Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu0ed1c904-9950-4a21-813a-1fffb177ef7e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu0ed1c904-9950-4a21-813a-1fffb177ef7e-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం తర్వాత తన తర్వాత సినిమా రాజమౌళితో చేస్తున్నాడని తెలిసిందే. కె.ఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకు మహేష్ దాదాపు 2 ఏళ్ల పాటు డేట్స్ ఇచ్చేసినట్టు తెలుస్తుంది. ఈమధ్యలో ఏదైనా ఒకటి రెండు నెలలు గ్యాప్ తప్ప మిగతా అంతా రాజమౌళి సినిమా కోసమే పనిచేయనున్నాడు మహేష్. ఇదిలాఉంటే ఈ సినిమాకు తన టీం నిMahesh Babu{#}Ram Madhav;Variar;Rajamouli;Rajani kanth;Prize;Guntur;Tamil;Director;Cinema;Marchమహేష్ తో సినిమా ట్రై చేస్తున్న తమిళ దర్శకుడు..?మహేష్ తో సినిమా ట్రై చేస్తున్న తమిళ దర్శకుడు..?Mahesh Babu{#}Ram Madhav;Variar;Rajamouli;Rajani kanth;Prize;Guntur;Tamil;Director;Cinema;MarchTue, 13 Feb 2024 21:22:00 GMTసూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం తర్వాత తన తర్వాత సినిమా రాజమౌళితో చేస్తున్నాడని తెలిసిందే. కె.ఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకు మహేష్ దాదాపు 2 ఏళ్ల పాటు డేట్స్ ఇచ్చేసినట్టు తెలుస్తుంది. ఈమధ్యలో ఏదైనా ఒకటి రెండు నెలలు గ్యాప్ తప్ప మిగతా అంతా రాజమౌళి సినిమా కోసమే పనిచేయనున్నాడు మహేష్. ఇదిలాఉంటే ఈ సినిమాకు తన టీం ని మార్చి సర్ ప్రైజ్ చేశాడు రాజమౌళి.

సినిమా కోసం ఇప్పటికే లొకేషన్స్ వేట మొదలు పెట్టిన రాజమౌళి త్వరలోనే సినిమాకు సంబందించిన వర్క్ షాప్ మొదలు పెడతారని తెలుస్తుంది. మహేష్ ఈ సినిమా పూర్తి చేయాలంటే ఎలా లేదన్నా 3 ఏళ్లు అవుతుంది. ఆ తర్వాతనే మరో సినిమా గురించి ఆలోచించాల్సి ఉంటుంది. అయితే ఓ పక్క రాజమౌళి తో సినిమాకు రెడీ అవుతున్న మహేష్ తో సినిమా చేసేందుకు తమిళ దర్శకుడు లింగు సామి ప్రయత్నిస్తున్నాడని తెలుస్తుంది. అప్పట్లో పందెం కోడి లాంటి సినిమాలు చేసిన లింగు సామి ఈమధ్య అంతగా ఫాం లో లేడు.

అదీగాక లాస్ట్ ఇయర్ రాం తో చేసిన ది వారియర్ ఫ్లాప్ అయ్యింది. ఈ టైం లో మహేష్ తో సినిమా అంటే సూపర్ స్టార్ ఒప్పుకునే ఛాన్స్ లేదు. అయితే మహేష్ ఎలాగు ఛాన్స్ ఇవ్వడని తెలిసి అతనితో సినిమా చేయడం వేస్ట్ అని తిరిగి మహేష్ మీదే నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నాడట లింగుసామి. ఈ కామెంట్స్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ దాకా వేళ్తే మాత్రం డైరెక్టర్ ని ఆడుకోవడం గ్యారెంటీ. మహేష్ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ లో ఎవరికీ అంత తేలికగా డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. రాజమౌళి సినిమా తర్వాత ఇక మహేష్ ని అందుకోవడం కూడా కష్టమే అని చెప్పొచ్చు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>