Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle8bd93262-8d86-4b42-b620-06b4eb8e40b8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle8bd93262-8d86-4b42-b620-06b4eb8e40b8-415x250-IndiaHerald.jpgమెగా కోడలు లావణ్య త్రిపాఠి వాలెంటైన్స్ డే సందర్భంగా అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చింది. చూపు తిప్పుకోలేని అందంతో ఇంటర్నెట్‌ని షేక్‌ చేసేస్తుంది. లావణ్య త్రిపాఠి మెగా ఫ్యామిలీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె రేంజ్‌ మరింత పెరిగింది.సినిమాల కంటే మెగా కోడలిగానే మరింత గుర్తింపు తెచ్చుకుంటుంది. సోషల్‌ మీడియాలో జోరు చూపిస్తుంది. ఆ జోరుని వాలెంటైన్స్ డే సందర్భంగానూ కంటిన్యూ చేసింది. తాజాగా అదిరిపోయే ఫోటోలను పంచుకుంది.ప్రేమికుల రోజుని పురస్కరించుకుని లావణ్య త్రిపాఠి లేటెస్ట్ ఫోటోలను పంచుకుంది. ఇందులో ఆమె గులాబీపువ్socialstars lifestyle{#}Valentines Day;Cinema;News;marriageఅభిమానులకు వాలెంటైన్స్ డే విషెస్‌ చెప్పిన మెగా కోడలు....!!అభిమానులకు వాలెంటైన్స్ డే విషెస్‌ చెప్పిన మెగా కోడలు....!!socialstars lifestyle{#}Valentines Day;Cinema;News;marriageWed, 14 Feb 2024 23:09:27 GMTమెగా కోడలు లావణ్య త్రిపాఠి వాలెంటైన్స్ డే సందర్భంగా అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చింది. చూపు తిప్పుకోలేని అందంతో ఇంటర్నెట్‌ని షేక్‌ చేసేస్తుంది. లావణ్య త్రిపాఠి మెగా ఫ్యామిలీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె రేంజ్‌ మరింత పెరిగింది.సినిమాల కంటే మెగా కోడలిగానే మరింత గుర్తింపు తెచ్చుకుంటుంది. సోషల్‌ మీడియాలో జోరు చూపిస్తుంది. ఆ జోరుని వాలెంటైన్స్ డే సందర్భంగానూ కంటిన్యూ చేసింది. తాజాగా అదిరిపోయే ఫోటోలను పంచుకుంది.ప్రేమికుల రోజుని పురస్కరించుకుని లావణ్య త్రిపాఠి లేటెస్ట్ ఫోటోలను పంచుకుంది. ఇందులో ఆమె గులాబీపువ్వులతో చేసిన టాప్‌ని ధరించింది. ఎరుపెక్కిన లెహంగా ధరించింది. మొత్తంగా లావణ్య అందాలు ఎరుపెక్కాయని చెప్పొచ్చు. అదే సమయంలో చూపు తిప్పుకోలేని విధంగా ఆమె పోజులు ఉండటం విశేషం.

 లావణ్య త్రిపాఠి తన అభిమానులకు వాలెంటైన్స్ డే విషెస్‌ తెలిపింది. ఈ సందర్భంగా ఇలా నయా ఫోటో షూట్‌ చేసి, వారికి ట్రీట్‌ లా ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె లవ్‌కి సంబంధించిన పోస్ట్ పెట్టింది. రెడ్‌ ప్రేమని తెలియజేసే కలర్‌. ఇది మాటలతో పనిలేకుండా ప్రేమని వ్యక్తం చేస్తుంది అంటూ హ్యాపీ వాలెంటైన్స్ డే అని వెల్లడిచింది.హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి తెలుగులో నటిగా మెప్పించింది. పలు సినిమాలతో ఆకట్టుకుంది. ఆమె మొదటి సినిమా అందాల రాక్షసి`తో అలరించింది. ఇప్పటికీ `అందాల రాక్షసి హీరోయిన్‌గా పిలిపించుకుంటుంది. ఆ తర్వాత ఆ స్థాయి విజయాలు ఆమెకు దక్కలేదు. దీంతో అదే పేరు కంటిన్యూ అవుతూ వస్తోంది.కానీ వరుణ్‌ తేజ్‌ని పెళ్లి చేసుకున్నాక ఆ సినిమా ట్యాగ్‌ పోయింది. ఇప్పుడు మెగా కోడలిగా పాపులరిటీని పొందుతుంది. ప్రస్తుతం ఆమె వైవాహిక జీవితంలో బిజీగా ఉంది. అదే సమయంలో ఇక సినిమాల్లోనూ బిజీ అవుతుంది. ఇటీవల ఆమె `మిస్‌ పర్‌ఫెక్ట్ `అనే ఓటీటీ మూవీలో నటించి మెప్పించింది. దీనికి కొనసాగింపు మూవీ కూడా చేయబోతుంది.మరోవైపు వెండితెరపై కూడా మెరసేందుకు ప్లాన్‌ చేసుకుంటుందట. ఆమె ఒకటి రెండు సినిమాలకు కమిట్‌ అయినట్టు గతంలో వార్తలు వచ్చాయి. వాటిలో నటించే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఆమె ఎక్కువగా ఓటీటీ ఫిల్మ్స్, వెబ్‌ సిరీస్‌కి ప్రయారిటీ ఇస్తున్నట్లు తెలుస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>