MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6a04a163-95ec-4eb3-bfc8-05bd0151b5ac-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6a04a163-95ec-4eb3-bfc8-05bd0151b5ac-415x250-IndiaHerald.jpgమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను గత ఏడాది 'స్కంద' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా డివైడ్ టాక్ అందుకుంది. ఇక 'స్కంద' తర్వాత బోయపాటి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ లో చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. అల్లు అరవింద్, బోయపాటి శ్రీనులది బ్లాక్‌బస్టర్ కాంబినేషన్. ఇదే కాంబోలో 2016 సంవత్సరంలో 'సరైనోడు' సినిమా వచ్చింది. ఈ సినిమా అల్లు అర్జున్‌కి మాస్ ఇమేజ్‌ను తీసుకురావడంతో పాటు భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ సమయానికి బోయపాటి, అల్లు అర్జున్ tollywood{#}Miryala Ravinder Reddy;Geetha Arts;Bobby;Allu Arjun;Balakrishna;boyapati srinu;Audience;Election;March;Assembly;Mass;Director;Box office;Allu Aravind;Hero;Success;Cinemaఅల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ లో 'అఖండ' సీక్వెల్అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ లో 'అఖండ' సీక్వెల్tollywood{#}Miryala Ravinder Reddy;Geetha Arts;Bobby;Allu Arjun;Balakrishna;boyapati srinu;Audience;Election;March;Assembly;Mass;Director;Box office;Allu Aravind;Hero;Success;CinemaTue, 13 Feb 2024 11:19:00 GMTమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను గత ఏడాది 'స్కంద' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా డివైడ్ టాక్ అందుకుంది. ఇక 'స్కంద' తర్వాత బోయపాటి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ లో చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. అల్లు అరవింద్, బోయపాటి శ్రీనులది బ్లాక్‌బస్టర్ కాంబినేషన్. ఇదే కాంబోలో 2016 సంవత్సరంలో 'సరైనోడు' సినిమా వచ్చింది. ఈ సినిమా అల్లు అర్జున్‌కి మాస్ ఇమేజ్‌ను తీసుకురావడంతో పాటు భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ సమయానికి బోయపాటి, అల్లు అర్జున్ కెరీర్లలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. మళ్లీ ఇన్నేళ్ళ తర్వాత వీరి కాంబినేషన్ కుదరడంతో ఇందులో హీరో ఎవరనే విషయంపై ఆడియన్స్ లో క్యూరియాసిటీ నెలకొంది. ఇక తాజాగా ఈ విషయమై క్లారిటీ వచ్చేసింది.

గీతా ఆర్ట్స్ లో 'అఖండ' సీక్వెల్

బోయపాటి శ్రీను - బాలకృష్ణ కాంబినేషన్లో 2021 లో వచ్చిన 'అఖండ' బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ అందకుందో తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని గతంలోనే బోయపాటి ప్రకటించగా.. 'అఖండ' సీక్వెల్ ని అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతోంది. నిజానికి అఖండ మూవీని మిరియాల రవీందర్ రెడ్డి ద్వారకా క్రియేషన్స్ పై నిర్మించారు  ఈ సినిమాతో ఆయనకి భారీ లాభాలు కూడా వచ్చాయి. ఇప్పుడు సీక్వెల్ విషయంలో ఏం జరిగిందో తెలియదు కానీ ఆయన స్థానంలో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.

'అఖండ' సీక్వెల్ సెట్స్ పైకి వెళ్ళేది అప్పుడే

బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో నటిస్తున్న 'NBK109' షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ మార్చి నాటికి పూర్తి కానుంది. దీని తర్వాత బాలయ్య ఈ ఏడాది ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్స్ తో బిజీ కానున్నారు. ఎలక్షన్స్ ప్రచారం కోసం షూటింగ్స్ నుంచి కొంత బ్రేక్ తీసుకుంటారు. ఎలక్షన్స్ తర్వాత 'అఖండ 2' సెట్స్ పైకి వెళ్ళనుంది. త్వరలోనే గీతా ఆర్ట్స్ నుంచి 'అఖండ' సీక్వెల్ కి అధికారిక ప్రకటన రానుంది.

నిజానికి అల్లు అరవింద్ ఎంతో కాలంగా బాలకృష్ణతో ఓ సినిమా నిర్మించాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే బాలయ్యతో ఆయన అన్ స్టాపబుల్ షో ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ షో భారీ సక్సెస్ అయ్యింది. ఇక ఇప్పుడు బోయపాటి - బాలయ్య కాంబినేషన్ ప్రాజెక్ట్ ని ప్రొడ్యూస్ చేసే చేస్తున్నారు.

 


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>