MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/fighter-af70aa8b-ed70-4a74-8742-94020224105b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/fighter-af70aa8b-ed70-4a74-8742-94020224105b-415x250-IndiaHerald.jpgరీసెంట్ గా రిలీజ్ అయిన బాలీవుడ్ చిత్రం 'ఫైటర్' అట్టర్ ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీలో హృతిక్ రోషన్-దీపికా పదుకొణే ముద్దు సీన్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ ఎయిర్ ఫోర్స్ అధికారి ఫిర్యాదు చెయ్యడం జరిగింది.యూనిఫాంలో ముద్దు సన్నివేశాల్లో నటించడం అనేది దేశ రక్షణ వ్యవస్థ అయిన ఎయిర్ ఫోర్స్ ని అవమాన పరిచినట్లే అంటూ అస్సాంకి చెందిన వాయుసేన అధికారి సౌమ్యదీప్ దాస్ ఆరోపించడం జరిగింది.ఇక దీనిపై చిత్ర బృందం వెంటనే వివరణ ఇవ్వాలని కోరారు. అయితే తాజాగా ఈ వివాదంపై మూవీ దర్శకుడు సిద్దార్ధ్ ఆనంద్ స్పందింFighter {#}anand malayalam actor;anjana sowmya;sowmya;Tangirala Sowmya;Anand Deverakonda;Yevaru;bollywood;Cinemaఫైటర్: కిస్ సీన్ల వివాదంపై డైరెక్టర్ ఏమన్నాడంటే?ఫైటర్: కిస్ సీన్ల వివాదంపై డైరెక్టర్ ఏమన్నాడంటే?Fighter {#}anand malayalam actor;anjana sowmya;sowmya;Tangirala Sowmya;Anand Deverakonda;Yevaru;bollywood;CinemaSat, 10 Feb 2024 19:03:50 GMTరీసెంట్ గా రిలీజ్ అయిన బాలీవుడ్ చిత్రం 'ఫైటర్' అట్టర్ ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీలో హృతిక్ రోషన్-దీపికా పదుకొణే ముద్దు సీన్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ ఎయిర్ ఫోర్స్ అధికారి ఫిర్యాదు చెయ్యడం జరిగింది.యూనిఫాంలో ముద్దు సన్నివేశాల్లో నటించడం అనేది దేశ రక్షణ వ్యవస్థ అయిన ఎయిర్ ఫోర్స్ ని అవమాన పరిచినట్లే అంటూ అస్సాంకి చెందిన వాయుసేన అధికారి సౌమ్యదీప్ దాస్ ఆరోపించడం జరిగింది.ఇక దీనిపై చిత్ర బృందం వెంటనే వివరణ ఇవ్వాలని కోరారు. అయితే తాజాగా ఈ వివాదంపై మూవీ దర్శకుడు సిద్దార్ధ్ ఆనంద్ స్పందించారు. సినిమా సెన్సార్ పూర్తయ్యాక వాయుసేన అధికారులకు చూపించినట్లు ఆయన తెలిపారు. 'ఎయిర్ ఫోర్స్ పై నాకు చాలా గౌరవం ఉంది. నిబంధనల మేరకే మేం సినిమా తీసాం. స్క్రిప్ట్ నుంచి సెన్సార్ రిపోర్ట్ దాకా ప్రతీ విషయం వాయుసేన అధికారులతో చర్చించే తీసాం.


రిలీజ్ కి ముందు ఎయిర్ పోర్స్ చీఫ్ తో కూడా మేం మాట్లాడాం.వంద మంది అధికారులకు ముందే ఈ సినిమాని చూపించాం.ఇక వాళ్ల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకున్నాం. అయినా కానీ మాపై ఫిర్యాదు చేసినట్లు వచ్చింది. అసలు ఆ పేరుతో ఎయిర్ ఫోర్స్ లో ఎటువంటి అధికారి లేరని మా దృష్టికి వచ్చింది. ఇలా ఎవరు చేస్తున్నారో? మాకు అర్దం కాలేదంటూ' సిద్దార్ద్ ఆనంద్ తెలిపారు. మరి ఆయన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసిన సౌమ్య దీప్ దాస్ మళ్లీ తెరపైకి వస్తారా? అనేది చూడాలి.'ఫైటర్' సినిమా రిలీజ్ తరువాత ఈ ఫిర్యాదు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అదే సినిమా రిలీజ్ ముందు అయితే ఈ ఫిర్యాదు పెద్ద వివాదాస్పదంగా మారేదని విశ్లేషకులు భావిస్తున్నారు. అది ఖచ్చితంగా వసూళ్లపైనా ప్రభావం చూపించేది. ఎన్నో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా వాటిని అందుకోవడంలో మాత్రం దారుణంగా విఫల మైంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>