MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/eagle76f93aab-c062-4fdc-87ec-8b76830f857a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/eagle76f93aab-c062-4fdc-87ec-8b76830f857a-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ తాజాగా ఈగల్ లాంటి యాక్షన్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే.సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల నిర్మించారు. భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 9న విడుదలైన ఈగల్ మూవీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. గ్యాంగ్‌స్టర్ మూవీకి చిన్నపాటి సోషల్ మేసేజ్‌ను జోడించి ఈగల్ మూవీని తీశారు.ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్‌, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు. అనుపమ సినిమా మొత్తం కనిపిస్తే..Eagle{#}harish shankar;navdeep;kavya thapar;ravi teja;Mister;Music;Population;Mass;ravi anchor;Ravi;News;Cinema;February;Directorఈగల్ హిట్.. ఇక తరువాతి సినిమాతో రవితేజ బిజీ?ఈగల్ హిట్.. ఇక తరువాతి సినిమాతో రవితేజ బిజీ?Eagle{#}harish shankar;navdeep;kavya thapar;ravi teja;Mister;Music;Population;Mass;ravi anchor;Ravi;News;Cinema;February;DirectorMon, 12 Feb 2024 18:39:00 GMTమాస్ మహారాజా రవితేజ తాజాగా ఈగల్ లాంటి యాక్షన్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే.సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల నిర్మించారు. భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 9న విడుదలైన ఈగల్ మూవీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. గ్యాంగ్‌స్టర్ మూవీకి చిన్నపాటి సోషల్ మేసేజ్‌ను జోడించి ఈగల్ మూవీని తీశారు.ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్‌, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు. అనుపమ సినిమా మొత్తం కనిపిస్తే.. కావ్య థాపర్ ను కేవలం ఫ్లాష్‌బ్యాక్ కు మాత్రమే పరిమితం చేశారు. అయితే వీరి ఇద్దరి పాత్రలు కథలో కీలకంగా ఉంటాయి. అలాగే విలన్ గా వినయ్ రాయ్‌.. కీలక పాత్రలో నవదీప్ తమదైన నటనతో ఎంతగానో ఆకట్టుకున్నారు. యాక్షన్‌ సన్నివేశాలు, రవితేజ ఎనర్టిటిక్ యాక్టింగ్, సంగీతం ఇంకా సెకండాఫ్ సినిమాకు ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి.


మొత్తానికి టాక్ పాజిటివ్ గా ఉండటంతో బాక్సాఫీస్ వద్ద ఈగల్ కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపుతోంది. మొదటి రోజు రూ. 12 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన ఈ చిత్రం.. మూడు రోజుల రన్ పూర్తి అయ్యే సమయానికి ఏకంగా రూ. 30 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది.రూ. 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈగల్ మూవీ.. ఫస్ట్ వీకెండ్ లోనే ఏకంగా రూ. 15 కోట్లు షేర్ ను వసూల్ చేసిందని చిత్రటీమ్ ప్రకటనతో తేలింది. దీంతో ఫుల్ రన్ లో ఈగల్ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం ఖాయమని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈగల్ సినిమా మంచి విజయం సాధించడంతో మాస్ మహారాజ రవి తేజ తన తరువాత సినిమాపై దృష్టి పెట్టినట్లు సమాచారం తెలుస్తుంది. తనకు మిరపకాయ్ లాంటి హాట్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలో మూడో సినిమా చేస్తున్నాడు రవి తేజ. మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సంవత్సరం సెకండ్ ఆఫ్ లో ఈ సినిమా రిలీజ్ ఉంటుందని సమాచారం తెలుస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>