Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-043dc0a2-04cb-4088-8325-aeb63b7d5395-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-043dc0a2-04cb-4088-8325-aeb63b7d5395-415x250-IndiaHerald.jpgటి20 ఫార్మాట్ అంటేనే బ్యాట్స్మెన్ల విధ్వంసానికి మారుపేరు అన్న విషయం తెలిసిందే. పొట్టి ఫార్మాట్లో బ్యాట్స్మెన్ లదే ఫైచేయిగా కొనసాగుతూ వస్తుందని క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. అభిప్రాయం వ్యక్తం చేయడమే కాదు టి20 మ్యాచ్ లలో కూడా ఇది స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. క్రీజ్ లోకి వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా సిక్సర్లు పోర్లతో చెలరేగిపోతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే స్కోరు బోర్డు సైతం పరుగులు పెట్టి ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది. అంతలా బ్యాట్స్మెన్లు విధ్వంసం సృష్టిస్తూ ఉంటారు. ఇCricket {#}Rohit Sharma;Suryakumar Yadav;West Indies;Babur;Australia;Cricket;INTERNATIONALమెరుపు సెంచరీ.. రోహిత్ రికార్డుకే ఎసరు పెట్టిన మ్యాక్స్ వెల్?మెరుపు సెంచరీ.. రోహిత్ రికార్డుకే ఎసరు పెట్టిన మ్యాక్స్ వెల్?Cricket {#}Rohit Sharma;Suryakumar Yadav;West Indies;Babur;Australia;Cricket;INTERNATIONALMon, 12 Feb 2024 12:30:00 GMTటి20 ఫార్మాట్ అంటేనే బ్యాట్స్మెన్ల విధ్వంసానికి మారుపేరు అన్న విషయం తెలిసిందే. పొట్టి ఫార్మాట్లో బ్యాట్స్మెన్ లదే ఫైచేయిగా కొనసాగుతూ వస్తుందని క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. అభిప్రాయం వ్యక్తం చేయడమే కాదు టి20 మ్యాచ్ లలో కూడా ఇది స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. క్రీజ్ లోకి వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా సిక్సర్లు పోర్లతో చెలరేగిపోతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే స్కోరు బోర్డు సైతం పరుగులు పెట్టి ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది. అంతలా బ్యాట్స్మెన్లు విధ్వంసం సృష్టిస్తూ ఉంటారు. ఇక ఎవరైనా ఆటగాడు టి20 ఫార్మాట్లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు అంటే చాలు అతని గురించి అందరూ చర్చించుకోవడం చేస్తూ ఉంటారు.


 ఇక ఇటీవలే పొట్టి ఫార్మాట్ లో సూపర్ సెంచరీ తో చెలరేగి పోయిన ఆస్ట్రేలియా విధ్వంసకరమైన ఆల్ రౌండర్ మాక్స్వెల్ ఇన్నింగ్స్ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. గత కొన్ని రోజుల నుంచి వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వరుసగా సిరీస్ జరుగుతున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ సిరీస్ ఆడేందుకు వెస్టిండీస్ ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చింది. కాగా సొంతగడ్డ మీద ఆస్ట్రేలియా అదరగొట్టేస్తోంది అని చెప్పాలి. ఇప్పటికే వన్డే సిరీస్ లో వెస్టిండీస్ ను క్లీన్ స్వీప్  చేసిన ఆస్ట్రేలియా.. ఇక ఇప్పుడు పొట్టి ఫార్మాట్లో కూడా విధ్వంసకరమైన ఆట తీరుతో ప్రత్యర్థి వెస్టిండీస్ కి చెమటలు పట్టిస్తుంది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల జరిగిన  టి20 మ్యాచ్ లో ఏకంగా సెంచరీ తో చలరేగిపోయాడు ఆల్ రౌండర్ మాక్స్వెల్.


 అతన్ని అభిమానులు అందరూ కూడా మ్యాడ్ మాక్సి అని ఎందుకు అంటారు అనే విషయాన్ని ఇక తన బ్యాటింగ్ విధ్వంసంతో మరోసారి నిరూపించాడు  అని చెప్పాలి. ఏకంగా అంతర్జాతీయ టి20 ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన రోహిత్ శర్మ ఐదు సెంచరీల రికార్డును అటు మాక్స్వెల్ సమం చేశాడు రోహిత్. 143 ఇన్నింగ్స్ లో ఏకంగా 5 సెంచరీల మార్క్ అందుకోగా అటు విధ్వంసకర ఆటగాడు మాక్స్వెల్ మాత్రం కేవలం 94 ఇన్నింగ్స్ లోనే ఐదు శతకాలు సాధించాడు అని చెప్పాలి. వీరి తర్వాత స్థానాలలో సూర్యకుమార్ యాదవ్ నాలుగు, బాబర్ అస్సాం 3, కొలిన్ మున్రో 3 సెంచరీలతో ఉన్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>