MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgసంక్రాంతి సినిమాల జాతర తరువాత సమ్మర్ రేస్ సినిమాల హడావిడి ప్రారంభం కావడానికి రెండు నెలల సమయం ఉంటుంది. దీనితో ఏప్రియల్ నుండి అంచనాలు బాగా ఉన్న సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. అయితే కరోనా సమయం నుండి ఈ లెక్కలు తప్పి సినిమాలు ఎవరికి సౌకర్యం ఉన్న సమయంలో వారు విడుదల చేసుకుంటున్నారు.ప్రేక్షకులు కూడ ఎవరికి నచ్చిన సినిమాను వారు చూస్తున్నారు. ఏప్రియల్ మొదటి వారంలో తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు జరగబోతున్న నేపధ్యంలో ఫిబ్రవరి నెలాఖరు నుండి పరీక్షల సీజన్ మొదలు కాబోతోంది. అయితే ఈ పరీక్షలను పట్టించుకోకుండా కొన్నtollywood{#}vijay deverakonda;Coronavirus;Mass;Telugu;Winner;Elections;Ravi;Industry;Jr NTR;February;March;Cinemaముందుగానే మొదలైన సమ్మర్ జాతర !ముందుగానే మొదలైన సమ్మర్ జాతర !tollywood{#}vijay deverakonda;Coronavirus;Mass;Telugu;Winner;Elections;Ravi;Industry;Jr NTR;February;March;CinemaSat, 10 Feb 2024 13:17:01 GMTసంక్రాంతి సినిమాల జాతర తరువాత సమ్మర్ రేస్ సినిమాల హడావిడి ప్రారంభం కావడానికి రెండు నెలల సమయం ఉంటుంది. దీనితో ఏప్రియల్ నుండి అంచనాలు బాగా ఉన్న సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. అయితే కరోనా సమయం నుండి ఈ లెక్కలు తప్పి సినిమాలు ఎవరికి సౌకర్యం ఉన్న సమయంలో వారు విడుదల చేసుకుంటున్నారు.


ప్రేక్షకులు కూడ ఎవరికి నచ్చిన సినిమాను వారు చూస్తున్నారు. ఏప్రియల్ మొదటి వారంలో తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు జరగబోతున్న నేపధ్యంలో ఫిబ్రవరి నెలాఖరు నుండి పరీక్షల సీజన్ మొదలు కాబోతోంది. అయితే ఈ పరీక్షలను పట్టించుకోకుండా కొన్ని భారీ సినిమాలు మరికొన్ని మీడియం రేంజ్ సినిమాలు ఫిబ్రవరి మార్చి నెలల్లో క్యూ కడుతూ ఉండటం హాట్ టాపిక్ గా మారింది.


లేటెస్ట్ గా విడుదలైన రవితేజా ‘ఈగల్’ తో ఈ సంవత్సరం సమ్మర్ రేస్ చాల ముందుగానే ప్రారంభం అయింది. ఈ నెలలోనే ‘ఊరు పేరు భైర‌వ కోన’ విడుదలకాబోతోంది. ఇక మార్చి మొదటివారంలో ‘ఆప‌రేష‌న్ వాలెంటైన్’ ఆతరువాత వారం రోజులకు గోపీ చంద్ మాస్ మూవీ ‘భీమా’  తో పాటు విశ్వ‌క్సేన్ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేసిన ‘గామి’ విడుద‌ల కాబోతున్నాయి.


మూవీ పై బాగా అంచనాలు ఉన్నాయి. మార్చి నెలాఖరులో సిద్దూ జొన్నలగడ్డ నటించిన ‘టిల్లు స్క్వేర్’ రాబోతోంది. ఆతరువాత ఏప్రియల్ లో రాబోతున్న ఉగాది పండుగకు విజయ్ దేవరకొండ నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ రాబోతోంది. ఆపై జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ తో పాటు మరికొన్ని భారీ సినిమాలు క్యూ కట్టబోతున్నాయి. దీనితో ఈ సంవత్సరం సమ్మర్ ఎక్కువగా ఉంటుంది అన్న అంచనాలు ఉన్న నేపధ్యంలో ఈ సమ్మర్ ను లెక్క చేయకుండా సగటు ప్రేక్షకుడు ఈ సమ్మర్ రేస్ కు రాబోతున్న ఎన్ని సినిమాలను ఆదరించి నిర్మాతలకు కోట్లు కురిపిస్తాడు అన్న అంచనాలతో ఇండస్ట్రీ వర్గాలు ఉన్నాయి. దీనితో ఈ సమ్మర్ రేస్ విజేత ఎవరు అన్న ఆశక్తి అందరిలోనూ ఉంది..  













మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>