Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charan53cba2f1-e48a-4a99-8fa6-042893c36d75-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charan53cba2f1-e48a-4a99-8fa6-042893c36d75-415x250-IndiaHerald.jpgమొన్నటి వరకు టాలీవుడ్ ప్రేక్షకులందరికీ కూడా మెగా పవర్ స్టార్ గా కొనసాగిన రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత మాత్రం గ్లోబల్ స్టార్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక త్రిబుల్ ఆర్ సినిమా ముగిసిందో లేదో అంతలోనే మరో సెన్సేషనల్ డైరెక్టర్ అయిన శంకర్ తో గేమ్ చేజర్ అనే మూవీలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీ ముగియక ముందే తన తర్వాత ప్రాజెక్ట్ లను కూడా లైన్లో పెట్టేసాడు రామ్ చరణ్. ఈ క్రమంలోనే ఉప్పెన సినిమాతో సెన్సేషనల్ విజయాన్ని సాధించCharan{#}John Abraham;shankar;Tollywood;Ram Charan Teja;bollywood;Cinema;Pawan Kalyan;GEUM;News;ram pothineni;Directorచరణ్ మూవీలో.. బాలీవుడ్ క్రేజీ స్టార్.. ఎవరో తెలుసా?చరణ్ మూవీలో.. బాలీవుడ్ క్రేజీ స్టార్.. ఎవరో తెలుసా?Charan{#}John Abraham;shankar;Tollywood;Ram Charan Teja;bollywood;Cinema;Pawan Kalyan;GEUM;News;ram pothineni;DirectorMon, 12 Feb 2024 09:05:00 GMTమొన్నటి వరకు టాలీవుడ్ ప్రేక్షకులందరికీ కూడా మెగా పవర్ స్టార్ గా కొనసాగిన రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత మాత్రం గ్లోబల్ స్టార్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక త్రిబుల్ ఆర్ సినిమా ముగిసిందో లేదో అంతలోనే మరో సెన్సేషనల్ డైరెక్టర్ అయిన శంకర్ తో గేమ్ చేజర్ అనే మూవీలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీ ముగియక ముందే తన తర్వాత ప్రాజెక్ట్ లను కూడా లైన్లో పెట్టేసాడు రామ్ చరణ్. ఈ క్రమంలోనే ఉప్పెన సినిమాతో సెన్సేషనల్ విజయాన్ని సాధించిన బుచ్చిబాబు సనాతో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. స్పోర్ట్స్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తీరకెక్కబోతుందట.


 అయితే ఈ సినిమాకు సంబంధించి రోజుకో  వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూనే ఉంది. ఇలా వైరల్ గా   మారిపోయిన వార్త అభిమానులు అందరిలో కూడా సినిమాపై ఉన్న ఆసక్తిని అంతకంతకు పెంచేస్తూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా గురించి ఒక మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఏకంగా చరన్ మూవీలో ఒక బాలీవుడ్ క్రేజీ స్టార్ నటించబోతున్నాడట. అతను ఎవరో కాదు జాన్ అబ్రహం అంటూ ఒక వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో తెగ వైరల్ గా మారిపోయింది.


 ఏకంగా రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకేక్కుతున్న సినిమాలో జాన్ అబ్రహం ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు అంటూ ప్రచారం ఊపందుకుంది.  అయితే ఇక జాన్ అబ్రహం లాంటి స్టార్ నటిస్తూ ఉండడంతో ఎలాంటి పాత్ర చేయబోతున్నాడో అని అభిమానులందరూ కూడా తెలుసుకోవడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే దీనిపై చిత్ర బృందం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. కాగా ఇక ఈ మూవీలో సమంత, జాన్వీ కపూర్ కూడా నటిస్తున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పటివరకు దీనిపై అధికారిక ప్రకటన రాలేదు అని చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>