MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan2edb128a-f866-412d-8426-7134e4c851c6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan2edb128a-f866-412d-8426-7134e4c851c6-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరో హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక సినిమా పూర్తి కాకముందే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కెరీర్ పరంగా చాలా బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ శంకర్ కాంబో మూవీ గేమ్ ఛేంజర్ ఈ సంవత్సరం దసరా పండుగ కానుకగా విడుదల కానుంది.అలాగే చరణ్ బుచ్చిబాబుతో చేస్తున్న మూవీ ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండటం గమనార్హం. ఈ మూవీలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని చరణ్ లుక్ కూడా కొత్తగా ఉంటుందని సమాచారం తెలుస్తోంది.ఈ మూవీలతో పాటు రామ్ చరణ్ సంజయ్ లీలా భన్సాలీ కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయిందని సమాచాRam Charan{#}Ram Charan Teja;Pawan Kalyan;producer;war;Producer;Legend;Fidaa;king;Success;Dussehra;Vijayadashami;bollywood;Hero;Darsakudu;Cinema;Director;Newsసూపర్ కథతో బాలీవుడ్ టాప్ డైరెక్టర్ తో చరణ్ సినిమా?సూపర్ కథతో బాలీవుడ్ టాప్ డైరెక్టర్ తో చరణ్ సినిమా?Ram Charan{#}Ram Charan Teja;Pawan Kalyan;producer;war;Producer;Legend;Fidaa;king;Success;Dussehra;Vijayadashami;bollywood;Hero;Darsakudu;Cinema;Director;NewsSat, 10 Feb 2024 17:55:35 GMTటాలీవుడ్ స్టార్ హీరో హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక సినిమా పూర్తి కాకముందే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కెరీర్ పరంగా చాలా బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ శంకర్ కాంబో మూవీ గేమ్ ఛేంజర్ ఈ సంవత్సరం దసరా పండుగ కానుకగా విడుదల కానుంది.అలాగే చరణ్ బుచ్చిబాబుతో చేస్తున్న మూవీ ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండటం గమనార్హం. ఈ మూవీలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని చరణ్ లుక్ కూడా కొత్తగా ఉంటుందని సమాచారం తెలుస్తోంది.ఈ మూవీలతో పాటు రామ్ చరణ్ సంజయ్ లీలా భన్సాలీ కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయిందని సమాచారం తెలుస్తుంది. రామ్ చరణ్ భన్సాలీ కాంబో మూవీ పీరియాడిక్ వార్ డ్రామాగా తెరకెక్కనుందని సమాచారం తెలుస్తోంది. ది లెజెండ్ ఆఫ్ సహేల్ దేవ్ అనే పుస్తకం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. 11వ శతాబ్దంలో శ్రావస్తి రాజ్యాన్ని పాలించిన వీరుడి కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోందని సమాచారం తెలుస్తోంది.


మన దేశంలోని గొప్ప రాజులలో సహేల్ దేవ్ కూడా ఒకరు. కానీ నేటి తరం ప్రజలకు పెద్దగా తెలియని ఈ రాజు కథతో సినిమా తీస్తే బాక్సాఫీస్ షేక్ అవుతుందని ఫ్యాన్స్ కూడా ఫీలవుతున్నారు. బాలీవుడ్ లో సంజయ్ లీలా భన్సాలీ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న దర్శకులలో ఒకరు కాగా ఈ దర్శకుడి టాలెంట్ కు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ఈ దర్శకుడు తెరకెక్కించిన చాలా సినిమాలు ఇండస్ట్రీని షేక్ చేశాయి.సంజయ్ లీలా భన్సాలీ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో కూడా ఫ్యాన్స్ ను మెప్పిస్తారని అభిమానులు ఫీలవుతున్నారు. సంజయ్ లీలా భన్సాలీ పాన్ వరల్డ్ రేంజ్ సినిమా తీసినా ఆశ్చర్యానికి గురి కావాల్సిన అవసరం లేదని చరణ్ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ కాంబో మూవీకి నిర్మాత ఎవరనే ప్రశ్నకు ఇంకా జవాబు దొరకాల్సి ఉంది.  రామ్ చరణ్ రెమ్యునరేషన్ కూడా ప్రస్తుతం భారీ రేంజ్ లో ఉంది. మరి ఈ సినిమాపై అధికారికంగా న్యూస్ ఎప్పుడొస్తుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>