PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-tdp-jagane55b6c6f-9c1b-4095-89fa-8c8963cc1a58-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-tdp-jagane55b6c6f-9c1b-4095-89fa-8c8963cc1a58-415x250-IndiaHerald.jpgఅయితే ఎవరు నామినేషన్ వేసినా ఎలాంటి ఉపయోగం ఉండదని అర్ధమవుతోంది. ఎందుకంటే 175 మంది సభ్యులున్న అసెంబ్లీలో వైసీపీ బలం 151 అయితే టీడీపీ బలం 23 మంది ఎంఎల్ఏలు. జనసేన తరపున ఒకళ్ళు గెలిచారు. ఈ లెక్క ప్రకారం భర్తీ చేయాల్సిన మూడు రాజ్యసభ స్ధానాల్లో ఒక్కో ఎంపీ అభ్యర్ధికి 44 మంది ఎంఎల్ఏలు ఓట్లేయాలి. అయితే టీడీపీ సభ్యుడు గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు కాబట్టి సభ్యుల సంఖ్య 174 మాత్రమే. chandrababu tdp jagan{#}GANTA SRINIVASA RAO;Scheduled caste;Reddy;Varla Ramaiah;Haribabu Kambhampati;Jagan;Rajya Sabha;YCP;MP;TDP;Janasena;Yevaru;Assembly;రాజీనామాఅమరావతి : ఈసారి వర్కవుట్ అవ్వదా ?అమరావతి : ఈసారి వర్కవుట్ అవ్వదా ?chandrababu tdp jagan{#}GANTA SRINIVASA RAO;Scheduled caste;Reddy;Varla Ramaiah;Haribabu Kambhampati;Jagan;Rajya Sabha;YCP;MP;TDP;Janasena;Yevaru;Assembly;రాజీనామాSun, 11 Feb 2024 09:00:00 GMT

తొందరలోనే జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్దిని పోటీచేయించేందుకు  చంద్రబాబునాయుడు ప్లాన్ చేస్తున్నారు. ఈనెల 27వ తేదీన ఎన్నిక జరగబోతోంది. దీనికి సంబంధించి నామినేషన్ పత్రాల జారీని అసెంబ్లీ సెక్రటేరియట్ మొదలుపెట్టింది. తెలుగుదేశంపార్టీ నామినేషన్ పత్రాన్ని తీసుకున్నది. టీడీపీ తరపున సీనియర్ నేత వర్ల రామయ్య పోటీచేస్తారని ఒకసారి కాదుకాదు కంభంపాటి రామ్మోహన్ పోటీచేయబోతున్నారని మరోసారి ప్రచారం జరుగుతోంది. మామూలుగా అయితే గెలుపు అవకాశాలు లేనపుడు పోటీవిషయంలో చంద్రబాబుకు ఎస్సీ నేత వర్లరామయ్యే గుర్తుకొస్తారు.





అయితే ఎవరు నామినేషన్ వేసినా ఎలాంటి ఉపయోగం ఉండదని అర్ధమవుతోంది. ఎందుకంటే 175 మంది సభ్యులున్న అసెంబ్లీలో వైసీపీ బలం 151 అయితే  టీడీపీ బలం 23 మంది ఎంఎల్ఏలు. జనసేన తరపున ఒకళ్ళు గెలిచారు. ఈ లెక్క ప్రకారం భర్తీ చేయాల్సిన మూడు రాజ్యసభ స్ధానాల్లో ఒక్కో ఎంపీ అభ్యర్ధికి 44 మంది ఎంఎల్ఏలు ఓట్లేయాలి. అయితే టీడీపీ సభ్యుడు గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు కాబట్టి సభ్యుల సంఖ్య 174 మాత్రమే.





తగ్గిన ఓటు ప్రకారం ఒక రాజ్యసభ ఎంపీ అభ్యర్ధికి 43 ఓట్లు అవసరమవుతుంది. 173లో వైసీపీ బలం 151 అలాగే ఉంటే టీడీపీ బలం 22కి తగ్గింది. ఇందులో వైసీపీలోని  ఎంపీ అభ్యర్ధికి 43 మంది ఎంఎల్ఏలు చొప్పున ముగ్గురికి కలిపి 129 మంది ఎంఎల్ఏలు ఓట్లేయాల్సుంటుంది. ప్రతి ఎంపీ అభ్యర్ధికి జగన్మోహన్ రెడ్డి 129 మందిని కేటాయిస్తారు. 174లో నుండి 129 మందిని తీసేస్తే మిగిలింది 45 మంది ఎంఎల్ఏలు. ఈ 45 మంది ఎంఎల్ఏల్లో జనసేన ఎంఎల్ఏ కూడా ఉన్నారు.  అంటే 44 మంది ఎంఎల్ఏల్లో  టీడీపీ బలం 22 మాత్రమే. వీరిలో వైసీపీలోని  అసంతృప్తుల్లో ఎంతమంది టీడీపీకి సహకరిస్తారో తెలీదు. మహాయితే ఓ పదిమంది ఎంఎల్ఏలు సహకరించవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే ముగ్గురు అభ్యర్ధులకు కేటాయించిన 43 మంది ఎంఎల్ఏలను జగన్ అప్పగించేశారట.





మొదటి ప్రయారిటి ఓట్లకింద 129 మంది ముగ్గురికి ఓట్లు వేసేస్తే ఇక టీడీపీకి గెలుపు అవకాశాలుండవు. ఆమధ్య జరిగిన ఎంఎల్సీ ఎన్నికల్లో వైసీపీ దెబ్బతిన్నదంటే  175 మంది ఎంఎల్ఏల ఓట్ల కోసం ఎనిమిది మంది అభ్యర్ధులు పోటీపడ్దారు. సరిగ్గా 25 మంది ఎంఎల్ఏలు ఓట్లేయాలి కాబట్టి టీడీపీ నలుగురు వైసీపీ అసంతృప్త ఎంఎల్ఏలతో క్రాస్ ఓటింగ్ చేయించుకుని గెలుచుకుంది. కాని ఇపుడు పరిస్ధితి అదికాదు. ముగ్గురు అభ్యర్ధులకు 129 మందిని కేటాయించటంతో మొదటి ప్రయారిటి ఓట్లతోనే వైసీపీ అభ్యర్ధులు గెలిచేస్తారు. కాబట్టి టీడీపీకి మొదటి ప్రయారిటి ఓట్లే పడే అవకాశం లేవు కాబట్టి గెలుపు కూడా సాధ్యంకాదు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>