Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/eagles-9143804f-644c-4689-b066-df2bbe47d6e7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/eagles-9143804f-644c-4689-b066-df2bbe47d6e7-415x250-IndiaHerald.jpgఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ డైరెక్టర్లకు అవకాశాలు దక్కడం చాలా కష్టంగా ఉండేది. ఎవరో ఒక హీరో దయతలిస్తే తప్ప ఇక ఇతరుల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా కొనసాగుతున్న వారు డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసేందుకు అవకాశం వచ్చేది కాదు. కానీ ప్రస్తుతం టాలీవుడ్ లో ట్రెండ్ పూర్తిగా మారిపోయింది.ఇటీవల కాలంలో కొత్త దర్శకులే అటు ప్రేక్షకులను ఎక్కువగా మెప్పించ గలుగుతున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సెన్సేషనల్ విజయాలను సాధించగలుగుతున్నారు. దీంతో ఇక ఇలాంటి ట్రెండ్ చూసిన తర్వాత స్టార్ హీరోలు సైతం సీనియEagles {#}Mass;Ravi;ravi teja;Tollywood;Telugu;Success;Director;Hero;Cinemaరవితేజ మూవీకి.. 'ఈగల్' టైటిల్ పెట్టడానికి కారణం అదేనట?రవితేజ మూవీకి.. 'ఈగల్' టైటిల్ పెట్టడానికి కారణం అదేనట?Eagles {#}Mass;Ravi;ravi teja;Tollywood;Telugu;Success;Director;Hero;CinemaFri, 09 Feb 2024 11:00:00 GMTఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ డైరెక్టర్లకు అవకాశాలు దక్కడం చాలా కష్టంగా ఉండేది. ఎవరో ఒక హీరో దయతలిస్తే తప్ప ఇక ఇతరుల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా కొనసాగుతున్న వారు డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసేందుకు అవకాశం వచ్చేది కాదు. కానీ ప్రస్తుతం టాలీవుడ్ లో ట్రెండ్ పూర్తిగా మారిపోయింది.ఇటీవల కాలంలో కొత్త దర్శకులే అటు ప్రేక్షకులను ఎక్కువగా మెప్పించ గలుగుతున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సెన్సేషనల్ విజయాలను సాధించగలుగుతున్నారు.


 దీంతో ఇక ఇలాంటి ట్రెండ్ చూసిన తర్వాత స్టార్ హీరోలు సైతం సీనియర్ డైరెక్టర్లతో సినిమాలు చేయడం కంటే కొత్త డైరెక్టర్లతో సినిమాలు చేస్తే ఇక సూపర్ హిట్లు కొట్టవచ్చు అని నమ్మకం పెట్టుకుంటున్నారు. దీంతో చాలామంది హీరోలు తమ ప్రతి సినిమా విషయంలో కూడా కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తూ ఉండడం చూస్తూ ఉన్నామ్. ఇలా ఛాన్సులు దక్కించుకుంటున్న కొత్తవాళ్లు తమ ప్రతిభ ఏంటో నిరూపించుకోవడంలో సక్సెస్ అవుతున్నారు. అయితే ఇక ఇప్పుడు ఇలాగే తన సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని.


 మాస్ మహారాజ రవితేజ ను హీరోగా పెట్టి ఈగల్ అనే సినిమా తీశాడు. అయితే ఈ మూవీపై మొదటి నుంచి భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. ఇక నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు ఈగల్ అనే టైటిల్ ని ఎందుకు పెట్టాడు అన్న విషయాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు డైరెక్టర్ కార్తీక్. ఈ మూవీలో హీరో పేరు ఈగల్ అని ఉంటుందట. అందుకే సినిమా టైటిల్ ని కూడా అదే పెట్టాము అంటూ డైరెక్టర్ కార్తీక్ తెలిపాడు. క్లైమాక్స్ షూటింగ్ పూర్తి చేసేందుకు దాదాపు 17 రాత్రులు సమయం పట్టింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాలోని క్లైమాక్స్ ప్రేక్షకులను సర్ ప్రైస్ చేస్తుంది  అంటూ తెలిపాడు డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>