Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhoni4e66776c-b3c0-4fa5-a866-3bbd24a59aa3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhoni4e66776c-b3c0-4fa5-a866-3bbd24a59aa3-415x250-IndiaHerald.jpgజెర్సీ నెంబర్ 7.. ఇది ఇండియన్ క్రికెట్లో ఎంత ఫేమస్సొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సాధారణంగా ఆటగాళ్లకు అభిమానులు ఉండడం చూస్తూ ఉంటాం. కానీ జెర్సీ నెంబర్ 7 కి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతకీ జెర్సీ నెంబర్ సెవెన్ ఎవరిదో మీకు తెలిసే ఉంటుంది. ఏకంగా భారత క్రికెట్ చరిత్రలో ఎన్నో సంచలన విజయాలకు కారణమైన మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిది. ఏకంగా ఒక రైల్వే టికెట్ కలెక్టర్ స్థాయి నుంచి దేశం గర్వించదగ్గ క్రికెటర్ స్థాయికి ఎదిగిన ఒక అసాధారణ మనిషిది ఈ జెర్సీ నెంబర్ సెవెన్.Dhoni{#}Fidaa;MS Dhoni;Jersey;collector;Mister;Parents;World Cup;Indian;Cricketజెర్సీ నెంబర్.7 ఫై.. సీక్రెట్ బయటపెట్టిన ధోని?జెర్సీ నెంబర్.7 ఫై.. సీక్రెట్ బయటపెట్టిన ధోని?Dhoni{#}Fidaa;MS Dhoni;Jersey;collector;Mister;Parents;World Cup;Indian;CricketMon, 12 Feb 2024 13:00:00 GMTజెర్సీ నెంబర్ 7.. ఇది ఇండియన్ క్రికెట్లో ఎంత ఫేమస్సొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సాధారణంగా ఆటగాళ్లకు అభిమానులు ఉండడం చూస్తూ ఉంటాం. కానీ జెర్సీ నెంబర్ 7 కి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతకీ జెర్సీ నెంబర్ సెవెన్ ఎవరిదో మీకు తెలిసే ఉంటుంది. ఏకంగా భారత క్రికెట్ చరిత్రలో ఎన్నో సంచలన విజయాలకు కారణమైన మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిది. ఏకంగా ఒక రైల్వే టికెట్ కలెక్టర్ స్థాయి నుంచి దేశం గర్వించదగ్గ క్రికెటర్ స్థాయికి ఎదిగిన ఒక అసాధారణ మనిషిది ఈ జెర్సీ నెంబర్ సెవెన్.


 ఇండియన్ క్రికెట్ హిస్టరీలో మిస్టర్ కూల్ కెప్టెన్ గా.. ఏకంగా భారత జట్టుకు అందరిని ద్రాక్షలా ఉన్న వరల్డ్ కప్ ను రెండు సార్లు అందించిన సారధిగా కొనసాగుతున్న ధోని ధరించే జెర్సీ నెంబర్ సెవెన్ కి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకసారి మహేంద్ర సింగ్ ధోని ఇలా ఏడవ నెంబర్ జెర్సీ ధరించి మైదానంలోకి దిగాడు అంటే చాలు ఫ్యాన్స్ ఫిదా అయిపోయి.. ధోని ధోని అంటూ నినాదాలు చేయడం ఇప్పటివరకు ఎన్నోసార్లు చూశాం. అయితే ధోని బర్త్ డే జూలై 7వ తేదీన కావడంతో ఇక అతను జెర్సీ నెంబర్ కూడా 7 అని పెట్టుకున్నాడు అని ఇప్పటివరకు అందరూ అనుకుంటూ ఉన్నారు. ఇప్పటివరకు ఈ విషయంపై ధోని మాత్రం ఎప్పుడు స్పందించలేదు.


 అయితే ఇటీవలే తన జెర్సీ నెంబర్ 7  ఉండడం పై స్పందించిన ధోని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. నన్ను ఆ తేదీనే కనాలని మా తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. నేను 1981 జులై ఏడవ తేదీన జన్మించాను. జూలై అంటే ఏడవ నెల. ఇక 81వ సంవత్సరంలో 8-1 మైనస్ ఒకటి చేస్తే వచ్చేది కూడా ఏడే. అందుకే ఈ నెంబర్ నాకు ఎంతో ప్రత్యేకము. దీంతో నీకు ఏ జెర్సీ  నెంబర్ కావాలని నన్ను బీసీసీ పెద్దలు అడిగినప్పుడు ఇక ఏడవ నెంబర్ ని ఎంచుకోవడం నాకు ఎంతో సులభం అయింది అంటూ చెప్పుకొచ్చాడు ధోని.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>