MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpg‘డిజే టిల్లు’ మూవీతో యూత్ కు క్రేజీ హీరోగా బాగా దగ్గరైన సిద్దూ జొన్నలగడ్డ తన లేటెస్ట్ మూవీ ‘టిల్లు స్క్వేర్’ తో తన ఇమేజ్ ని మరింత పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ ప్రయత్నాలు కొనసాగిస్తూనే మరొక ప్రయోగానికి ఈ యంగ్ హీరో రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో జొన్నల గడ్డ సిద్దూ నటిస్తున్న మూవీకి ‘జాక్’ అన్న టైటిల్ ను అధికారికంగా ప్రకటిస్తూ అతడి పుట్టినరోజున విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ యూత్ కు బాగా కనెక్ట్ అయింది. ‘బేబి’ ఫేమ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య ఈ మూవీలsidhhu jonallagadda{#}akhil akkineni;bhaskar;Genre;Traffic police;Chaitanya;Posters;Mass;Hero;Heroine;Baba Bhaskar;News;Audience;House;Cinemaరూట్ మార్చిన సిద్దూ జొన్నలగడ్డ !రూట్ మార్చిన సిద్దూ జొన్నలగడ్డ !sidhhu jonallagadda{#}akhil akkineni;bhaskar;Genre;Traffic police;Chaitanya;Posters;Mass;Hero;Heroine;Baba Bhaskar;News;Audience;House;CinemaSat, 10 Feb 2024 14:00:00 GMT‘డిజే టిల్లు’ మూవీతో యూత్ కు క్రేజీ హీరోగా బాగా దగ్గరైన సిద్దూ జొన్నలగడ్డ తన లేటెస్ట్ మూవీ ‘టిల్లు స్క్వేర్’ తో తన ఇమేజ్ ని మరింత పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ ప్రయత్నాలు కొనసాగిస్తూనే మరొక ప్రయోగానికి ఈ యంగ్ హీరో రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది.



‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో జొన్నల గడ్డ సిద్దూ నటిస్తున్న మూవీకి ‘జాక్’ అన్న టైటిల్ ను అధికారికంగా ప్రకటిస్తూ అతడి పుట్టినరోజున విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ యూత్ కు బాగా కనెక్ట్ అయింది. ‘బేబి’ ఫేమ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. సిద్దూ తన రెగ్యులర్ జోనర్ కు భిన్నంగా ఈసారి యాక్షన్ జానర్ ను ఎంచుకోవడంతో ఈ యంగ్ హీరో మరొక ప్రయోగం చేయబోతున్నాడా అన్న సందేహాలు వస్తున్నాయి.  



సిద్దూ ని యూత్ కు బాగా దగ్గర చేసిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ నుండి ‘టిల్లు స్క్వేర్’ వరకు చేసిన సినిమాలు అన్నీ ఫ్యామిలీ ఆడియన్స్ ను అదేవిధంగా మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని చేసినవి కావు. అయితే ఇప్పుడు క్రైమ్ యాక్షన్ జోనర్ తో మాస్ సినిమా వైపు ఈయంగ్ హీరో అడుగులు వేస్తున్న పరిస్థితులలో ఇండస్ట్రీలో ఇప్పటికే బాగా సెటిల్ అయిన మాస్ హీరోల మధ్య జొన్నల గడ్డ సిద్దూ కు ఎంతవరకు స్థానం ఉంటుంది అన్న చర్చలు జరుగుతున్నాయి.



తెలుస్తున్న సమాచారం మేరకు ‘బొమ్మరిల్లు’ భాస్కర్ మూవీలో సిద్దూ యంగ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని టాక్. ‘టిల్లు స్క్వేర్’ మార్చ్ 29 రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఆమూవీ ఫలితం బట్టి ‘జాక్’ మూవీ బిజినెస్ ఆధారపడి ఉంటుంది. అఖిల్ తో తీసిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీ తరువాత బొమ్మరిల్లు’ భాస్కర్ చేస్తున్న ఈ మూవీ కోసం చాల హోమ్ వర్క్ చేసినట్లు అనిపిస్తోంది..





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>