HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/chiken-liver-eating-healthf63a458a-a513-4737-8846-369d057014e5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/chiken-liver-eating-healthf63a458a-a513-4737-8846-369d057014e5-415x250-IndiaHerald.jpgపూర్వకాలంలో అయితే ఏ పండగో ఏ పబ్బము వచ్చినప్పుడు మాత్రమే మాంసం తినేవారు.కానీ ఈ మధ్యకాలంలో చికెన్ ఇష్టపడని వారంటూ ఉండరు. ఇంకా చెప్పాలి అంటే చాలామందికి ముక్క లేనిదే ముద్ద దిగదు.కానీ కొంతమంది చికెన్ బ్రెస్ట్ పీస్ తిన్నట్టు,చికెన్ లివర్ ని మాత్రం అంతగా ఇష్టపడరు.కానీ చికెన్ బ్రెస్ట్ పీస్ తినడం కన్నా,చికెన్ లివర్ తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు ఆహార నిపుణులు.దీనిలో ఉన్న ప్రయోజనాల గురించి తెలిస్తే కచ్చితంగా ఈసారి లివర్ తెచ్చుకొని మరీ తింటారు. మరి అవి ఏంటో చూద్దామా.. చికెన్ లివర్‌లోCHIKEN LIVER;EATING;HEALTH{#}bhavana;vitamin A;Iron;Vitamin;Chicken;Pregnant;Shaktiచికెన్ లివర్ ని తినకుండా వదిలేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవలసిందే..?చికెన్ లివర్ ని తినకుండా వదిలేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవలసిందే..?CHIKEN LIVER;EATING;HEALTH{#}bhavana;vitamin A;Iron;Vitamin;Chicken;Pregnant;ShaktiSun, 11 Feb 2024 06:00:00 GMTపూర్వకాలంలో అయితే ఏ పండగో ఏ పబ్బము వచ్చినప్పుడు మాత్రమే మాంసం తినేవారు.కానీ ఈ మధ్యకాలంలో చికెన్ ఇష్టపడని వారంటూ ఉండరు. ఇంకా చెప్పాలి అంటే చాలామందికి ముక్క లేనిదే ముద్ద దిగదు.కానీ కొంతమంది చికెన్ బ్రెస్ట్ పీస్ తిన్నట్టు,చికెన్ లివర్ ని మాత్రం అంతగా ఇష్టపడరు.కానీ చికెన్ బ్రెస్ట్ పీస్ తినడం కన్నా,చికెన్ లివర్ తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు ఆహార నిపుణులు.దీనిలో ఉన్న ప్రయోజనాల గురించి తెలిస్తే కచ్చితంగా ఈసారి లివర్ తెచ్చుకొని మరీ తింటారు. మరి అవి ఏంటో చూద్దామా..

చికెన్ లివర్‌లో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.ఐరన్ అనేది మన శరీరాలు ఆక్సిజనేటెడ్‌గా ఉండటానికి సహాయపడేందుకు ముఖ్యమైనది.ఇది రక్తహీనతతో బాధపడేవారికి మంచి ఆహారం అని చెప్పవచ్చు.మరి ముఖ్యంగా గర్భం దాల్చిన వారికి తగిన మోతాదులో లివర్ ఇవ్వడం వల్ల వారి పోలిక్ యాసిడ్ పెరిగి, రక్తహీనత తగ్గుముఖం పడుతుంది.

 చికెన్ బ్రెస్ట్ పీస్ తో చికెన్ లివర్ ని కంపేర్ చేసినప్పుడు చికెన్ లివర్ లో తక్కువ క్యాలరీలు ఉంటాయి.మరియు అధిక ప్రోటీన్ ఉంటుంది.దీనితో తొందరగా పొట్ట నిండిన భావన కలిగి తక్కువ తింటారు.దీనిని తరచూ తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు.

అంతేకాక ఇందులో యాంటీవైరల్,యాంటీ ఇన్ఫ్లమేటరీ అమైనో యాసిడ్ లైసిన్‌లో పుష్కలంగా లభిస్తాయి. దీనితో పాటు చికెన్ లివర్‌లో కొన్ని బి విటమిన్లు లభించి గర్భిణీలు,తల్లులు, పెరుగుతున్న పిల్లలలో ప్రో-మెటబాలిక్ శక్తి యొక్క అదనపు బూస్ట్ అవసరమయ్యే ఎవరికైనా ఇది సహాయకరంగా ఉంటుంది.

దంత ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలనుకుంటే, చికెన్ కాలేయాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.3.5 ఔన్సుల చికెన్ కాలేయంలో 12 మైక్రోగ్రాముల K2 లభిస్తుంది.మరియు విటమిన్ సి,ఎ పుష్కలంగా దొరుకుతాయి.దీనిని తరుచూ తీసుకోవడంతో రోగనిరోధక శక్తిని పెరుగుతుంది.కళ్ళు,చర్మం,జుట్టు మరియు గోళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో విటమిన్ ఏ అద్భుతంగా పనిచేస్తుంది.

కానీ గర్భిణీ స్త్రీలు దీనిని మోతాదులో మాత్రమే తీసుకోవాలి.లేకుంటే విటమిన్ ఏ అధికంగా లభించి పిల్లలకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>