PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandra-babu-suprim-court78eedeb3-00c1-4755-a0bb-114f45aba845-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandra-babu-suprim-court78eedeb3-00c1-4755-a0bb-114f45aba845-415x250-IndiaHerald.jpgటిడిపి అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసు పై ఇటీవలే బెయిల్ మీద బయటకు వచ్చిన సంగతి తెలిసిందే..అయితే చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పైన ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది.. స్కిల్ కేసులో చంద్రబాబుకి ఏపీ హైకోర్టు నుంచి ఇచ్చిన బెయిల్ ను సైతం రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది CID.. ఈ పిటిషన్ నేడు జస్టిస్ వేలాయం త్రివేది జస్టిస్ పంకజ్ మిల్టన్ ధర్మాసనం పైన విచారించబోతున్నారు. ముఖ్యంగా చంద్రబాబు బెయిల్ మంజూరులో తమ వాదనలు ఆధారాలను హైకోరCHANDRA BABU;SUPRIM COURT{#}High court;Rajahmundry;Andhra Pradesh;January;February;TDP;CBN;CMచంద్రన్నకు బెయిలా.. జైలా.. నేడే సుప్రీంకోర్టులో విచారణ..!!చంద్రన్నకు బెయిలా.. జైలా.. నేడే సుప్రీంకోర్టులో విచారణ..!!CHANDRA BABU;SUPRIM COURT{#}High court;Rajahmundry;Andhra Pradesh;January;February;TDP;CBN;CMMon, 12 Feb 2024 10:00:00 GMTటిడిపి అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసు పై ఇటీవలే బెయిల్ మీద బయటకు వచ్చిన సంగతి తెలిసిందే..అయితే చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పైన ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది.. స్కిల్ కేసులో చంద్రబాబుకి ఏపీ హైకోర్టు నుంచి ఇచ్చిన బెయిల్ ను సైతం రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది CID.. ఈ పిటిషన్ నేడు జస్టిస్ వేలాయం త్రివేది జస్టిస్ పంకజ్ మిల్టన్ ధర్మాసనం పైన విచారించబోతున్నారు.


ముఖ్యంగా చంద్రబాబు బెయిల్ మంజూరులో తమ వాదనలు ఆధారాలను హైకోర్టు సైతం అధికరణలోకి తీసుకోలేదంటూ పిటిషన్లో CID తెలియజేసింది. అయితే జనవరి 19న విచారణ సందర్భంగా కౌంటర్లు దాఖలు చేసినప్పటికీ అందుకు సమయం కావాలని సుప్రీంకోర్టుని చంద్రబాబు తరఫున న్యాయవాదులు కోరారు.. ఇరుపక్షాలు తమ వాదన లిఖితపూర్వకంగానే సమర్పించాలని సుప్రీంకోర్టు విచారణను ఫిబ్రవరి 12వ తేదీన అంటే ఈ రోజుకి వాయిదా వేసింది. దీంతో ఈ రోజున విచారణ ఎలా ఉండబోతోంది అనే విషయం పైన అటు టిడిపి కార్యకర్తలలో రాజకీయ నాయకులలో చాలా ఉత్కంఠత నెలకొంది.


ముఖ్యంగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును CID అరెస్టు చేసిన విషయమే కాకుండా 50 రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ల ఉంచారు.. మొదట మధ్యంతర బెయిల్ మంజూరు చేసినప్పటికీ ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ సైతం మంజూరు చేశారు. దీంతో ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వడం పైన సుప్రీంకోర్టులో సవాలు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ CID. ఒకవేళ బెయిల్ రద్దు అయితే మళ్లీ చంద్ర బాబు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో అన్నట్టుగా కార్యకర్తలను రాజకీయ నాయకులలో నారా కుటుంబంలో కూడా ఈ విషయం పెద్ద సందేహంగా మారుతోంది. మరి ఏం జరుగుతుందనే విషయం తెలియాలి అంటే మరో కొద్ది గంటలు ఆగాల్సిందే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>