MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgఇండియాలో పెద్దగా ఇంగ్షీషు సినిమాలు చూడని వారికి కూడ జేమ్స్ క్యామరూన్ పేరు సుపరిచితం. ‘టైటానిక్’ ‘టెర్మినేటర్’ ‘అవతార్’ సినిమాలతో ఈప్రపంచ ప్రఖ్యాత దిగ్గజ దర్శకుడు ప్రస్తుతం ‘అవతార్ 3’ తీస్తున్న విషయం తెలిసిందే. సినిమా స్క్రీన్ పై విజువల్ వండర్స్ సృష్టించడంలో అతడిని మించిన దిట్ట ప్రపంచంలో మారెవ్వరు లేరు. ఈమధ్య అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో మారియట్ బర్ బ్యాంక్ ఎయిర్ పోర్ట్ హోటల్ లో జరిగిన ఒక హాలీవుడ్ అవార్డు వేడుకలకు అతడు అతిధిగా వచ్చాడు. అక్కడకు వచ్చిన అమెరికన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఇRAJAMOULI{#}Hollywood;Darsakudu;Athadu;Bank;James Cameron;Rajamouli;media;India;Indian;Director;Cinemaజేమ్స్ క్యామరూన్ మాటలతో ఆలోచనలలో పడ్డ రాజమౌళి !జేమ్స్ క్యామరూన్ మాటలతో ఆలోచనలలో పడ్డ రాజమౌళి !RAJAMOULI{#}Hollywood;Darsakudu;Athadu;Bank;James Cameron;Rajamouli;media;India;Indian;Director;CinemaFri, 09 Feb 2024 13:56:46 GMTఇండియాలో పెద్దగా ఇంగ్షీషు సినిమాలు చూడని వారికి కూడ జేమ్స్ క్యామరూన్ పేరు సుపరిచితం. ‘టైటానిక్’ ‘టెర్మినేటర్’ ‘అవతార్’ సినిమాలతో ఈప్రపంచ ప్రఖ్యాత దిగ్గజ దర్శకుడు ప్రస్తుతం ‘అవతార్ 3’ తీస్తున్న విషయం తెలిసిందే. సినిమా స్క్రీన్ పై విజువల్ వండర్స్ సృష్టించడంలో అతడిని మించిన దిట్ట ప్రపంచంలో మారెవ్వరు లేరు.



ఈమధ్య అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో మారియట్ బర్ బ్యాంక్ ఎయిర్ పోర్ట్ హోటల్ లో జరిగిన ఒక హాలీవుడ్ అవార్డు వేడుకలకు అతడు  అతిధిగా వచ్చాడు. అక్కడకు వచ్చిన అమెరికన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఇండియన్ సినిమా పై కొన్ని ఆశక్తికర కామెంట్స్ చేశాడు. తనకు సినిమాలు తీసే విషయంలో స్టీవెన్ స్పిల్బర్గ్ లూకాస్ లాంటి ఎందరి నుంచో తాను స్ఫూర్తి పొందిన విషయాన్ని తెలియ చేస్తూ  ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ చూసిన తరువాత తాను రాజమౌళి అభిమానిగా మారిన విషయాన్ని తెలియచేశాడు.



ప్రస్తుతం ఇండియన్ సినిమాల స్థాయి హాలీవుడ్ సినిమాలతో పోటీ పడుతోందని రానున్న రోజులలో ఇండియా నుండి చాలమంచి సినిమాలు వచ్చే ఆస్కారం ఉంది అంటూ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈకామెంట్స్ రాజమౌళి పై మరింత బాధ్యత పెంచాయి. ప్రస్తుతం మహేష్ తో రాజమౌళి తీయబోతున్న మూవీ బడ్జెట్ 1000 కోట్ల స్థాయిలో ఉంటుందని ఈమూవీ ఇండియానా జోన్స్ తరహాలో ప్రేక్షకులకు మరొక అద్భుతాన్ని పరిచయం చేస్తుంది అని అంటున్నారు.



జేమ్స్ క్యామరూన్ లాంటి ప్రముఖ దర్శకులు కూడ మహేష్ తో జక్కన్న తీయబోతున్న సినిమా గురించి అత్యంత ఆశక్తిగా ఎదురు చూస్తున్న నేపధ్యంలో రాజమౌళి తన లేటెస్ట్ మూవీని పూర్తి చేసి విడుదల చేయడానికి 2026 వచ్చినా ఆశ్చర్యం లేదు అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు. దీనికి తగ్గట్టుగానే మహేష్ కూడ జక్కన్న మూవీ పూర్తి అయ్యేంతవరకు తాను వేచి చూడటమే కాకుండా ఈమూవీ పూర్తి అయ్యేంతవరకు తాను మరొక సినిమా కథ వినను అని చెపుతున్నాడు అంటే మహేష్ కమిట్మెంట్ ఏమిటో అర్థం అవుతుంది..






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>