PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan--narendra-modi1c76cd17-07f5-4ee5-b673-c6cd06f64eed-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan--narendra-modi1c76cd17-07f5-4ee5-b673-c6cd06f64eed-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఈసారి ఎవరు గెలుస్తారో అని చర్చ నడుస్తుంది. జగన్ కి పోటీగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు ఈసారి సోదరి షర్మిళ కూడా పోటీ చేయనుంది. ఇదిలా ఉండగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బాగా బిజీగా ఉన్నారు. ఈ రోజు తన పార్టీ ఎంపీలతో కలిసి పార్లమెంట్‌కు వెళ్లారు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి. ముందుగా పార్లమెంట్ భవనంలో ప్రధాని మోడితో సమావేశం అవ్వడం జరిగింది.పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో గంటన్నర పాటు ప్రధాని మోదీ – సీఎం జగన్‌‎ మోహన్ రెJagan - Narendra Modi{#}editor mohan;SV Mohan Reddy;Parliment;Jagan;CBN;Andhra Pradesh;kalyan;Amit Shah;Yevaru;Prime Minister;News;Delhi;Telangana Chief Minister;CM;Party;Electionsమోడీని కలిసిన జగన్‌‎.. చర్చించిన అంశాలు ఇవే?మోడీని కలిసిన జగన్‌‎.. చర్చించిన అంశాలు ఇవే?Jagan - Narendra Modi{#}editor mohan;SV Mohan Reddy;Parliment;Jagan;CBN;Andhra Pradesh;kalyan;Amit Shah;Yevaru;Prime Minister;News;Delhi;Telangana Chief Minister;CM;Party;ElectionsFri, 09 Feb 2024 17:20:23 GMTఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఈసారి ఎవరు గెలుస్తారో అని చర్చ నడుస్తుంది. జగన్ కి పోటీగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు ఈసారి సోదరి షర్మిళ కూడా పోటీ చేయనుంది. ఇదిలా ఉండగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బాగా బిజీగా ఉన్నారు. ఈ రోజు తన పార్టీ ఎంపీలతో కలిసి పార్లమెంట్‌కు వెళ్లారు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి. ముందుగా పార్లమెంట్ భవనంలో ప్రధాని మోడితో సమావేశం అవ్వడం జరిగింది.పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో గంటన్నర పాటు ప్రధాని మోదీ – సీఎం జగన్‌‎ మోహన్ రెడ్డిల మీటింగ్‌ సాగింది. ఎన్నికల ముందు వీరిద్దరి భేటీ చాలా కీలకంగా మారింది. పెండింగ్‌ బిల్లులు, విభజన హామీలతో పాటు.. తాజా రాజకీయ అంశాలపైనా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం తెలుస్తోంది. ఢిల్లీ వచ్చిన ప్రతిసారీ ఆంధ్రప్రదేశ్ అంశాల్ని ప్రస్తావిస్తూనే వచ్చారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. అలాగే ప్రధానికి కొన్ని వినతిపత్రాలు కూడా ఇస్తూ వచ్చారు.


ఐతే.. ఈసారి మీటింగ్‌ అనేది చాలా సుదీర్ఘంగా జరగడం బట్టి చూస్తే.. రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం తెలుస్తోంది.ఈ రోజు 11 గంటల 10 నిమిషాలకు సీఎం జగన్‌ మోహన్ రెడ్డి ప్రధాని ఛాంబర్‌కి వెళ్లడం జరిగింది. ఇక ఆ సమయంలో ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్‌ అయిన మురళీధరన్‌ కూడా అక్కడే ఉన్నారు. జగన్‌ మోహన్ రెడ్డి వెళ్లిన కాసేపటికి మురళీధరన్‌ బయటకు వచ్చేశారు. హోమంత్రి అమిత్‌షా కూడా ఆ సమయంలో ప్రధాన మంత్రి ఛాంబర్‌లోనే ఉన్నారు. ప్రధాన మంత్రి మోదీ తర్వాత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా జగన్‌ భేటీ అవ్వడం జరిగింది. ఏపీకి రావల్సిన నిథులపై ఆయన చర్చించారు. ఇదిలా ఉంటే రెండ్రోజుల క్రితం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయ్యారు. నిన్న ఢిల్లీ నుంచి చంద్రబాబు బాబు నాయుడు తిరిగి వచ్చిన తరువాత జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ప్రధాన మంత్రితో భేటీ కావడంతో తాజా రాజకీయాల పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>