PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-buchaichowdhary-bhavani-bjp68820428-1af6-4df9-bcc3-1da30d041e94-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-buchaichowdhary-bhavani-bjp68820428-1af6-4df9-bcc3-1da30d041e94-415x250-IndiaHerald.jpgరాబోయే ఎన్నికల్లో ఆమెకు బదులుగా భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ పోటీచేయబోతున్నారు. వాసుకు టికెట్ ఇవ్వటానికి గతంలోనే చంద్రబాబు అంగీకరించారని పార్టీవర్గాల టాక్. అయితే ఇపుడు సడెన్ గా బీజేపీ కూడా పొత్తుల్లోకి ఎంటరవ్వబోతోంది. బీజేపీ 35 అసెంబ్లీ సీట్లు అడుగుతున్నా చంద్రబాబు ఓ 20 లేదా 15 ఇవ్వక తప్పదని తమ్ముళ్ళే చెబుతున్నారు. బీజేపీ పట్టుబడుతున్న అసెంబ్లీ సీట్లలో రాజమండ్రి సిటీ కూడా ఉంది. రాజమండ్రి సిటి అంటే పైన చెప్పుకున్నట్లు ఎంఎల్ఏ భవాని. tdp buchaichowdhary bhavani bjp{#}Ram Mohan Naidu Kinjarapu;Kandula Durgesh;Kinjarapu Yerran Naidu;Srikakulam;srinivas;Rajahmundry;Husband;Janasena;TDP;CBN;MLA;Assembly;Bharatiya Janata Partyగోదావరి : ఎంఎల్ఏలిద్దరికీ షాక్ తప్పదా ?గోదావరి : ఎంఎల్ఏలిద్దరికీ షాక్ తప్పదా ?tdp buchaichowdhary bhavani bjp{#}Ram Mohan Naidu Kinjarapu;Kandula Durgesh;Kinjarapu Yerran Naidu;Srikakulam;srinivas;Rajahmundry;Husband;Janasena;TDP;CBN;MLA;Assembly;Bharatiya Janata PartyTue, 13 Feb 2024 05:00:00 GMT

ఎంకి పెళ్ళి సుబ్బిచావుకు వచ్చిందనే సామెత చాలా పాపులర్. ఇపుడీ పరిస్ధితి తెలుగుదేశంపార్టీ ఎంఎల్ఏలకు వర్తించబోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే జనసేనతో పొత్తు కారణంగా కొందరు సీనియర్ తమ్ముళ్ళకి రాబోయే ఎన్నికల్లో పోటీచేసే అవకాశాలు పోతున్నాయి. సుమారు 25 నియోజకవర్గాలను జనసేనకు చంద్రబాబు కేటాయించినట్లు సమాచారం. అంటే ఆ మేరకు 25 మంది తమ్ముళ్ళకి పోటీచేసే అవకాశం పోయినట్లే. ఇందులో రాజమండ్రి రూరల్ ఎంఎల్ఏ గోరంట్ల బుచ్చయ్యచౌదరి ముఖ్యులు.





ఎందుకంటే జనసేన కీలక నేత కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో పోటీచేయబోతున్నారు. జనసేన నుండి పోటీచేయబోతున్నట్లు ఈయన చాలాకాలంగా ప్రచారం కూడా చేసుకుంటున్నారు. అంటే టీడీపీ ఎంఎల్ఏ గోరంట్లకు సీటు ఎగిరిపోయినట్లే లెక్క. అందుకనే ఆయన రాజమండ్రి సిటి నియోజకవర్గంలో తనకు టికెట్ ఇవ్వాలని చంద్రబాబును కోరుతున్నారు. అయితే అదంతా తేలికకాదు. ఎందుకంటే రాజమండ్రి సిటీ ఎంఎల్ఏ ఆదిరెడ్డి భవాని. భవని అంటే శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు చెల్లెలు, ఎర్రన్నాయుడు కూతురు. రాజమండ్రి సిటిలో బలమైన సామాజికవర్గంలో కీలక నేత ఆదిరెడ్డి అప్పారావు కోడలు కాబట్టి ఆమెకు టికెట్ నిరాకరించే అవకాశాలు లేవు.





రాబోయే ఎన్నికల్లో ఆమెకు బదులుగా భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ పోటీచేయబోతున్నారు. వాసుకు టికెట్ ఇవ్వటానికి గతంలోనే చంద్రబాబు అంగీకరించారని పార్టీవర్గాల టాక్. అయితే ఇపుడు సడెన్ గా బీజేపీ కూడా పొత్తుల్లోకి ఎంటరవ్వబోతోంది. బీజేపీ 35 అసెంబ్లీ సీట్లు అడుగుతున్నా చంద్రబాబు ఓ 20 లేదా 15 ఇవ్వక తప్పదని తమ్ముళ్ళే చెబుతున్నారు. బీజేపీ పట్టుబడుతున్న అసెంబ్లీ సీట్లలో రాజమండ్రి సిటీ కూడా ఉంది. రాజమండ్రి సిటి అంటే పైన చెప్పుకున్నట్లు ఎంఎల్ఏ భవాని.





అంటే బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్న కారణంగా రాజమండ్రి రూరల్, సిటి నియోజకవర్గాలు రెండూ టీడీపీ చేతిలో నుండి జారిపోతున్నాయి. విషయం ఏమిటంటే పై రెండు నియోజకవర్గాల్లోను జనసేన, బీజేపీలు తమంతట తాముగా  గెలిచే ఛాన్సే లేదు. రెండుపార్టీలకు టికెట్లిచ్చి ఓట్లేయించి టీడీపీయే  గెలిపించాలి. జరుగుతున్న ప్రచారం ప్రకారం ఇద్దరు టీడీపీ ఎంఎల్ఏలకు రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఎగిరిపోయినట్లే. పొత్తుల్లో సీనియర్ తమ్ముళ్ళు ఆశిస్తున్న ఇంకెన్ని కీలకమైన నియోజకవర్గాలు జారిపోతాయో చూడాలి.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>