LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-tipsea6089f5-b0f2-4898-8aa1-ab10628d3a3c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-tipsea6089f5-b0f2-4898-8aa1-ab10628d3a3c-415x250-IndiaHerald.jpgమనం నిద్రపోయే టప్పుడు వివిధ భంగిమల్లో నిద్రపోతూ ఉంటాము. కొంతమంది నిటారుగా, కొంతమంది ఎడమవైపు తిరిగి, మరికొంతమంది కుడివైపు తిరిగి నిద్రపోతూ ఉంటారు.అయితే చాలా తక్కువ మంది మాత్రమే బోర్లా పడుకొని నిద్రపోతూ ఉంటారు.ఎందుకంటే బోర్లా పడుకోవడం వల్ల కొంత అసౌకర్యంగా ఉంటుంది. శ్వాస ఆడనట్టుగా ఉండడంతో పాటు పొట్ట ఉన్నవారికి ఇలా పడుకోవడం వల్ల చాలా అసౌకర్యంగా ఉంటుంది. అందుకే చాలా తక్కువ మంది బోర్లా పడుకుంటూ ఉంటారు. అయితే బోర్లా పడుకోవడం వల్ల చాలా మేలు కలుగుతుందని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారుHealth Tips{#}Manamఏ భంగిమలో నిద్రపోతే ఆరోగ్యానికి మంచిది?ఏ భంగిమలో నిద్రపోతే ఆరోగ్యానికి మంచిది?Health Tips{#}ManamTue, 13 Feb 2024 20:31:54 GMTమనం నిద్రపోయే టప్పుడు వివిధ భంగిమల్లో నిద్రపోతూ ఉంటాము. కొంతమంది నిటారుగా, కొంతమంది ఎడమవైపు తిరిగి, మరికొంతమంది కుడివైపు తిరిగి నిద్రపోతూ ఉంటారు.అయితే చాలా తక్కువ మంది మాత్రమే బోర్లా పడుకొని నిద్రపోతూ ఉంటారు.ఎందుకంటే బోర్లా పడుకోవడం వల్ల కొంత అసౌకర్యంగా ఉంటుంది. శ్వాస ఆడనట్టుగా ఉండడంతో పాటు పొట్ట ఉన్నవారికి ఇలా పడుకోవడం వల్ల చాలా అసౌకర్యంగా ఉంటుంది. అందుకే చాలా తక్కువ మంది బోర్లా పడుకుంటూ ఉంటారు. అయితే బోర్లా పడుకోవడం వల్ల  చాలా మేలు కలుగుతుందని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. బోర్లా పడుకోవడం వల్ల చాలా మేలు కలుగుతుంది. బోర్లా పడుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


నడుము నొప్పి, డిస్క్ సమస్యలు ఉన్నవారు, నరాలపై ఎక్కువగాఒత్తిడిపడే వారు కూడా బోర్లా పడుకోవడం మంచిది.వీరు పొట్టకింద దిండు పెట్టుకుని దానిపై బోర్లా పడుకోవాలి. ఇలా చేయడం వల్ల నడుము నొప్పి తగ్గి హాయిగా ఉంటుంది. అలాగే కొందరిలో తుంటి భాగంలో ఎముకలపై ఒత్తిడి ఎక్కువగా పడి సయాటికా నొప్పులు వంటివి వస్తూ ఉంటాయి. అలాంటి వారు అలాగే మెడ నొప్పులతో బాధపడే వారు కూడా బోర్లా పడుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అదే విధంగా కొందరిలో పక్కకు తిరిగి పడుకున్నప్పుడు చేతులపై ఒత్తిడి పడి తిమ్మిర్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాంటి వారు కూడా బోర్లా పడుకోవడం వల్ల రక్తప్రసరణ సాఫీగా జరిగి తిమ్మిర్లు రాకుండా ఉంటాయి. ఇటువంటి సమస్యలతో బాధపడే వారు బోర్లా పడుకోవడం వల్ల సమస్యల నుండి చక్కటి ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అలాగే అధిక బరువు ఉన్నవారు కూడా బోర్లా పడుకోవడం వల్ల గురక రాకుండా ఉంటుంది. ఊబకాయంతో బాధపడే వారు నిటారుగా పడుకోవడం వల్ల డయాఫ్రామ్ మీద ఒత్తిడి పడి గురక ఎక్కువగా వస్తుంది. కనుక ఊబకాయంతో బాధపడే వారు కూడా బోర్లా పడుకోవడం మంచిది. అయితే పొట్ట ఉన్న వారు ఛాతి కింద దిండును పెట్టుకుని పడుకోవడం మంచిది.గురక పెట్టే వారు బోర్లా పడుకోవడం వల్ల చాలా మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. నిటారుగా పడుకోవడం వల్ల కొండనాలుక శ్వాస మార్గానికి అడ్డుపడి గురక ఎక్కువగా వస్తూ ఉంటుంది. బోర్లా పడుకోవడం వల్ల కొండనాలుక శ్వాస మార్గానికి అడ్డుపడకుండా ఉంటుంది. గురక ఎక్కువగా రాకుండా ఉంటుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>