MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood2983d052-88d4-435b-a24c-a6765e6fdbe1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood2983d052-88d4-435b-a24c-a6765e6fdbe1-415x250-IndiaHerald.jpg'డీజె టిల్లు' సినిమాతో సిద్ధు జొన్నల్లగడ్డ ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్‌ను, క్రేజ్‌ను సంపాదించుకున్నాడో అందరికీ తెలిసిందే. చిన్న సినిమాగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది ఇక ఈ సినిమాతో సిద్దు జొన్నలగడ్డ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఈ క్రేజ్‌ను కంటిన్యూ చేయడం కోసమే గత సంవత్సరం నుంచి 'డిజే టిల్లు' సీక్వెల్‌పై వర్క్ చేస్తున్నాడు సిద్ధు. ఇది పూర్తయ్యే వరకు ఇతర కమిట్మెంట్స్ పెట్టుకోకూడదు అని బలంగా ఫిక్స్ అయ్యాడు. ఇక 'డీజె టిల్లు' సీక్వెల్ అయిన 'టిల్లు స్క్వేర్' షూటింగ్ పూర్తి tollywood{#}bhaskar;siddhu;Baba Bhaskar;Comedy;Bommarillu;Sri Venkateswara Cine Chitra;Posters;Traffic police;Cinema;wednesday;Audience;prasad;Successసిద్ధు జొన్నలగడ్డ సినిమాకి హాలీవుడ్ టైటిల్సిద్ధు జొన్నలగడ్డ సినిమాకి హాలీవుడ్ టైటిల్tollywood{#}bhaskar;siddhu;Baba Bhaskar;Comedy;Bommarillu;Sri Venkateswara Cine Chitra;Posters;Traffic police;Cinema;wednesday;Audience;prasad;SuccessThu, 08 Feb 2024 12:05:20 GMT'డీజె టిల్లు' సినిమాతో సిద్ధు జొన్నల్లగడ్డ ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్‌ను, క్రేజ్‌ను సంపాదించుకున్నాడో అందరికీ తెలిసిందే. చిన్న సినిమాగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది ఇక ఈ సినిమాతో సిద్దు జొన్నలగడ్డ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఈ క్రేజ్‌ను కంటిన్యూ చేయడం కోసమే గత సంవత్సరం నుంచి 'డిజే టిల్లు' సీక్వెల్‌పై వర్క్ చేస్తున్నాడు సిద్ధు. ఇది పూర్తయ్యే వరకు ఇతర కమిట్మెంట్స్ పెట్టుకోకూడదు అని బలంగా ఫిక్స్ అయ్యాడు. ఇక 'డీజె టిల్లు' సీక్వెల్ అయిన 'టిల్లు స్క్వేర్' షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతుండగా.. తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలోనే వరుస ప్రాజెక్ట్స్ కి కమిట్ అవుతున్నాడు.

రీసెంట్ గానే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా ఓ సినిమా ప్రారంభమైంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై BVSN ప్రసాద్ సినిమా నిర్మిస్తున్నారు. SVCC37 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. బుధవారం సిద్దు జొన్నలగడ్డ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్దు జనులగడ్డ హీరోగా నటిస్తున్న చిత్రానికి 'జాక్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు తాజాగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతుంది ఇందులో సిద్ధు ఈసారి యాక్షన్ మోడ్ లో తన స్టైలిష్ లుక్ తో  ఆకట్టుకున్నాడు.

 అంతేకాకుండా రెండు చేతుల్లో రెండు గన్స్ తో కనిపించాడు. అందులో ఒక గన్ ఒరిజినల్, మరొకటి బొమ్మ తుపాకి. సో మోషన్ పోస్టర్ ని బట్టి ఈ సినిమా యాక్షన్ అండ్ కామెడీ కలబోతగా ఉంటుందని అర్థమవుతుంది. ఫస్ట్ టైం సిద్దు గన్ పట్టుకొని కనిపించడంతో సినిమాలో ఏమైనా పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడా? అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. అంటే మోషన్ పోస్టర్, టైటిల్ ని బట్టి సిద్ధు స్టైలిష్ కాప్ గా కనిపించే అవకాశాలు లేకపోలేదు. ఇక 'జాక్' అనే టైటిల్ కింద 'కొంచం క్రాక్' అని రాసి ఉంది. ఈ ట్యాగ్ లైన్ సినిమాలో సిద్ధు క్యారెక్టర్ ని రిప్రెజెంట్ చేసేలా ఉందని చెప్పొచ్చు. మొత్తంగా ఈ సినిమాలో ఓ సరికొత్త సిద్దు ని బొమ్మరిల్లు భాస్కర్ చూపించడం గ్యారెంటీ అని మోషన్ పోస్టర్ తోనే అర్థమవుతుంది.

 



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>