స్పీకర్ కు ఉండదు. ఎందుకంటే ప్రపోజర్లుగా పదిమంది ఎంఎల్ఏల సంతకాలుండాలి కాబట్టే. ప్రపొజర్లలో ఏ ఒక్క ఎంఎల్ఏని అయినా స్పీకర్ అనర్హుడిని చేస్తే సదరు నామినేషన్ చెల్లకుండా పోతుంది. అప్పుడు అభ్యర్ధి పోటీచేసే అవకాశం కోల్పోతారు. అందుకనే అనర్హత వేటు వేయాలంటే నామినేషన్ల ప్రక్రియ మొదలు కాకముందే వేసుండాలి.





ఇపుడా అవకాశం దాటిపోయింది కాబట్టి ఎవరిపైనా అనర్హత వేటుపడే అవకాశం లేదు. 27వ తేదీ ఎన్నిక అయిపోయిన తర్వాత స్పీకర్ రెబల్ ఎంఎల్ఏలపైన అనర్హత వేటు వేస్తే వేయచ్చు. కాబట్టి తమ ఓట్లు పోతాయేమనని, అనర్హత వేటు పడుతుందని రెబల్ ఎంఎల్ఏలు ఆందోళన పడాల్సిన అవసరం లేదు హ్యాపీగా ఓట్లేయచ్చు.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>