MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/krish2939a9fe-22d1-4a40-b6af-9ffecf60eeba-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/krish2939a9fe-22d1-4a40-b6af-9ffecf60eeba-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు సినిమాని రెండేళ్ల క్రితం డైరెక్టర్ క్రిష్ ఎన్నో ఆశలతో ఎంతో గ్రాండ్ గా స్టార్ట్ చేశారు. అయితే ఈ సినిమా ఆరంభం నుంచి చాలా అవాంతరాలు ఎదుర్కొంటూనే ఉంది.అసలు ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్ కాల్ షీట్స్ కేటాయించలేకపోయారో లేక ఇతర కారణాల వలన ఆలస్యం అవుతూ వచ్చిందో తెలియదు కానీ ఇప్పటికి సినిమా షూటింగ్ కంప్లీట్ కాలేదు. ఈ మూవీ పూర్తి కావాలంటే పవన్ కళ్యాణ్ మరో 40 రోజుల కాల్ షీట్స్ ఇవ్వాలట. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎన్నికలలో చాలా బిజీలో ఉన్నారు. ఎలక్షన్స్ తర్వాత ఓజీ సినిమKrish{#}anoushka;harish shankar;kalyan;m m keeravani;Uttarandhra;Election;Mister;Blockbuster hit;Hero;Cinema;News;Directorహరిహర వీరమల్లు నుంచి తప్పుకున్న క్రిష్?హరిహర వీరమల్లు నుంచి తప్పుకున్న క్రిష్?Krish{#}anoushka;harish shankar;kalyan;m m keeravani;Uttarandhra;Election;Mister;Blockbuster hit;Hero;Cinema;News;DirectorSat, 10 Feb 2024 18:53:53 GMTపవర్ స్టార్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు సినిమాని రెండేళ్ల క్రితం డైరెక్టర్ క్రిష్ ఎన్నో ఆశలతో ఎంతో గ్రాండ్ గా స్టార్ట్ చేశారు. అయితే ఈ సినిమా ఆరంభం నుంచి చాలా అవాంతరాలు ఎదుర్కొంటూనే ఉంది.అసలు ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్ కాల్ షీట్స్ కేటాయించలేకపోయారో లేక ఇతర కారణాల వలన ఆలస్యం అవుతూ వచ్చిందో తెలియదు కానీ ఇప్పటికి సినిమా షూటింగ్ కంప్లీట్ కాలేదు. ఈ మూవీ పూర్తి కావాలంటే పవన్ కళ్యాణ్ మరో 40 రోజుల కాల్ షీట్స్ ఇవ్వాలట. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎన్నికలలో చాలా బిజీలో ఉన్నారు. ఎలక్షన్స్ తర్వాత ఓజీ సినిమాని కంప్లీట్ చేయాల్సి ఉంది. దాని తర్వాత హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పూర్తి చేసి హరిహర వీరమల్లుపై ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉంది. ఇక రీసెంట్ గా క్రిష్ ఆ పవన్ కళ్యాణ్ ప్రాజెక్టు నుంచి తప్పికున్నట్లు టాక్ గట్టిగానే వచ్చింది. క్రిష్ దర్శకత్వంలో వీరమల్లు సినిమా ఉండకపోవచ్చని టాక్.


ప్రస్తుతం క్రిష్ తన కొత్త ప్రాజెక్టుతో బిజీ అయ్యాడు. అనుష్క లీడ్ రోల్ లో ఫీమేల్ సెంట్రిక్ మూవీ ఒకటి స్టార్ట్ చేశారు.యూవీ క్రియేషన్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. తాజాగా ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లినట్లు సమాచారం తెలుస్తోంది. ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా ఈ మూవీని క్రిష్ స్టార్ట్ చేసేసాడంట. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ సెట్ వేశారంట. ఇందులోనే కీలక సన్నివేశాల షూటింగ్ మొదలైందని సమాచారం వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథ ఉంటుందట. అంటే దీనిని బట్టి ఈ మూవీలో అనుష్క పాత్ర ఉత్తరాంధ్ర స్లాంగ్ లో మాట్లాడుతుందని స్పష్టం అవుతోంది. తనకి జరిగిన అన్యాయంపై పోరాటం చేసే ఒక సాధారణ అమ్మాయిగా అనుష్క ఈ సినిమాలో కనిపించబోతోందని సమాచారం తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో ఓ యంగ్ హీరో కూడా నటిస్తున్నాడట. అయితే అతను ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.వేదం సినిమా తర్వాత క్రిష్, అనుష్క కాంబినేషన్ లో వస్తోన్న మూవీ కావడంతో కాస్తా హైప్ ఉంది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీతో అనుష్క గత ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకుంది. ఈ మూవీ గ్రామీణ నేపథ్యంలో ఉంటుందని సమాచారం తెలుస్తోంది. మరి ఆమె పాత్రని క్రిష్ ఎలా చూపించబోతున్నాడు వేచి చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>