MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan--trivikram2e3a15f4-08ae-4802-aa46-9337fe8b12d5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan--trivikram2e3a15f4-08ae-4802-aa46-9337fe8b12d5-415x250-IndiaHerald.jpgగుంటూరు కారం సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోయే సినిమాల మీద మీడియాలో చాలా రకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. అసలైతే అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అనౌన్స్ చేశారు.కానీ బన్నీ మాత్రం పుష్ప 2 సినిమా తర్వాత అట్లీ డైరెక్షన్ లో సినిమా చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారట. అలాగే సందీప్ వంగ సినిమా కూడా లైన్ లో ఉంది. అయితే అల్లు అర్జున్ బాగా బిజీ కాబట్టి మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో గురూజీ సినిమా లైన్ చేస్తున్నట్టు సమాచారం తెలుస్తుంది. త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఇప్పటి దాకా రామ్ చరణ్ సినిRam Charan - Trivikram{#}Red chilly powder;trivikram srinivas;Yevaru;sandeep;Ram Charan Teja;atlee kumar;mahesh babu;Pawan Kalyan;Allu Arjun;News;Yuva;Telugu;Hero;Cinema;Audience;India;ram pothineniత్వరలో రామ్ చరణ్ తో త్రివిక్రమ్ సినిమా?త్వరలో రామ్ చరణ్ తో త్రివిక్రమ్ సినిమా?Ram Charan - Trivikram{#}Red chilly powder;trivikram srinivas;Yevaru;sandeep;Ram Charan Teja;atlee kumar;mahesh babu;Pawan Kalyan;Allu Arjun;News;Yuva;Telugu;Hero;Cinema;Audience;India;ram pothineniThu, 08 Feb 2024 18:19:32 GMTగుంటూరు కారం సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోయే సినిమాల మీద మీడియాలో చాలా రకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. అసలైతే అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అనౌన్స్ చేశారు.కానీ బన్నీ మాత్రం పుష్ప 2 సినిమా తర్వాత అట్లీ డైరెక్షన్ లో సినిమా చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారట. అలాగే సందీప్ వంగ సినిమా కూడా లైన్ లో ఉంది. అయితే అల్లు అర్జున్ బాగా బిజీ కాబట్టి మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో గురూజీ సినిమా లైన్ చేస్తున్నట్టు సమాచారం తెలుస్తుంది. త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఇప్పటి దాకా రామ్ చరణ్ సినిమా చేయలేదు.ఈ కాంబినేషన్ మెగా ఫ్యాన్స్ కే కాదు ఆడియన్స్ కి కూడా కొత్తగా ఉంటుంది. రామ్ చరణ్ ప్రస్తుతం కమిటైన సినిమాలు పూర్తి కాగానే ఈ సినిమా ఉంటుందని సమాచారం తెలుస్తుంది.రామ్ చరణ్ తో సినిమా ఓకే చేసుకుని మరోపక్క ఓ యువ హీరోతో సినిమా కూడా ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్. ముందు ఆ యంగ్ హీరో సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి అది కొంత పూర్తి చేసి మళ్లీ రామ్ చరణ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ చూస్తారని తెలుస్తుంది.అలా త్రివిక్రం ఒకేసారి రెండు సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఒకటి రామ్ చరణ్ తో ఉంటుందని తెలుస్తుండగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో చాన్స్ అందుకున్న ఆ యువ హీరో ఎవరన్నది మాత్రం ఇంకా తెలియట్లేదు. నాని, రామ్ ఇద్దరి పేర్లు అయితే బాగా వినిపిస్తున్నాయి.


వాళ్లిద్దరిలో ఎవరు డేట్స్ ముందు ఇస్తే వారితో సినిమా చేయడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ రెడీ అవుతున్నాడు.గుంటూరు కారం సినిమా విషయంలో త్రివిక్రమ్ మార్క్ కనిపించినా కానీ ఆయన ఈ సినిమా విషయంలో డ్యూటీ చెయ్యలేదనే టాక్ బాగా వచ్చింది. అందువల్ల నెగటివ్ టాక్ విపరీతంగా వచ్చింది.అయితే అక్కడ ఉన్నది సూపర్ స్టార్ మహేష్ బాబు కాబట్టి ఆయన క్రేజ్ ఇంకా చరిష్మాతో సినిమా వసూళ్లు గట్టిగా రాబట్టింది ఈ సినిమా.కానీ త్రివిక్రమ్ సరిగ్గా డ్యూటీ చేయలేదన్న మాట వాస్తవమే. మరి తరువాత రాబోయే సినిమాల్లో అయినా ఈ మాట రాకుండా చేసుకుంటే బెటర్. త్రివిక్రమ్ రెండు సినిమాల ప్లానింగ్ బాగానే ఉన్నా ముందు ఏ సినిమా అనౌన్స్ చేస్తారు.. ఎప్పుడు మొదలు పెడతారు వంటి విషయాలు ఆడియన్స్ ని ఎగ్జైట్ అయ్యేలా చేస్తున్నాయి. తెలుగు స్టార్ హీరోలంతా కూడా ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలే ఎక్కువగా చేస్తున్నారు. త్రివిక్రమ్ చరణ్ సినిమా కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారని సమాచారం. రామ్ చరణ్ తర్వాత ఎన్.టి.ఆర్ సినిమా ఆ తర్వాత మళ్లీ పవన్ తో త్రివిక్రం సినిమా చేస్తారని సమాచారం తెలుస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>