PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ambati-rambabu419b678e-1439-41d0-a55f-0e0666eee9ab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ambati-rambabu419b678e-1439-41d0-a55f-0e0666eee9ab-415x250-IndiaHerald.jpgమూడు రాజధానులకు అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన జీవోలు చెల్లవని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపైనా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది.రాజధాని అమరావతిపై తరచూ వైసీపీ ముఖ్య నేతలు, మంత్రులు వివాదాస్పద కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. అది ఒక కులానికి మాత్రమే రాజధాని అని.. అమరావతి కాదు.. భ్రమరావతి అని, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు మాత్రమే రాజధాని అని అనేక రకాల కామెంట్లు చేస్తున్నారు.అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఏపీ జలవనరుల శాఖ మంత్రి, సత్తెనపల్లి వైసీపీ శాసనసభ్యుడు అంబటి రాంబాబు సంచలన కామెంట్Ambati Rambabu{#}Amaravati;Sattenapalle;Thadikonda;Janasena;Krishna River;Capital;YCP;Andhra Pradesh;TDP;CBN;Governmentఏపీ రాజధానిపై అంబటి సెన్సేషనల్ కామెంట్స్?ఏపీ రాజధానిపై అంబటి సెన్సేషనల్ కామెంట్స్?Ambati Rambabu{#}Amaravati;Sattenapalle;Thadikonda;Janasena;Krishna River;Capital;YCP;Andhra Pradesh;TDP;CBN;GovernmentMon, 12 Feb 2024 16:04:40 GMTమూడు రాజధానులకు అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన జీవోలు చెల్లవని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపైనా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది.రాజధాని అమరావతిపై తరచూ వైసీపీ ముఖ్య నేతలు, మంత్రులు వివాదాస్పద కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. అది ఒక కులానికి మాత్రమే రాజధాని అని.. అమరావతి కాదు.. భ్రమరావతి అని, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు మాత్రమే రాజధాని అని అనేక రకాల కామెంట్లు చేస్తున్నారు.అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఏపీ జలవనరుల శాఖ మంత్రి, సత్తెనపల్లి వైసీపీ శాసనసభ్యుడు అంబటి రాంబాబు సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అని ఆయన స్పష్టం చేయడం హాట్‌ టాపిక్‌ గా మారింది. కోర్టులో స్టే తొలగిన వెంటనే ఏపీకి మూడు రాజధానులను సిద్ధం చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు కామెంట్స్ బాగా హాట్‌ టాపిక్‌ గా మారాయి.నిజానికి అమరావతిపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చే స్తున్నవారిలో మొదటి నుంచి అంబటి రాంబాబు కూడా ఉంటున్నారు.


అలాంటి అంబటే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అని చెప్పడం హాట్‌ టాపిక్‌ గా మారింది. అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గం.. రాజధాని అమరావతి ఉన్న తాడికొండ నియోజకవర్గానికి పక్కనే ఉంది.ఇక ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో రాజధాని ప్రాంత ఓటర్లు వ్యతిరేకంగా ఓటు వేయకుండా ఉండేందుకే అంబటి రాంబాబు ప్రస్తుతానికి ఏపీ రాజధాని అమరావతే అని కామెంట్స్ చేసి ఉంటారని భావిస్తున్నారు. నిజానికి రాజధానిని లేకుండా చేసిన వైసీపీ నేతలకు ఈసారి ఎన్నికల్లో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉండొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.అలాగే టీడీపీ - జనసేన పొత్తులపైనా అంబటి రాంబాబు హాట్‌ కామెంట్స్‌ చేశారు. చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ లది అపవిత్ర పొత్తు అని మండిపడ్డారు. ప్రతిపక్షాల్లో గందరగోళ పరిస్థితి అనేది ఉందన్నారు. జనసేన పార్టీ పొత్తు టీడీపీతోనా లేదా బీజేపీతోనా అని ప్రశ్నించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>