PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-amit-shah-bjp91f605a7-50d2-4bdd-87ec-3c83456dc495-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-amit-shah-bjp91f605a7-50d2-4bdd-87ec-3c83456dc495-415x250-IndiaHerald.jpgబీజేపీతో పొత్తుకోసం వెంపర్లాడుతున్న చంద్రబాబునాయుడులో టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. ఎందుకంటే ఏపీలో పొత్తులపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేమని అమిత్ షా చెప్పారు. ఎన్డీయేలో నుండి తాము ఎవరినీ బయటకు పంపలేదని వాళ్ళంతట వాళ్ళే బయటకు వెళ్ళిపోయినట్లు చెప్పారు. ఒక ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో ప్రాంతీయ పార్టీలతో పొత్తులపై చర్చ జరిగింది. ఆ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతు ఎన్డీయేని విస్తరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. తమకు ఫ్యామిలి ప్లానింగ్ మీద నమ్మకం ఉంది కాని రాజకీయాలకు అది పనికిరాదన్నారు. chandrababu amit shah bjp{#}CBN;Bharatiya Janata Party;Amith Shah;TDP;YCP;Punjab;Parliament;Amit Shahఅమరావతి : చంద్రబాబులో టెన్షన్...వెయిటింగ్ లో పెట్టారా ?అమరావతి : చంద్రబాబులో టెన్షన్...వెయిటింగ్ లో పెట్టారా ?chandrababu amit shah bjp{#}CBN;Bharatiya Janata Party;Amith Shah;TDP;YCP;Punjab;Parliament;Amit ShahMon, 12 Feb 2024 05:00:00 GMT

బీజేపీతో పొత్తుకోసం వెంపర్లాడుతున్న చంద్రబాబునాయుడులో టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. ఎందుకంటే ఏపీలో పొత్తులపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేమని అమిత్ షా చెప్పారు. ఎన్డీయేలో నుండి తాము ఎవరినీ బయటకు పంపలేదని వాళ్ళంతట వాళ్ళే బయటకు వెళ్ళిపోయినట్లు చెప్పారు. ఒక ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో ప్రాంతీయ పార్టీలతో పొత్తులపై చర్చ జరిగింది. ఆ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతు ఎన్డీయేని విస్తరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. తమకు ఫ్యామిలి ప్లానింగ్ మీద నమ్మకం ఉంది కాని రాజకీయాలకు అది పనికిరాదన్నారు.





ఎన్డీయేలోకి తొందరలోనే కొత్తమిత్రులు వస్తున్నట్లు నర్మగర్భంగా చెప్పారు. ఇన్ని మాటలు చెప్పిన అమిత్ షా ఎక్కడ కూడా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో పొత్తు చర్చలు జరిపినట్లు చెప్పలేదు. ఎన్డీయేలోకి టీడీపీ వస్తోందని కూడా చెప్పలేదు. పార్టీల పేర్లను ప్రస్తావించకుండా తొందరలోనే ఎన్డీయేలోకి కొత్తపార్టీలు వస్తున్నట్లు చెప్పారంతే. అసలు చర్చ పంజాబ్ లో అకాలీదళ్ ఎన్డీయేలో చేరటం గురించి మొదలైంది. ఏ ప్రశ్నకూ అమిత్ సూటిగా సమాధానం చెప్పకుండా తొందరేముంది ? పొత్తులపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేమని చెప్పారు. పొత్తులంటే టీడీపీనే ఎందుకు వైసీపీ కూడా కావచ్చు కదానే ఊహాగానాలు పెరిగిపోతున్నాయి.





అమిత్ షా చెప్పిన దానిప్రకారం చూస్తే బీజేపీతో పొత్తు విషయం తేలేందుకు చంద్రబాబు మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే అని అర్ధమవుతోంది. ఈ విషయం కచ్చితంగా చంద్రబాబులో టెన్షన్ పెంచేదే అనటంలో సందేహంలేదు. ఎందుకంటే ఇప్పటికే మిత్రపక్షం జనసేనతో పొత్తు కుదిరినా సీట్ల సంఖ్య, నియోజకవర్గాలపై అధికారిక ప్రకటన జరగలేదు. దాంతో రెండుపార్టీల్లోని నేతల్లో అయోమయం పెరిగిపోతోంది. ఒకటి రెండురోజుల్లో నియోజకవర్గాల సంఖ్య, పోటీచేయబోయే నియోజకవర్గాలను ప్రకటించేందుకు చంద్రబాబు, పవన్ రెడీ అయ్యారు. ఈ సమయంలో పొత్తులో బీజేపీ కూడా చేరే అంశం చర్చకు వచ్చింది.





అందుకనే చంద్రబాబు స్పీడుగా ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా తో మాట్లాడింది. అయితే అమిత్ 35 అసెంబ్లీ, 8 పార్లమెంటు సీట్లడిగారని, అందుకు చంద్రబాబు పార్టీలో మాట్లాడి చెబుతానన్నారని సమాచారం.  ఇదే విషయమై పార్టీలోని నేతలతో పాటు పవన్ తో కూడా చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఈ నేపధ్యంలోనే పొత్తులపై అర్జంటుగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏముందన్నట్లుగా అమిత్ మాట్లాడారు. అంటే పొత్తుపై అమిత్ నిర్ణయం తీసుకునేంతవరకు చంద్రబాబు వెయిటింగ్ లో ఉండక తప్పేట్లులేదు.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>