MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood33abc8bb-ecbf-45bf-b1be-2b55a8841241-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood33abc8bb-ecbf-45bf-b1be-2b55a8841241-415x250-IndiaHerald.jpgఒకప్పటి స్టార్ హీరోయిన్లు తమ సెకండ్ ఇన్నింగ్స్ లో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి హీరోయిన్స్ ఇప్పటికే ఓటీటీల్లో వరుసగా వెబ్ సిరీస్ లు చేస్తూ దూసుకుపోతున్నారు. తాజాగా ఈ లిస్టులో మరో సీనియర్ హీరోయిన్ చేరింది. ఆమె మరెవరో కాదు ఒకప్పుడు టాలీవుడ్ లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లాంటి స్టార్ హీరోల సరసన నటించి హీరోయిన్గా భారీ గుర్తింపు తెచ్చుకున్న శ్రియ శరణ్ ఇప్పుడు ఓటీటీ ఎంట్రీ కి రెడీ అయింది. ప్రముఖ ఓటిపి సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ రూపొందించిన ఓ tollywood{#}Ajay Devgn;Naseeruddin Shah;Rajamouli;sharan;sujeeth;Saaho;Mixie;rakul preet singh;NTR;producer;Producer;Salman Khan;Heroine;Success;Pawan Kalyan;March;Akkineni Nagarjuna;Hero;bollywood;Tollywood;Cinemaడిజిటల్ ఎంట్రీ ఇస్తున్న శ్రియ శరణ్..!డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న శ్రియ శరణ్..!tollywood{#}Ajay Devgn;Naseeruddin Shah;Rajamouli;sharan;sujeeth;Saaho;Mixie;rakul preet singh;NTR;producer;Producer;Salman Khan;Heroine;Success;Pawan Kalyan;March;Akkineni Nagarjuna;Hero;bollywood;Tollywood;CinemaTue, 13 Feb 2024 10:05:00 GMTఒకప్పటి స్టార్ హీరోయిన్లు తమ సెకండ్ ఇన్నింగ్స్ లో  డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి హీరోయిన్స్ ఇప్పటికే ఓటీటీల్లో వరుసగా వెబ్ సిరీస్ లు చేస్తూ దూసుకుపోతున్నారు. తాజాగా ఈ లిస్టులో మరో సీనియర్ హీరోయిన్ చేరింది. ఆమె మరెవరో కాదు ఒకప్పుడు టాలీవుడ్ లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లాంటి స్టార్ హీరోల సరసన నటించి హీరోయిన్గా భారీ గుర్తింపు తెచ్చుకున్న శ్రియ శరణ్ ఇప్పుడు ఓటీటీ ఎంట్రీ కి రెడీ అయింది. ప్రముఖ ఓటిపి సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ రూపొందించిన ఓ బాలీవుడ్ వెబ్ సిరీస్ లో శ్రియ శరణ్ ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. ఇదే సిరీస్ లో బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. 

తాజాగా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేస్తూ ఈ సిరీస్ లో లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న నటీనటులను పరిచయం చేశారు. ఇమ్రాన్ హస్మి శ్రియ శరన్ తో పాటు మౌని రాయ్, నసీరుద్దీన్ షా రాజీవ్ ఖండేల్వాల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'షో టైం' పేరుతో తెరకెక్కుతున్న ఈ సిరీస్ మార్చి 8న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇమ్రాన్ హష్మీ నటిస్తున్న ఫస్ట్ వెబ్ సిరీస్ కూడా ఇదే కావడం విశేషం. బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ తన ప్రొడక్షన్ బ్యానర్ ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై  ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. సుమిత్ రాయ్ దర్శకత్వం వహించారు.

 కాగా ఇమ్రాన్ హస్మి రీసెంట్ గా సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ త్రీ సినిమాలో విలన్ గా నటించిన విషయం తెలిసిందే. స్పై అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేక పోయింది. కానీ ఇమ్రాన్ హష్మీ తన విలనిజంతో ఆకట్టుకున్నారు. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజి' సినిమాతో టాలీవుడ్ కి ఇమ్రాన్ హష్మీ విలన్ గా ఎంట్రీ ఇస్తున్నారు. సాహో డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతోంది. కాగా శ్రీయా శరణ్ చివరగా రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన 'RRR' లో కీలకపాత్ర పోషించారు. ఈ సినిమాలో ఆమె అజయ్ దేవగన్ భార్యగా నటించి మెప్పించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>