Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhonie14a8f30-92f0-4699-93b6-511e82be82e7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhonie14a8f30-92f0-4699-93b6-511e82be82e7-415x250-IndiaHerald.jpgసాదరణంగా అంతర్జాతీయ క్రికెట్లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతూ ఎప్పుడు మంచి ప్రదర్శనలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న వారికి అటు సోషల్ మీడియాలో కూడా మంచి బ్రాండ్ వాల్యూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎప్పుడైతే ఒక ఆటగాడు ఇక క్రికెట్కు వీడ్కోలు పలుకుతాడో ఆ క్రికెటర్ తో ప్రమోషన్స్ చేయించుకోవాలని పెద్దగా కంపెనీలు ఆసక్తి చూపించవు. కానీ మహేంద్ర సింగ్ ధోనీ విషయంలో మాత్రం ఇదంతా రివర్స్ లో జరుగుతూ ఉంటుంది.అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత కూడా ధోని బ్రాండ్ వాల్యూ ఎక్కడ తగ్గలేదు. ప్రస్తుతం భారతDhoni{#}MS Dhoni;prasad;Chennai;Guntur;INTERNATIONALCSK కొత్త కెప్టెన్ ను.. వెతుక్కోవాల్సిన టైం వచ్చేసింది : MSKCSK కొత్త కెప్టెన్ ను.. వెతుక్కోవాల్సిన టైం వచ్చేసింది : MSKDhoni{#}MS Dhoni;prasad;Chennai;Guntur;INTERNATIONALFri, 09 Feb 2024 10:50:00 GMTసాదరణంగా అంతర్జాతీయ క్రికెట్లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతూ ఎప్పుడు మంచి ప్రదర్శనలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న వారికి అటు సోషల్ మీడియాలో కూడా మంచి బ్రాండ్ వాల్యూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎప్పుడైతే ఒక ఆటగాడు ఇక క్రికెట్కు వీడ్కోలు పలుకుతాడో ఆ క్రికెటర్ తో ప్రమోషన్స్ చేయించుకోవాలని పెద్దగా కంపెనీలు ఆసక్తి చూపించవు. కానీ మహేంద్ర సింగ్ ధోనీ విషయంలో మాత్రం ఇదంతా రివర్స్ లో జరుగుతూ ఉంటుంది.అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత కూడా ధోని బ్రాండ్ వాల్యూ ఎక్కడ తగ్గలేదు.


 ప్రస్తుతం భారత జట్టులో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న వారితో పోల్చి చూస్తే ధోనినే ఎక్కువగా వానిజ్య ప్రకటనల్లో కనిపిస్తూ ఉంటాడు అని చెప్పాలి. అయితే 2019లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ధోని.. ప్రస్తుతం కేవలం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా కొనసాగుతున్నాడు. అయితే ఇక ఇంటర్నేషనల్ కెరీర్ కు వీడ్కోలు పలికిన నాటి నుంచి ధోని ఆడిన ప్రతి ఐపీఎల్ సీజన్ అతనికి చివరిది అంటూ ప్రచారం జరుగుతూనే వస్తుంది. ఇక ఇలాంటి ప్రచారం ప్రచారం గానే మిగిలిపోయింది. ధోని మాత్రం ప్రతి సీజన్లో కొనసాగుతూనే వస్తున్నాడు. ఇప్పుడు 2024 ఐపీఎల్ సీజన్లో కూడా ఆడేందుకు సిద్ధమవుతున్నాడు.


 ఈ క్రమంలోనే ధోని ఒకవేళ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నుంచి తప్పుకుని వీడ్కోలు ప్రకటిస్తే ఆ జట్టుకు ఉన్న బ్రాండ్ వాల్యూ మొత్తం తగ్గిపోతుంది అని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయంపై అటు టీమిండియా మాజీ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ కూడా స్పందించాడు. చెన్నై సూపర్ కింగ్స్ కు భవిష్యత్తు నాయకుడిని సంసిద్ధం చేయాల్సిన సమయం వచ్చేసింది అంటూ అభిప్రాయపడ్డాడు. ధోని లేని చెన్నై జట్టును ఊహించలేం. వయస్సు రిత్యా అతడికి ఇదే చివరి ఐపీఎల్ కావచ్చు. ధోని తర్వాత ఆ జట్టుని నడిపించే నాయకుడిని సంసిద్ధం చేయాలి. సీఎస్కే లో ఛాన్స్ దక్కించుకున్న గుంటూరు ఆటగాడు షేక్ రషీద్ కి ఈ ఐపీఎల్ ఎంతో కీలకం. సత్తా చాటితే అతను టీమిండియాలోకి కూడా వచ్చే ఛాన్స్ ఉంది అంటూఎమ్మెస్ కె ప్రసాద్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>