Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli006fca65-34ff-47bf-bbd8-d9826ca1b44f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli006fca65-34ff-47bf-bbd8-d9826ca1b44f-415x250-IndiaHerald.jpgభారత జట్టు ప్రస్తుతం వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీబిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండియా పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టుతో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఇక ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్లు ముగిసాయి అని చెప్పాలి. అయితే ఈ రెండు మ్యాచ్లలో కూడా ఎందుకొ భారత బ్యాటింగ్ విభాగం పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. యువ ఆటగాళ్లు మెరుపులు మెరూపించారు తప్ప సీనియర్లు మాత్రం తేలిపోతూనే ఉన్నారు. దీంతో ఇక జట్టులో విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్ లేని లోటు కొట్టొచ్చినKohli{#}VIRAT KOHLI;Harbhajan Singh;England;Shreyas Iyer;Yuva;BCCI;Cricket;Indiaఅతను లేకుండా.. టీమిండియా టెస్ట్ జట్టు అసంపూర్ణమే : భజ్జీఅతను లేకుండా.. టీమిండియా టెస్ట్ జట్టు అసంపూర్ణమే : భజ్జీKohli{#}VIRAT KOHLI;Harbhajan Singh;England;Shreyas Iyer;Yuva;BCCI;Cricket;IndiaMon, 12 Feb 2024 16:00:00 GMTభారత జట్టు ప్రస్తుతం వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీబిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండియా పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టుతో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఇక ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్లు ముగిసాయి అని చెప్పాలి. అయితే ఈ రెండు మ్యాచ్లలో కూడా ఎందుకొ భారత బ్యాటింగ్ విభాగం పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. యువ ఆటగాళ్లు మెరుపులు మెరూపించారు తప్ప సీనియర్లు మాత్రం తేలిపోతూనే ఉన్నారు. దీంతో ఇక జట్టులో విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్ లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది అని చెప్పాలి. కాగా కోహ్లీ వ్యక్తిగత కారణాలతో బిసిసిఐ సెలెక్టర్ల అనుమతితోనే ప్రస్తుతం జట్టుకు దూరమయ్యాడు.


 అయితే మొదట కేవలం రెండు టెస్ట్ మ్యాచ్లకి మాత్రమే విరాట్ కోహ్లీ దూరంగా ఉంటాడు అని అందరూ అనుకున్నారు. అయితే మూడో టెస్ట్ మ్యాచ్ నుంచి మాత్రం కోహ్లీ ఇక టీంలోకి అందుబాటులోకి వస్తాడు అని భావించారు. కానీ ఓడించనీ రీతిలో విరాట్ కోహ్లీ ఇక టెస్టు సిరీస్ మొత్తానికి కూడా దూరం అయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఇటీవల బీసీసీఐ సెలెక్టర్లు మిగిలిన మూడు టెస్ట్ మ్యాచ్లకు సంబంధించిన జట్టు వివరాలను ప్రకటించగా.  ఇక కోహ్లీ వ్యక్తిగత కారణాలతో ఈ మూడు టెస్టులకు కూడా దూరమయ్యారు అన్నది స్పష్టమైంది. అయితే విరాట్ కోహ్లీతో పాటు అటు శ్రేయస్ అయ్యర్ కూడా గాయపడి జట్టుకు దూరమయ్యాడు.


 ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ లేకుండా అటు టీమిండియా ఎలా రానించగలదు అనే విషయంపై ఎంతోమంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదే విషయంపై అటు టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. విరాట్ కోహ్లీ లేకుండా భారత జట్టు ప్రస్తుతం ఆడుతున్న టెస్ట్ మ్యాచ్లు అసంపూర్ణంగా ఉన్నాయి అని అనిపిస్తుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు హర్భజన్ సింగ్. విరాట్ కోహ్లీ అతని కుటుంబం ప్రస్తుతం క్షేమంగానే ఉంది అని భావిస్తున్న.. అతను త్వరగా టెస్ట్ క్రికెట్ లోకి రావాలి. అతను టెస్ట్ క్రికెట్ కి ఒక బ్రాండ్. టెస్ట్ ఫార్మాట్ ని ముందుకు తీసుకు వెళ్తున్న ఆటగాడు విరాట్ కోహ్లీ అంటూ హర్భజన్ చెప్పుకొచ్చాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>