PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-anantapur-chandrababub7c56892-8e20-45ed-86d5-d99fdf6a857c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-anantapur-chandrababub7c56892-8e20-45ed-86d5-d99fdf6a857c-415x250-IndiaHerald.jpgఅందుకనే ఇపుడు హిందుపురం జిల్లాలో ఒక్కటంటే ఒక్క అసెంబ్లీలో కూడా జనసేనకు పోటీచేసే అవకాశం రావటంలేదని మండిపోతున్నారు. ధర్మవరం, కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాల్లో కనీసం ఒక్క సీటైనా తీసుకోమని పవన్ కు నేతలు ఎంత చెబుతున్నా పట్టించుకోవటంలేదట. అందుకనే తమ్ముళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని తమ పార్టీకి ఒక్క సీటు కూడా లేకుండా చేస్తున్నారంటు తెగ బాధపడిపోతున్నారు. pawan anantapur chandrababu{#}Puttaparthi;CBN;Janasena;TDP;Parliament;Party;Pawan Kalyanఅమరావతి : జనసేనకు ఒక్క సీటు కూడా లేదా ?అమరావతి : జనసేనకు ఒక్క సీటు కూడా లేదా ?pawan anantapur chandrababu{#}Puttaparthi;CBN;Janasena;TDP;Parliament;Party;Pawan KalyanSun, 11 Feb 2024 07:00:00 GMT

గ్రౌండ్ లెవల్లో పరిస్ధితులను గమనిస్తుంటే ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో హిందుపురం జిల్లాలో జనసేన తరపున ఒక్క అభ్యర్ధిగా పోటీచేయటంలేదని సమాచారం. పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీల్లో ఒక్క సీటును కూడా జనసేనకు కేటాయించటానికి చంద్రబాబునాయుడు అంగీకరించలేదట. ఏడు అసెంబ్లీల్లోను తమ నేతలు చాలా బలంగా ఉన్న కారణంగా జనసేనకు సీటు కేటాయించటం కష్టమే అని చంద్రబాబు చెప్పిందానికి పవన్ కల్యాణ్ అంగీకరించారని పార్టీవర్గాలు చెబుతున్నాయి.





తమ అధినేత అపరిపక్వత కారణంగానే ఇపుడు ఈ పరిస్ధితి వచ్చిందని జనసైనికులు మండిపోతున్నారు. చంద్రబాబు  జైలులో ఉన్నపుడు తమ అధినేత ఓపికపట్టుంటే టీడీపీనే తమ కాళ్ళబేరానికి వచ్చుండేదని నేతలు గుర్తుచేసుకుంటున్నారు. అలాకాకుండా టీడీపీ బాగా అయోమయంలో ఉన్నపుడు తమ అధినేత తనంతట తానుగా వెళ్ళి పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించి తప్పుచేశారని చాలామంది చెబుతున్నారు. సీట్ల విషయంలో నేతలు పట్టుబట్టమని పవన్ కు ఎంత చెబుతున్నా పట్టించుకోవటంలేదట.





అందుకనే ఇపుడు హిందుపురం జిల్లాలో ఒక్కటంటే  ఒక్క అసెంబ్లీలో కూడా జనసేనకు పోటీచేసే అవకాశం రావటంలేదని మండిపోతున్నారు. ధర్మవరం, కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాల్లో కనీసం ఒక్క సీటైనా తీసుకోమని పవన్ కు నేతలు ఎంత చెబుతున్నా పట్టించుకోవటంలేదట. అందుకనే తమ్ముళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని తమ పార్టీకి ఒక్క సీటు కూడా లేకుండా చేస్తున్నారంటు తెగ బాధపడిపోతున్నారు.





ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే పోటీచేసే అవకాశం తమ పార్టీకి పోతోందే అని జనసేన నేతలు బాధపడుతున్నారే కాని పవన్ కు మాత్రం ఎలాంటి బాధున్నట్లు లేదు. చంద్రబాబు ఏమి చెబితే అది ఎన్నిసీట్లిస్తే అన్నే తీసుకునేందుకు మెంటల్ గా సిద్ధపడిపోయారు.  కాబట్టి నేతలు, క్యాడర్ ఎంత బాధపడుతున్నా పవన్ మాత్రం పట్టించుకోవటంలేదు. అంటే పార్టీ ఉనికిని చాటుకోవాలన్న తపన నేతలు, క్యాడర్లో కనిపిస్తోంది కాని పవన్లో లేదన్న విషయం అర్ధమైపోతోంది. కాబట్టి నేతలు, క్యాడర్ పార్టీ బాగుకోసం బాధపడాల్సిన అవసరం లేదనిపిస్తోంది.  




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>