PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp--janasena5ba61743-2321-403b-abbe-ded898fe8a3f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp--janasena5ba61743-2321-403b-abbe-ded898fe8a3f-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీకి కేటాయించే సీట్లపై కాపు సామాజికవర్గంలో బలమైన చర్చ జరుగుతుంది.కనీసం 50 నుంచి 60 సీట్లు కేటాయించకపోతే కాపు ఓటు బ్యాంకు టీడీపీకి ట్రాన్స్ ఫర్ అవ్వదని ఆ సామాజికవర్గ శ్రేయోభిలాషులు చెబుతుండగా చంద్రబాబు నాయుడు శ్రేయోభిలాషులు మాత్రం.. ఎన్ని ఇచ్చిన పర్లేదు కానీ అడిగిన చోట్ల ఇస్తే చాలన్నట్లుగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని అంటున్నారు.అయితే ఈ విషయంలో హరిరామ జోగయ్య మాత్రం పవన్ కళ్యాణ్ కు వరుసగా సూచనలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటి దాకా సీట్ల సంఖ్య, నియోజకవర్గTDP - Janasena{#}Telugu Desam Party;Godavari River;West Godavari;Assembly;Janasena;kalyan;Letter;Andhra Pradesh;TDP;CBNటీడీపీ-జనసేన: సీట్ల విషయంలో బలమైన చర్చ?టీడీపీ-జనసేన: సీట్ల విషయంలో బలమైన చర్చ?TDP - Janasena{#}Telugu Desam Party;Godavari River;West Godavari;Assembly;Janasena;kalyan;Letter;Andhra Pradesh;TDP;CBNWed, 14 Feb 2024 14:17:06 GMTప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీకి కేటాయించే సీట్లపై కాపు సామాజికవర్గంలో బలమైన చర్చ జరుగుతుంది.కనీసం 50 నుంచి 60 సీట్లు కేటాయించకపోతే కాపు ఓటు బ్యాంకు టీడీపీకి ట్రాన్స్ ఫర్ అవ్వదని ఆ సామాజికవర్గ శ్రేయోభిలాషులు చెబుతుండగా చంద్రబాబు నాయుడు శ్రేయోభిలాషులు మాత్రం.. ఎన్ని ఇచ్చిన పర్లేదు కానీ అడిగిన చోట్ల ఇస్తే చాలన్నట్లుగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని అంటున్నారు.అయితే ఈ విషయంలో హరిరామ జోగయ్య మాత్రం పవన్ కళ్యాణ్ కు వరుసగా సూచనలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటి దాకా సీట్ల సంఖ్య, నియోజకవర్గాల పేర్లతో పాటు ఏకంగా అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించే పనికి పూనుకున్నారని లేఖలు విడుదలైన నేపథ్యంలో... గత కొన్ని రోజుల నుంచి చిన్న సైజు వార్నింగులు అటు టీడీపీ, ఇటు జనసేనకు ఇస్తున్నారు జోగయ్య. అవి సూచనలా లేదా హెచ్చరికలా అనేది చూసేవారి కోణన్ని బట్టి ఉంటుందని అనుకున్నా... కాస్త అటు ఇటుగా ఇవి హెచ్చరికలే అని అంటున్నారు పరిశీలకులు.ఇప్పటికే కచ్చితంగా రెండున్నర సంవత్సరాలు పవర్ షేరింగ్ ఉండాలని... వైసీపీని గద్దె దింపడం అంటే టీడీపీకి రాజ్యాధికారం కట్టబెట్టడం కాదని.. బలంగా చెబుతున్న జోగయ్య పేరున మరోలేఖ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైరల్ అవుతుంది.


ఇక ఈ లేఖలో ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 11 అసెంబ్లీ సీట్లు జనసేనకు కేటాయించాలని.. అలా కానిపక్షంలో జరిగే పర్యవసానం వల్ల వచ్చే నష్టాన్ని తెలుగుదేశం పార్టీ అనుభవించాల్సిన వచ్చే మాట నిజమే అని ఆయన చెబుతున్నారు.ఇక తాజాగా విడుదలైన లెటర్ లో ప్రధానంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రజాభిష్టం మేరకు ఎక్కువ స్థానాలు కేటాయించాలని చెప్పిన జోగయ్య... రాష్ట్రం మొత్తం ఓట్ల ట్రాన్స్ ఫర్ ని దృష్టిలో పెట్టుకుని ఇలా ఆలోచించాలనే సంకేతాలు ఇచ్చారు. ఇందులో భాగంగా ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 11 సీట్లు జనసేన పార్టీకి కేటాయించాలని కోరుతూ ఆ నియోజకవర్గాల పేర్లు ప్రస్థావించారు.ఈ క్రమంలో జనసైనికుల బలం ఉన్న నియోజకవర్గాలన్నీ జనసేన పార్టీకి కేటాయించడం తప్ప టీడీపీ - జనసేన కూటమికి మరో మార్గం లేదని.. అలా కానిపక్షంలో వచ్చే నష్టాన్ని తెలుగుదేశం పార్టీ అనుభవించాల్సిన మాట నిజమే అని జోగయ్య చెబుతున్నారు. ఈ స్థాయిలో చంద్రబాబు నాయుడుని హెచ్చరించినట్లు మాట్లాడటం.. ఆ హెచ్చరికలను.. సూచనలుగా అప్పుడప్పుడూ చురకలంటిస్తూ చెప్పడం ఇప్పుడు వైరల్ అవుతుంది.


ఈ సందర్భంగా... నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు, ఉంగుటూరు, ఏలూరు, పోలవరం, గోపాలపురం, కొవ్వురు ఇంకా ఉండి నియోజకవర్గాలను జనసేన పార్టీకి కేటాయించాలని హరిరామ జోగయ్య తన లేఖలో టీడీపీ - జనసేన కూటమికి సూచించడం జరిగింది. దీంతో... పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాపు సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్న స్థానాలను జనసేన పార్టీకే కేటాయించాలనే వాదనకు ఇది ఎక్కువ బలం చేకూరుస్తుందని అంటున్నారు.అయితే అలా కాకుండా.. వచ్చిన కాడికే రాసి ఉన్నట్లు అని జనసేన నేతలు భావిస్తే జోగయ్య చెబుతున్నట్లు కాపు ఓట్లు టీడీపీ - జనసేన కూటమికి ట్రాన్స్ ఫర్ అయ్యే అవకాశాలు ఉండవని.. ఉన్నా కానీ అవి అతి స్వల్పానికే పరిమితమవుతాయని చెబుతున్నారు పరిశీలకులు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>