Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegdef4311cdd-28cf-4b59-bc9f-010466201461-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegdef4311cdd-28cf-4b59-bc9f-010466201461-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ లో సీరియల్స్ తో పాపులర్ అయ్యి ఆ తర్వాత సినిమాల్లో ఛాన్సులు అందుకున్న మృణాల్ ఠాకూర్ తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకుంటుంది. అయితే ఆమె చేసిన సీతారామం సినిమాతో అమ్మడు తెలుగు ఆడియన్స్ కి సూపర్ ఫేవరెట్ అయ్యింది. సినిమాలో సీతమహాలక్ష్మి పాత్రలో మృణాల్ నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. హను రాఘవపుడి డైరెక్షన్ లో తెరకెక్కిన సీతారామంPooja Hegde{#}Pooja Hegde;Audience;Tollywood;Heroine;Guntur;Director;Cinema;Teluguజస్ట్ ఇమాజిన్ పూజా హెగ్దే ఆ సినిమా చేసుంటే..?జస్ట్ ఇమాజిన్ పూజా హెగ్దే ఆ సినిమా చేసుంటే..?Pooja Hegde{#}Pooja Hegde;Audience;Tollywood;Heroine;Guntur;Director;Cinema;TeluguTue, 13 Feb 2024 21:11:24 GMTబాలీవుడ్ లో సీరియల్స్ తో పాపులర్ అయ్యి ఆ తర్వాత సినిమాల్లో ఛాన్సులు అందుకున్న మృణాల్ ఠాకూర్ తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకుంటుంది. అయితే ఆమె చేసిన సీతారామం సినిమాతో అమ్మడు తెలుగు ఆడియన్స్ కి సూపర్ ఫేవరెట్ అయ్యింది. సినిమాలో సీతమహాలక్ష్మి పాత్రలో మృణాల్ నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. హను రాఘవపుడి డైరెక్షన్ లో తెరకెక్కిన సీతారామం సినిమాలో ముందు హీరోయిన్ గా మృణాల్ ని అనుకోలేదట. ఆ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దేని అనుకున్నాడట డైరెక్టర్ హను రాఘవపుడి.

కథ నచ్చినా సరే పూజా హెగ్దే ఆ టైం లో రాధే శ్యాం కి డేట్స్ ఇవ్వాల్సి ఉండగా సినిమా చేయలేకపోయిందట. అలా సీతారామం సినిమా అవకాశాన్ని చేజార్చుకుంది పూజా హెగ్దే. అయితే అప్పటికే స్టార్ సినిమాలతో సూపర్ పాపులర్ అయిన పూజా హెగ్దే సీతారామం చేసి ఉంటే మాత్రం ఇంకాస్త ఎక్కువ ఇంపాక్ట్ ఉండేదని చెప్పొచ్చు. హీరోయిన్స్ ఎప్పుడైతే కథాబలం ఉన్న పాత్రలో నటిస్తారో వారి మైలేజ్ పెరుగుతుంది.

సో అలా సీతారామం ఛాన్స్ మిస్ అయిన పూజా హెగ్దే ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసింది కానీ ఇప్పుడు ఒక్క తెలుగు ఆఫర్ కూడా లేకుండా చేసుకుంది. ఏ సినిమా ఎవరు చేయాలన్నది ఫేత్ డిసైడ్ చేస్తుంది. కానీ కొన్ని లక్కీ ఛాన్స్ లు మన దాకా వచ్చి వెళ్తుంటాయి. పూజా హెగ్దే సీతారామం చేసి ఉంటే మాత్రం ఆమె రేంజ్ మరోలా ఉండేదని చెప్పొచ్చు. పూజా ప్లేస్ లో అవకాశం దక్కించుకున్న మృణాల్ తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటుంది. పూజా హెగ్దే గుంటూరు కారం సినిమా మిస్ చేసుకుని ఆ తర్వాత టాలీవుడ్ నుంచి ఒక్క ఆఫర్ కూడా అందుకోవట్లేదు. తెలుగు రీ ఎంట్రీకి పూజా ఈగర్ గా ఎదురుచూస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>