Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/krithi-shetty33c6e868-55b3-4d2f-863e-882529c54c48-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/krithi-shetty33c6e868-55b3-4d2f-863e-882529c54c48-415x250-IndiaHerald.jpgఉప్పెన భామ కృతి శెట్టికి కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. తెలుగులో ఎంట్రీ ఇవ్వడమే సూపర్ హిట్ పడగా ఆ దెబ్బతో వరుసగా అవకాశాలు వచ్చాయి. అయితే ఆ టైం లో స్టోరీస్ గురించి పెద్దగా ఆలోచించకుండానే కృతి సినిమాలు చేస్తూ వచ్చింది. వాటి ఫలితాల వల్ల అమ్మడి కెరీర్ రిస్క్ లో పడింది. అయితే ఇప్పుడు సినిమా ఛాన్స్ వచ్చినా కథల ఎంపికలో ఆచి తూచిKrithi Shetty{#}jahnavi;raasi;bhama;CBN;media;Audience;Heroine;India;Cinemaబేబమ్మకి ఎన్ని కష్టాలు వచ్చాయో..?బేబమ్మకి ఎన్ని కష్టాలు వచ్చాయో..?Krithi Shetty{#}jahnavi;raasi;bhama;CBN;media;Audience;Heroine;India;CinemaTue, 13 Feb 2024 12:35:48 GMTఉప్పెన భామ కృతి శెట్టికి కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. తెలుగులో ఎంట్రీ ఇవ్వడమే సూపర్ హిట్ పడగా ఆ దెబ్బతో వరుసగా అవకాశాలు వచ్చాయి. అయితే ఆ టైం లో స్టోరీస్ గురించి పెద్దగా ఆలోచించకుండానే కృతి సినిమాలు చేస్తూ వచ్చింది. వాటి ఫలితాల వల్ల అమ్మడి కెరీర్ రిస్క్ లో పడింది. అయితే ఇప్పుడు సినిమా ఛాన్స్ వచ్చినా కథల ఎంపికలో ఆచి తూచి అడుగులేస్తుంది కృతి.

ఇక హీరోయిన్ గా రాణించాలంటే కేవలం అభినయం ఉన్న పాత్రలే కాదు గ్లామర్ తో కూడా మెప్పించాలనే లాజిక్ పట్టేసిన అమ్మడు ఈమధ్య ఫోటో షూట్స్ తో అదరగొట్టేస్తుంది. లేటెస్ట్ గా బెల్లీ డ్యాన్స్ తో నెటిజెన్లకు నిద్ర పట్టకుండా చేస్తుంది కృతి శెట్టి. అసలే అమ్మడు అందాల రాశి అలాంటి అమ్మడు నడుము ఒంపులతో బెల్లీ డ్యాన్స్ చేస్తే ఇంకా ఏమైనా ఉందా. అమ్మడి బెల్లీ డ్యాన్స్ లకు సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోయింది.

కృతి శెట్టి ఈమధ్య ఏం చేసినా ఆడియన్స్ నే టార్గెట్ చేసుకుంటూ చేస్తుంది. ఈ క్రమంలో అమ్మడు తన గ్లామర్ సైడ్ కూడా డోస్ పెంచేసింది. స్కిన్ షోతో ప్రేక్షకులను బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తుంది అమ్మడు. ఇక అమ్మడి సినిమాల విషయానికి వస్తే తెలుగులో శర్వానంద్ సినిమా మాత్రమే చేస్తున్న కృతి తమిళ, మలయాళ భాషల్లో చెరో సినిమా చేస్తుంది. మరి అక్కడ అయినా బేబమ్మ ఫాం కొనసాగిస్తుందేమో చూడాలి. తెలుగులో మరో స్టార్ ఛాన్స్ అందుకునే దాకా రెచ్చిపోవడంలో తగ్గేదేలే అనేలా చేస్తుంది కృతి శెట్టి. బుచ్చి బాబు చరణ్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా సినిమాలో కూడా కృతి ఛాన్స్ పట్టేయాలని చూస్తుంది. ఈ సినిమాలో జాన్వి ఒక హీరోయిన్ గా నటిస్తుండగా సెకండ్ హీరోయిన్ కి అవకాశం ఉందని టాక్. మరి ఆ లక్కీ ఛాన్స్ కృతికి వస్తుందా లేదా అన్నది చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>