MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood2f26987c-b245-4648-8acd-19777831684e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood2f26987c-b245-4648-8acd-19777831684e-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ హీరోగా కీర్తి సురేశ్, వామికా గబ్బి హీరోయిన్స్ గా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా #VD18 పేరుతో పిలుస్తున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇటీవలే టైటిల్ తో పాటు టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాకి 'బేబీ జాన్' అనే టైటిల్ని ఖరారు చేస్తూ రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టుకుంది టీజర్ లో వరుణ్ ధావన్ ను పవర్ ఫుల్ పాత్రలో ప్రెజెంట్ చేశారు. మునుపెన్నడూ చూడని యాక్షన్‌ అవతార్ లో చూపించి ఆకట్టుకున్నారు. దీనికి తగ్గట్టుగానే తమన్ కంపోజ్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ tollywood{#}Varun Dhawan;atlee kumar;jaaki;kirti;thaman s;Kollywood;Amy Jackson;Jio;Dalapathi;Avatar;Joseph Vijay;Remake;kalyan;bollywood;Posters;shankar;Cinema;varun sandesh;varun tej;Hindi;Director;Blockbuster hit;Tamil;Heroine'తేరీ' హిందీ రిమేక్.. రిలీజ్ ఎప్పుడంటే?'తేరీ' హిందీ రిమేక్.. రిలీజ్ ఎప్పుడంటే?tollywood{#}Varun Dhawan;atlee kumar;jaaki;kirti;thaman s;Kollywood;Amy Jackson;Jio;Dalapathi;Avatar;Joseph Vijay;Remake;kalyan;bollywood;Posters;shankar;Cinema;varun sandesh;varun tej;Hindi;Director;Blockbuster hit;Tamil;HeroineThu, 08 Feb 2024 12:35:00 GMTబాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ హీరోగా కీర్తి సురేశ్, వామికా గబ్బి హీరోయిన్స్ గా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా #VD18 పేరుతో పిలుస్తున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇటీవలే టైటిల్ తో పాటు టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాకి 'బేబీ జాన్' అనే టైటిల్ని ఖరారు చేస్తూ రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టుకుంది టీజర్ లో వరుణ్ ధావన్ ను పవర్ ఫుల్ పాత్రలో ప్రెజెంట్ చేశారు. మునుపెన్నడూ చూడని యాక్షన్‌ అవతార్ లో చూపించి ఆకట్టుకున్నారు. దీనికి తగ్గట్టుగానే తమన్ కంపోజ్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. 2016లో కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ 'తేరీ' చిత్రానికి అధికారిక రీమేక్ గా 'బేబీ జాన్' తెరకెక్కుతోంది. 

తమిళ్ లో దళపతి విజయ్, సమంత, అమీ జాక్సన్ కలిసి నటించారు. ఇప్పుడు ఆ పాత్రల్లో వరుణ్ ధావన్, కీర్తి సురేశ్, వామికా గబ్బి కనిపించనున్నారు. ఇందులో బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్, రాజ్‌ పాల్ యాదవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ మరో అప్డేట్ అందించారు. 'బేబి జాన్' మూవీ విడుద‌ల తేదీని ఆఫీషియల్ మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. సమ్మర్ కానుకగా మే 31, 2024 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సినిమాకను రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ పోస్టర్లో వరుణ్ ధావన్ బీస్ట్ మోడ్లో కనిపించారు. ఒంటిపై రక్తపు మరకలు, పొడవాటి జుట్టుతో ఉన్న వరుణ్ ధవన్ సీరియస్ లుక్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచేసింది.

 ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. 'జవాన్' సినిమాతో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ అందుకున్న కోలీవుడ్ డైరెక్టర్ ట్లీ ఈ సినిమాతో నిర్మాతగా హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు. జియో స్టూడియోస్ సమర్పణలో ఏ ఫర్ యాపిల్, సినీ1 స్టూడియోస్‌ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు కలీస్ దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు ఇదే 'తేరి' మూవీని తెలుగులో కమర్షియల్ డైరెక్టర్ హరిష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో కలిసి 'ఉస్తాద్ భగత్ సింగ్' పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే 'తెరి' లోని మెయిన్ పాయింట్ ని తీసుకొని పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కి సూట్ అయ్యే విధంగా తనదైన స్టైల్ లో హరిష్ శంకర్ ఈ సినిమాని రీమేక్ చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>