DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/jagan3dd8c62a-f934-45b8-9d7d-42dafe32c92b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/jagan3dd8c62a-f934-45b8-9d7d-42dafe32c92b-415x250-IndiaHerald.jpgఆంధ్రా, తెలంగాణ విభజన సమయంలో అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ అంధకారం అవుతుందని నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.కానీ అనూహ్యంగా తెలంగాణలో రెండేళ్లలో కరెంట్ సమస్యలు తీరగా నేటికీ ఆంధ్రాలో విద్యుత్తు కోతలు దర్శనమిస్తూనే ఉన్నాయి. కానీ కర్నూల్ లో పవర్ పాయింట్ నిర్మాణం పూర్తయితే కరెంట్ సమస్యలు తీరతాయి. ఈ ప్రాజెక్టుకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు కాబట్టి మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే దీనిని పూర్తి చేసి విద్యుత్తు సమస్యను పరిష్కరిస్తారు. ఒకవేళ చంద్రబాబు పాలన చేపjagan{#}Kumaar;Kanna Lakshminarayana;Andhra Pradesh;Telangana;CBN;Telugu;YCP;CMఆ ప్రాజెక్టు పూర్తయితే ఏపీ అంతా వెలుగులే?ఆ ప్రాజెక్టు పూర్తయితే ఏపీ అంతా వెలుగులే?jagan{#}Kumaar;Kanna Lakshminarayana;Andhra Pradesh;Telangana;CBN;Telugu;YCP;CMTue, 13 Feb 2024 11:00:00 GMTఆంధ్రా, తెలంగాణ విభజన సమయంలో అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ అంధకారం అవుతుందని నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.కానీ అనూహ్యంగా తెలంగాణలో రెండేళ్లలో కరెంట్ సమస్యలు తీరగా నేటికీ ఆంధ్రాలో విద్యుత్తు కోతలు దర్శనమిస్తూనే ఉన్నాయి. కానీ కర్నూల్ లో పవర్ పాయింట్ నిర్మాణం పూర్తయితే కరెంట్ సమస్యలు తీరతాయి.


ఈ ప్రాజెక్టుకు సీఎం జగన్ శంకు స్థాపన చేశారు కాబట్టి మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే దీనిని పూర్తి చేసి విద్యుత్తు సమస్యను పరిష్కరిస్తారు. ఒక వేళ చంద్రబాబు పాలన చేపట్టినా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే కరెంట్ కోతల్లేని రాష్ట్రంగా ఏపీ మారనుంది. తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి కన్నా వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీంతో అప్పులు చేసి మరీ విద్యుత్తును కొనుగోలు చేస్తున్నాం.


గతంలో బొగ్గు ఆధారిత విద్యుత్తును విరివిగా ఉపయోగించే వాళ్లం. గతంలో ఒక్కో యూనిట్ ధర రూ.6, 7 ఉన్న యూనిట్ ధర ప్రస్తుతం రూ.15, 16 గా పెరిగింది. బొగ్గు రేట్లు పెరగడం దీనికి కారణంగా చెప్పవచ్చు. అందుకే బొగ్గు ఆధారిత కరెంట్ పై కాకుండా తక్కువ ఖర్చులో వచ్చే వాటిపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారిస్తున్న క్రమంలో కోతలు వస్తున్నాయి. వాస్తవంగా కేంద్రం నుంచి వచ్చే గ్రిడ్ కరెంట్ తక్కువ రేట్లకు వస్తుండటంతో అందరూ దాని కోసం ఎగ బడుతున్నారు.


ఇలాంటి సమయంలో బొగ్గు ఆధారిత కరెంట్ తప్పనిసరి అవుతోంది. మరోవైపు పర్యావరణానికి సంబంధించి కేంద్రం దీనిపై పరిమితులు విధిస్తోంది. ఫలితం పలు చోట్ల కరెంట్ కోతలు. దీనిని నియంత్రించేందుకు వైసీపీ ప్రభుత్వం కర్నూల్ లో 5230 మెగా వాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసే పవర్ ప్లాంట్ ను ప్రారంభించింది. ఇది పూర్తైతే  ఆంధ్రా వినియోగించుకోగా మిగిలింది తెలంగాణకు కూడా అమ్మవచ్చు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>