Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-raja-saab58a6e27c-67ec-40b5-aa24-dfb280bcf694-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-raja-saab58a6e27c-67ec-40b5-aa24-dfb280bcf694-415x250-IndiaHerald.jpgమారుతి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ మరో ఎనర్జిటిక్ రోల్ తో వస్తున్నాడని తెలుస్తుంది. బాహుబలి నుంచి ప్రభాస్ చేస్తున్న ప్రతి సినిమా భారీ బడ్జెట్ తో సీరియస్ కంటెంట్ తో చేస్తూ వచ్చాడు. సలార్ లో అయితే ప్రభాస్ మొత్తం సీరియస్ మోడ్ లోనే ఉన్నాడు. అందుకే ఈ గ్యాప్ లో రాజా సాబ్ తో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా అందించే Prabhas Raja Saab{#}maruti;Bahubali;Thriller;Comedy;Makar Sakranti;raja;Prabhas;Audience;Prize;Cinema;Populationరాజా సాబ్ 2025 సంక్రాంతికి డౌటేనా..?రాజా సాబ్ 2025 సంక్రాంతికి డౌటేనా..?Prabhas Raja Saab{#}maruti;Bahubali;Thriller;Comedy;Makar Sakranti;raja;Prabhas;Audience;Prize;Cinema;PopulationTue, 13 Feb 2024 22:15:25 GMTమారుతి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ మరో ఎనర్జిటిక్ రోల్ తో వస్తున్నాడని తెలుస్తుంది. బాహుబలి నుంచి ప్రభాస్ చేస్తున్న ప్రతి సినిమా భారీ బడ్జెట్ తో సీరియస్ కంటెంట్ తో చేస్తూ వచ్చాడు. సలార్ లో అయితే ప్రభాస్ మొత్తం సీరియస్ మోడ్ లోనే ఉన్నాడు. అందుకే ఈ గ్యాప్ లో రాజా సాబ్ తో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా అందించే ప్రయత్నం చేస్తున్నారు.

సినిమా మారుతి మార్క్ కామెడీ తో పాటుగా ప్రభాస్ నుంచి ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఉంటాయని అంటున్నారు. థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ తో రాజా సాబ్ ఆడియన్స్ అందరినీ సర్ ప్రైజ్ చేస్తుందని చెబుతున్నారు. అయితే ఈ సినిమా నిర్మాతలు 2025 సంక్రాంతికి సినిమా పక్కా రిలీజ్ అని అంటున్నారు. ఈ సంక్రాంతికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ఈగల్ రిలీజ్ అవ్వాల్సి ఉన్నా నిర్మాతల మండలి కోరిక మేరకు వాయిదా వేసుకున్నారు.

అయితే ప్రభాస్ సినిమా విషయంలో వెనక్కి తగ్గేది లేదని అంటున్నారు. కానీ మారుతిసినిమా గ్రాఫిక్స్ వర్క్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకూడదని అనుకుంటున్నాడు. అందుకే 2025 సంక్రాంతి టార్గెట్ రిలీజ్ అన్నట్టు కాకుండా సినిమా ఎప్పుడు పూర్తైతే అప్పుడు రిలీజ్ అనేలా ప్లాన్ చేస్తున్నారట. సో ఆ లెక్కన చూస్తే ప్రభాస్ కల్కి ఈ సమ్మర్ కి వస్తే రాజా సాబ్ సినిమా నెక్స్ట్ సమ్మర్ కి వస్తుందని చెప్పొచ్చు. రాజా సాబ్ రిలీజ్ లేట్ అని ఫిక్స్ అయితే కల్కిని సమ్మర్ కి కాకుండా ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మొత్తానికి ప్రభాస్ సినిమాలు రెండు రిలీజ్ డేట్స్ పై క్లారిటీ రావాల్సి ఉంది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>