MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/eagle-7ff64caf-d0ea-4a9d-b7d8-f4c2b3fa9bd1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/eagle-7ff64caf-d0ea-4a9d-b7d8-f4c2b3fa9bd1-415x250-IndiaHerald.jpgగత సంవత్సరం రావణాసుర.. టైగర్ నాగేశ్వరరావు సినిమాలతో దెబ్బ తిన్నాడు మాస్ రాజా రవితేజ. ఆయనకు ఇప్పుడు ఈగల్ ఎంతో ముఖ్యమైన సినిమా. కెమెరామన్ టర్న్డ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని రూపొందించిన ఈ సినిమా ఈ రోజే మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ మధ్య అనవసరమైన ఎలివేషన్స్ ఇచ్చే సినిమాలు ఎక్కువ అయిపోయాయి. KGF 2 సినిమా వచ్చాక చాలా మంది డైరెక్టర్స్ ఎలివేషన్స్ ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు. ఈ ఈగల్ కూడా అలాంటిదే. ఎలివేషన్స్ కొన్ని సార్లు వర్క్ ఔట్ అయితే విక్రమ్, KGF లEagle {#}Akkineni Nageswara Rao;Idea;Karthik;KGF;Mass;Director;Hero;Cinemaఈగల్ సినిమా ఎలా ఉందంటే?ఈగల్ సినిమా ఎలా ఉందంటే?Eagle {#}Akkineni Nageswara Rao;Idea;Karthik;KGF;Mass;Director;Hero;CinemaFri, 09 Feb 2024 13:18:31 GMTగత సంవత్సరం రావణాసుర.. టైగర్ నాగేశ్వరరావు సినిమాలతో దెబ్బ తిన్నాడు మాస్ రాజా రవితేజ. ఆయనకు ఇప్పుడు ఈగల్ ఎంతో ముఖ్యమైన సినిమా. కెమెరామన్ టర్న్డ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని రూపొందించిన ఈ సినిమా ఈ రోజే మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ మధ్య అనవసరమైన ఎలివేషన్స్ ఇచ్చే సినిమాలు ఎక్కువ అయిపోయాయి. kgf 2 సినిమా వచ్చాక చాలా మంది డైరెక్టర్స్ ఎలివేషన్స్ ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు. ఈ ఈగల్ కూడా అలాంటిదే. ఎలివేషన్స్ కొన్ని సార్లు వర్క్ ఔట్ అయితే విక్రమ్, kgf లాంటి బ్లాక్ బస్టర్స్ వస్తాయి. వర్క్ ఔట్ కాకపోతే మాత్రం, మైఖేల్, సలార్ లా నిరాశపరుస్తాయి. మరి ఈగల్ సినిమా ఎలాంటి సినిమానో సూటిగా సుత్తిలేకుండా తెలుసుకుందాం.


ఓపెన్ మైండ్ తో చూస్తే  సినిమా డీసెంట్ గానే అనిపించవచ్చు. కానీ కథను నరేట్ చేయడంలో అవసరం లేని ఎలివేషన్ ఈ చిత్రానికి సమస్యగా మారింది.ఇక ఇంతకుముందు ఓ సరికొత్త ఐడియాతో 'సూర్య వెర్సస్ సూర్య' అనే వెరైటీ సినిమా తీశాడు డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని. అతని ఐడియా వర్క్ ఔట్ అయింది.ఈసారి తను ఎంచుకున్న కథ మరీ కొత్తగా అనిపించకపోయినా.. స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేయాలని ప్రయత్నించాడు.ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే కలిగించదు . హీరో పాత్రను నిగూఢంగా ఉంచుతూ.. దాని పట్ల క్యూరియాసిటీ పెంచడంలో డైరెక్టర్ విజయవంతం అయ్యాడు. ఐతే ముందే అన్నట్లు హీరో పాత్రకు ఒక్కొక్కరు ఇచ్చే బిల్డప్పే ఓవర్ అయింది. ఎంతకీ అసలు విషయంలోకి వెళ్లకుండా కనిపించిన ప్రతి ఒక్కరూ అతనో ఉత్పాతం.. అతను చేసింది మామూలు విధ్వంసం కాదు అంటూ బిల్డప్పులివ్వడానికే చాలా టైం పట్టేసింది. తీరా హీరో రంగంలోకి దిగాక అతను కేవలం మామూలుగానే కనిపిస్తాడు. తన పాత్ర యాక్టివేట్ కావడానికి చాలా టైం పడుతుంది.


ఫస్ట్ హాఫ్ చాలా వరకు బోరింగ్ గానే అనిపిస్తుంది. సెకండాఫ్ లో యాక్షన్ మోతాదు పెరగడంతో 'ఈగల్' సినిమా ఊపందుకుంటుంది.  యాక్షన్ ఘట్టాన్ని చాలా స్టైలిష్ గా.. భారీగా.. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా తీర్చిదిద్దాడు కార్తీక్ ఘట్టమనేని.ఇక హీరో-హీరోయిన్ మధ్య ప్రేమకథలో గన్ను కీలక పాత్ర పోషించడం వెరైటీ. కానీ ఈ ఎపిసోడ్లో ఎమోషన్ అనేది అనుకున్నంత స్థాయిలో పండలేదు. ట్విస్టులు అయితే ఒక్కొక్కటి రివీల్ కావడంతో చివరి అరగంటలో సినిమా ఎంగేజింగ్ గానే అనిపిస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే మూవీ పర్వాలేదు అనిపిస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>