PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-kapus-pawan123079f3-f814-4c14-9e1d-801454c35a2a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-kapus-pawan123079f3-f814-4c14-9e1d-801454c35a2a-415x250-IndiaHerald.jpgకీలకమైన సందర్భాల్లో కాపులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వటంలేదు. ఎందుకంటే అందుకు జనసేనే కారణం. కాపులకు ఎంతచేసినా, ఎంత ప్రాధాన్యత ఇచ్చినా మెజారిటి ఓట్లు జనసేనకే వెళుతుందని జగన్ భావన. అందుకనే కాపులకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంతమాత్రమే ఇస్తున్నారు. వైసీపీకి మద్దతుగా నిలిచిన కాపులు కూడా ఉన్నారు కాని జనసేనకు మద్దతుగా నిలిచే కాపులతో పోల్చితే తక్కువే అని జగన్ చేయించుకున్న సర్వేల్లో తేలిందట. jagan kapus pawan{#}Godavari River;Janasena;YCP;Jaganగోదావరి : కాపులను జగనే పుష్ చేస్తున్నారా ?గోదావరి : కాపులను జగనే పుష్ చేస్తున్నారా ?jagan kapus pawan{#}Godavari River;Janasena;YCP;JaganMon, 12 Feb 2024 09:00:00 GMT

కాపులను జనసేన వైపు వెళ్ళేట్లుగా జగన్మోహన్ రెడ్డే పుష్ చేస్తున్నారా ? గోదావరి జిల్లాల్లో టికెట్లు ఫైనల్ చేసిన విధానం చూస్తే ఇదే అనుమానం పెరిగిపోతోంది.  కాపులను జనసేన వైపుకు పుష్ చేయాల్సిన అవసరం జగన్ కు ఏమొచ్చింది ? దానివల్ల జగన్ కు వచ్చే లాభం ఏమిటన్నది చాలా కీలకమైనది. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా సామాజికవర్గాల సమీకరణల ప్రకారమే చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సమీకరణల్లో జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు సామాజికవర్గాలతో సంబంధంలేకుండా మహిళలకు.





కీలకమైన సందర్భాల్లో కాపులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వటంలేదు. ఎందుకంటే అందుకు జనసేనే కారణం. కాపులకు ఎంతచేసినా, ఎంత ప్రాధాన్యత ఇచ్చినా మెజారిటి ఓట్లు జనసేనకే వెళుతుందని  జగన్ భావన. అందుకనే కాపులకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంతమాత్రమే ఇస్తున్నారు. వైసీపీకి మద్దతుగా నిలిచిన కాపులు కూడా ఉన్నారు కాని జనసేనకు మద్దతుగా నిలిచే కాపులతో పోల్చితే తక్కువే అని జగన్ చేయించుకున్న సర్వేల్లో తేలిందట.





రాబోయే ఎన్నికల్లో కాపులు ఎవరికి ఓట్లేస్తారన్న సర్వేలో బయటపడిన ఫలితాల తర్వాతే జగన్ అంతకుముందు కాపులకు ఇస్తున్న ప్రాధాన్యతను తగ్గించేశారని సమాచారం. ఖాయంగా గెలుస్తారని తేలిన కాపు ఎంఎల్ఏలకు మాత్రం టికెట్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అందుకనే కాపులను జనసేనవైపుకు బలంగా పుష్ చేస్తున్నారట. ఎందుకంటే జనసేనను ఎప్పుడైతే కాపులు ఓన్ చేసుకుంటారో అప్పుడు ఇతర సామాజికవర్గాలు జనసేనను వ్యతిరేకిస్తాయని జగన్ అంచనా వేస్తున్నారు. గోదావరి జిల్లాల్లో కాపులతో బీసీలు, ఎస్సీలకు ఏమాత్రం పడదని అందరికీ తెలిసిందే.  అందుకనే కాపేతర సామాజికవర్గాలను వైసీపీ ఫోల్డులోకి తెచ్చుకోవాలంటే కాపులను జనసేన వైపుకు పంపటమే ఏకైక మార్గంగా జగన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.





ఉభయగోదావరి జిల్లాల్లో కాపులు జనసేనకు మద్దతుగా నిలిస్తే కాపేతర సామాజికవర్గాలు ముఖ్యంగా బీసీ(శెట్టిబలిజలు), ఎస్సీలు అనివార్యంగా వైసీపీకి మద్దతుగా నిలుస్తాయని అనుకుంటున్నారు. కాపులు ఎవరికి అయితే మద్దతుగా నిలబడతారో వాళ్ళని బీసీలు, ఎస్సీలు పూర్తిగా వ్యతిరేకించిన ఘటనలు చాలా ఉన్నాయి. అందరు కలిసి ఒకే పార్టీకి ఓట్లేసిన ఘటనలు కూడా ఉన్నా అవి చాలా అరుదు. అందుకనే ఇపుడు ఫైనల్ చేస్తున్న టికెట్లలో కూడా ఎక్కువగా బీసీలకే జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి జగన్ వ్యూహం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>