Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varun-tej-matka78a1485d-d318-4390-8480-945dc503ce53-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varun-tej-matka78a1485d-d318-4390-8480-945dc503ce53-415x250-IndiaHerald.jpgమెగా హీరోల సినిమాలు సెట్స్ మీద ఉండగానే బడ్జెట్ ఇష్యూస్ వల్ల సినిమాలు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. నిన్న మొన్నటిదాకా సాయి తేజ్ సినిమా గాంజా శంకర్ బడ్జెట్ సమస్య వల్ల సినిమా ఆగిపోయిందని అన్నారు. సంపత్ నంది డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా సితార బ్యానర్ లో వస్తుంది. అయితే మొన్నటిదాకా ఈ సినిమా బడ్జెట్ సమస్యల వల్ల ఆగిపోగా ఎలాగోలా ఆ ఇష్యూస్Varun Tej Matka{#}choudary actor;sampath nandi;varun sandesh;Kumaar;Valentines Day;varun tej;shankar;Hero;Cinema;Indiaమెగా హీరోల సినిమాలకే ఎందుకిలా జరుగుతుంది..?మెగా హీరోల సినిమాలకే ఎందుకిలా జరుగుతుంది..?Varun Tej Matka{#}choudary actor;sampath nandi;varun sandesh;Kumaar;Valentines Day;varun tej;shankar;Hero;Cinema;IndiaTue, 13 Feb 2024 22:26:08 GMTమెగా హీరోల సినిమాలు సెట్స్ మీద ఉండగానే బడ్జెట్ ఇష్యూస్ వల్ల సినిమాలు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. నిన్న మొన్నటిదాకా సాయి తేజ్ సినిమా గాంజా శంకర్ బడ్జెట్ సమస్య వల్ల సినిమా ఆగిపోయిందని అన్నారు. సంపత్ నంది డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా సితార బ్యానర్ లో వస్తుంది. అయితే మొన్నటిదాకా ఈ సినిమా బడ్జెట్ సమస్యల వల్ల ఆగిపోగా ఎలాగోలా ఆ ఇష్యూస్ క్లియర్ చేసుకున్నారట. త్వరలోనే గాంజా శంకర్ సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.

ఇక ఇదిలాఉంటే మరో మెగా హీరో సినిమా ఇదే సమస్యతో ఆగిపోయిందని చెప్పుకుంటున్నారు. వరుణ్ తేజ్ కరుణ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న మట్కా సినిమాను వైరా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమా కి కూడా బడ్జెట్ సమస్యలు వచ్చినట్టు తెలుస్తుంది. వరుణ్ తేజ్ మట్కా సినిమా కూడా ప్రస్తుతానికి హోల్డ్ లో పడినట్టు తెలుస్తుంది.

వరుణ్ తేజ్ కెరీర్ లోనే పాన్ ఇండియా అటెంప్ట్ గా ప్రయత్నిస్తున్న ఈ సినిమా విషయంలో ఇలా బడ్జెట్ సమస్యలు రావడం అందరినీ షాక్ అందిస్తుంది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా విషయంలో అప్డేట్ ఏంటన్నది తెలియాల్సి ఉంది. వరుణ్ తేజ్ మట్కా ఈ సినిమా ముందుకు నడుస్తుందా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మట్కాతో అదరగొట్టేస్తాడని అనుకుంటే సినిమా ఆగిపోతుందని తెలిసి మెగా ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. వరుణ్ తేజ్ నటించిన ఆప్రేషన్ వాలెంటైన్ మార్చి 1న వస్తుంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ ఆ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. ఆఫ్టర్ మ్యారేజ్ వరుణ్ కెరీర్ గాడిలో పడుతుందా లేదా అన్నది చూడాలి. ఫలితాలతో సంబంధం లేకుండా వరుణ్ తేజ్ వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>